JE Jobs in Central Govt
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జేఈ ఉద్యోగాలు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా/ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్నవారు వీటికి పోటీ పడవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు కేంద్రప్రభుత్వ సంస్థల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) హోదాతో విధులు నిర్వర్తించవచ్చు. వీరికి లెవెల్ 6 పేస్కేల్ ప్రకారం వేతనాలు అందుతాయి.
Reliance Permanent WFH Jobs Recruitment | 2022 : Https://Www.Prudhviinfo.Com/2022/08/Reliance-Permanent-Wfh-Jobs-Recruitment.Html
Amazon Hyderabad Latest New Recruitment | 2022: Https://Www.Prudhviinfo.Com/2022/08/Amazon-Hyderabad-Latest-New-Recruitment.Html
అర్హతలు: డిప్లొమా (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) లేదా తత్సమాన డిగ్రీ చదివినవారు అర్హులు.
వయసు: 18-32 ఏళ్ల మధ్య ఉండాలి.
పరీక్ష: రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్-1ను ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. పేపర్-2 ఆఫ్లైన్లో డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్లు చెల్లించనవసరం లేదు).
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 02.09.2022,
ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 03.09.2022.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-1) షెడ్యూల్: నవంబర్, 2022,
ఆఫ్లైన్ పరీక్ష (పేపర్-2): తేదీని తరువాత ప్రకటిస్తారు.
వెబ్సైట్: https://ssc.nic.in/