-->

మన సంపూర్ణాహారం ఏది? | What is our perfect food?

What is our perfect food?
మన సంపూర్ణాహారం ఏది?

++++++++++++++++++++

ఆహారంలో ఉండే స్థూలమైన భాగం ఈ శరీరాన్ని నిర్మిస్తే, సూక్ష్మమైన అంశం మన మనస్సుగా రూపొందుతుందని పెద్దలు ఏనాడో చెప్పారు. మనం సంపూర్ణాహారం తింటే ఇవి రెండూ సంపూర్ణంగా తయారవుతాయి. మట్టి మంచిదైతే కుండ గట్టిగా ఉంటుంది. మనం సంపూర్ణాయుష్షుతో, సంపూర్ణారోగ్యంతో జీవించాలంటే మనం సంపూర్ణాహారాన్నే ఈ శరీరానికి అందించాలి. ఏ రంగు ఇంకు పెన్నులో పోస్తామో ఆ రంగు రాతే బయట కనబడుతుంది. మన బ్రతుకు కూడా ఇంతే. ఈ సత్యాన్ని గ్రహిస్తే విషయం సులభమౌతుంది. లేదా ఆరోగ్యమనేది జీవితంలో అర్థం కాదు. ఈ ప్రకృతిలో భూమిపై జీవించే జీవరాశులలో ఎక్కువ భాగం తినే ఆహార పదార్థాలను ముఖ్యంగా ఆరు జాతులుగా విభజించవచ్చు. అవి ఆకుజాతి, కూరగాయలజాతి, దుంపజాతి, పండ్లజాతి, గింజ జాతి, మాంస జాతి మొ||నవి. ఏదన్నా ఒక జాతి జంతువులు సామాన్యంగా ఒకే జాతి ఆహారాన్ని జీవిత కాలమంతా తిని జీవిస్తూ ఉంటాయి. ఉదాహరణకు మేకల ఆహారం ఏమిటని అడిగితే అందరూ ఆకులని చెబుతారు. పులి ఆహారం అంటే మాంసం అని, చిలుక ఆహారం. అంటే పండ్లని, పావురాయిలు ఆహారం అంటే గింజలని ఇలా అందరూ ఒకే సమాధానం చెబుతారు. ఆ జీవులన్నీ ఈ ప్రకృతిలో తమ కొరకు తయారైన జాతి ఆహారాన్ని తిని మిగతా జాతి ఆహారాన్ని ముట్టనుకూడా ముట్టవు. ఉదా॥కు మేకలు చెట్టుకుండే ఆకులను తిని కాయలు గానీ, పండ్లు గానీ, వాటి గింజలు గానీ కనిపించినా వదిలేస్తాయి. దాని అవసరం ఆకులద్వారా తీరాక ఇంకా మిగతా వాటితో పనేముందని మేకకు బాగా తెలుసు. ఇక మన విషయానికొద్దాము. మనిషి ఆహారం ఏదీ అంటే అందరూ నవ్వుకుంటారే తప్ప సమాధానం చెప్పరు. అన్ని జంతువుల విషయంలో వెంటనే సమాధానం వచ్చింది.


. కానీ మన ఆహారం గురించి అడిగితే మనకే తెలియడం లేదు. ఆ జంతువులు: ఏమి తింటే మనకెందుకు మనమేది తినాలో మనకు తెలియాలిగానీ, ఆలోచించి. చివరకు మనిషి చెప్పే సమాధానం. ఆ ఆరు జాతులు మనవేనని. కనపడ్డ ప్రతిదీ మనదే, ఒక జాతి అనే విచక్షణ మానవజాతికి లేదు. నానాజాతి సమితి లాగా, అన్నింటిని కలబోసి కూరడం తెలిసింది. అందుకే, నానా జాతి రోగాలన్నీ కలిపి ఒక్క మానవ శరీరాన్నే ఎన్నుకుంటున్నాయి. మానవుడు అన్ని జీవులు కంటే గొప్ప జీవి, కాబట్టి అన్ని జాతులు ఆహారాలలో గొప్ప ఆహారమేదో. తెలుసుకుని దాన్నే తినగలిగితే మంచిది. ఆ గొప్ప జాతి ఏదో తెల్సుకుందాము..


సంపూర్ణాహారము అంటే సకల పోషక పదార్థాలను కలిగిన ఆహారము. అని అర్ధము. అన్నీ కలిపి ఒకే దానిలో దొరికే సూపర్ మార్కెట్ లాగా సూపర్ ఆహారాన్ని, ఆ ఒక్కదాన్నే తిన్నా మనకు అన్నీ అందుతాయి. మనకు అప్పుడు, అది చాలింది, ఇది చాల్లేదు ఇది ఉంది, అది లేదు అని గొడవ ఉండదు. శరీరానికి ముఖ్యంగా ఏడు రకాల పోషక పదార్థాలు ప్రతిరోజూ అవసరం. అవి పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ మరియు పీచుపదార్థాలు. ఈ ఏడు పోషక పదార్థాలు ఏ జాతి ఆహారములో వుంటాయో అది మనకు సంపూర్ణాహారం, కూరగాయలలో మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు సరిగా ఉండవు. మిగతావి ఐదు బాగానే ఉంటాయి. పండ్లలో కూడా ఇంతే. దుంపలలో అయితే ఒక్క పిండి పదార్థాలే ఎక్కువ తప్ప మిగతావి సరిగా ఉండవు. ఆకులలో అయితే క్రొవ్వు పదార్థాలు తప్ప మిగతావి అన్నీ ఉంటాయి. మాంసాహారం అయితే, అది అన్నింటికంటే నీచమైన జాతి. మానవ జాతి ముట్టకూడని జాతి. అందుకే మన పెద్దలు దానికి నీచు అని పేరు పెట్టారు. గింజలలో అయితే శరీరానికి కావలసిన ఏడు పోషక పదార్థాలూ ఉంటాయి. ముఖ్యముగా కావలసిన అన్ని రకాల మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఎన్జైమ్లు పుష్కలంగా ఉంటాయి.


మాంసకృత్తుల వల్ల శరీరానికి కండపుష్టి, క్రొవ్వు పదార్థాల వల్ల మేధాశక్తి, ఆయుష్షు లభిస్తూ ఉంటాయి. గింజజాతి ఆహారాన్ని సంపూర్ణ ఆహార జాతి అని చెప్పవచ్చు. ఈ రహస్యం మనకు తెలియడం లేదు గానీ మన పూర్వీకులకు ఏనాడో తెలిసింది. అందుచేతనే, దేవుడి ప్రసాదాలలో గింజలను (వడపప్పు, కొబ్బరి) పెట్టారు. ఈ రూపంలోనైనా గింజలను తింటే బాగుపడతారని. పేరంటాలలో పెసలు, శెనగలు, నువ్వుల చిమిలి, పెళ్ళిళ్ళలో, కర్మకాండలలో నవధాన్యాలు మొ||నవి పెట్టి మన చేత తినిపించారు. కోడిపుంజులకు, ఎద్దులకు పందాలకు ముందు గింజలనే పెడతారు. మేధాశక్తి విషయానికొస్తే, బ్రాహ్మణులకు ఉన్న తెలివితేటలు, మేధాశక్తి ఇతర కులస్తులకు ఉండక పోవడం అందరూ గమనించే ఉంటారు. వారు ముఖ్యంగా వెనుకటి రోజుల్లో నవధాన్యాలను బాగా తిని, ఆ రకమైన పవర్ను పెంచుకున్నారు. మనం కూడా ఇకనుండీ ఆ గింజలను రోజులో ఒక్కసారి తిన్నా శరీర అవసరాలన్నీ తీరుతాయి. కాబట్టి తినే ప్రయత్నం చేద్దాము. గింజలను తినమన్నామని సపోటా గింజలను, సీతాఫలం గింజలను కూడా తినకండి. ఏ గింజలను తినాలో, ఎలా తినాలోవివరంగా తెల్సుకుందాము.

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT