-->

స్ట్రెస్ మేనేజ్మెంట్స | (Stress management)

స్ట్రెస్ మేనేజ్మెంట్స(Stress management)

*****************

మానవ జీవితంలో వేగం ఎప్పుడయితే ప్రవేశించిందో అప్పుడే రకరకాల మానసి ఒత్తిడులు మనిషిని కృంగదీయడం మొదలైంది. ఇంటా బయట ఎన్నో సమస్యలు, ఉద్యోగులు వ్యాపారులు, విద్యార్థులు, గృహిణులు ఇలా అన్ని వర్గాలవారు పరుగెత్తు కాలంతో సమంగా పరుగెత్త లేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు... మానసిక ప్రశాంతత లోపిస్తే ఏ పని పట్ల శ్రద్ధ వహించడం సాధ్యపడదు... అందుకే మానసిక ఒత్తిడి అంటే ఏమిటి? దాన్నుండి ఎలా బయట పడాలి అనేది ఈ చాప్టర్లో తెలుసుకుందాం!

"ట్వంటీయత్ సెంచరీ ఈజ్ ఎన్ ఏజ్ ఆఫ్ ఎంక్సైటీ" అన్నాడొక ఆంగ్ల రచయితే ఆధునిక యుగం జెట్ యుగం. అంతా స్పీదు. ఏ వ్యక్తి కూడా ప్రశాంతంగా వుండలేదు వుని వాడు వుండనట్లే, మానసిక వత్తిడికి లోనుకానివాడు కూడా వుండదు.

మన తాత ముత్తాతలకి యింత ఒత్తిడి లేదు. ప్రశాంత గ్రామీణ వాతావరణంలో మంచి పౌష్టికాహారం తీసుకుంటూ హాయిగా, ఆరోగ్యంగా, ఏ చీకు చింత లేకుండా బ్రతికారు మనకాలం వచ్చేసరికి కలి ప్రభావం బాగా కనబడుతూ వుంది. కలి అంటే అవినీతి అబద్ధాలు, ఆవేదన, అంతఃక్షోభ ఆవేశకావేశాలు మొదలయినవి మానవ ప్రకృతిలో తాండవిస్తూ వుంటాయి. అహింస అన్న పదం పదకోశంలో కనపడడు. ఎక్కడ చూసినా హింస రాజ్యం చేస్తోంది. మనం సాంకేతిక యుగంలో జీవిస్తున్నాం. దాని స్పీడుకు తట్టుకోలేకపోతున్నాం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు మానసికా ఒత్తిడులు, ఆవేదన, ప్రతి వారిలో బి.పి. పెరిగిపోవడం మనం నిత్య జీవితంలో గమనిస్తున్నాం. మానసిక ఒత్తిళ్ళు అనేక రకాలుగా ఏర్పడతాయి. చేసే పనిని బట్టి ఒత్తిడ ప్రభావం పని చేస్తుంది. ఏ బాదరబందీ లేకుండా ఇంటి పనులు చక్కదిద్దుకునే ఇల్లాలిక్ కూడా మానసిక ఒత్తిడి ప్రభావం అధికంగా వుంటుంది. ఇంటి ఇల్లాలి బాధలు

అసలే దోమల బాధతో నిద్ర పట్టడు, తెల్లవారుజామునే పాలవాడు పెద్ద హోరు పెడుతూ "పాలమ్మా... లేవాలి... రావాలి... " అంటూ బెల్లు మ్రోగించి కూడా ఆ వీధిలో వాళ్లంతా

పెడబొబ్బలు పెడతారు. అక్కడితో ఇల్లాలు అలజడి జీవితం తరువాత పిల్లలను స్కూల్ కుతయారు చేసి పంపడం, భర్తకు అన్నీ అమర్చి అన్ని పనులు ఉదయం 9.30 గంటలలోగానే పూర్తి కావాలి. అయటికి వెళ్లగానే కొంత మనశ్శాంతి కలుగుతుంది. పోనీ కాసేపు నడుం వలుదాము అనుకుంటూ వుండగానే స్నేహితులు, చుట్టాలు, ప్రక్కింటి నుండి అప్పులకి వచ్చే వాళ్లతో తలనొప్పి వ్యవహారం. ప్రశాంతంగా తలుపులు మూసుకుని పడుకుందాం అనుకుంటే ఎవరోకరు సిద్ధం, వారితో మాట్లాడుతూ వుండగానే మరొకరు మరొకరు. గోవడం అనవసరపు బాతాఖానీ ఈలోగా కొంచెం పక్కింటి పద్మగారిని నొక్కసారి. పిలుస్తారా?" అర్జంటండీ అని ఎవరో ఫోను.



. పోను మ్రోగుతుంది. వచ్చి తీసేలోగా ఆగిపోతుంది. మళ్ళీ కాస్త నడుం నాలుద్దామనుకునేలోగా మళ్లీ ఫోను మ్రోగుతుంది. మనకి వచ్చే ఫోన్లలో సంగంకు పైగా మనకి వచ్చినవి కావు. వారిని పిలవండి. వీరిని పిలవండి అంటూ వస్తాయి. ఇవికాక రాంగ్ నెంబర్లు కొన్ని ఫోను వొక పెద్ద 'హెడ్ ఏక్! మన మానసిక ఒత్తిడిని ఈ ఫోను మరింత అధికం చేస్తుంది. పోని పక్కన పెడదామా? మనసొప్పదు ఎవరయినా మనకి చేస్తారేమో. ముఖ్యమైన సమాచారం అందించదలచిన వారికి నిరాశ కలుగుతుంది కదా! గ్యాస్ అంటూ గ్యాస్ వాళ్లు వస్తారు. ఒకసారి మిస్సవుతే మళ్లీ వాళ్లు రారు. వాళ్లలకి జవాబు చెప్పడం వొక పెద్ద తలనొప్పి మనింటి కొచ్చి యితరుల అడ్రస్సులు అడుగుతారు. మీరు తీసుకోండి. తరువాత వాళ్లు వచ్చిన తరువాత వారికివ్వండి. పోయినసారి చిర మీ యింట్లోనే మీకిచ్చి వెళ్లమన్నారు అని అంటాడు. ఈ తలనొప్పి వ్యవహారాలు కొన్ని గృహిణికి మధ్యాహ్నం పూట కూడా నడుం వాల్చే అవకాశం వుండదు. ఇంతలో 4 గంటలుఅవుతుంది. పిల్లలు స్కూలు నుంచి తయారు. మరో గంటలో హజ్బెండు కరు మళ్లీ కాఫీలు, టిఫిన్లు వంట, వార్పులు, భోజనాలు, రాత్రి 11.00. నిద్రపోదామా ఆoటే దోమలు విపరీతం.


 👉ఆర్థికపరమైన ఒత్తిడి:-

సగటు మనిషి ఆదాయం వందల్లో వుంటే ఖర్చు మాత్రం వేలల్లో వుంటుంది. అందుకు మీద అప్పులు అవి తీర్చడానికి సతమతమవడం, అప్పులు తీర్చడానికి కొత్త

అప్పులు చేయడం పూర్వము అతిముఖ్యమైనది తోనే కొనే వారం ఇప్పుడలా కాదు ప్రతి వస్తువు అతి ముఖ్యం గా నే తోస్తూ ఉంది అవసరాలు పెరిగిపోయాయి ఆశలు మితిమీరి పోయాయి ఆశయాలూ కథలు అంతేలేదు జీవితం దుర్భరమైంది ఏ వస్తువు మార్కెట్ లో సరసమైన నిర్దిష్ట ధరలకు లభ్యం కావు అన్ని నల్లబజారు ధరలే... పెట్రోల్ గ్యాస్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి

క్యూలో నిలబడితే మల్లా ఇంటి మొహం చూసేదెప్పుడో, కొన్ని సందర్భాలలో కూడా దొరకక నిరాశ, నిస్పృహలతో అంత సేపు క్యూలో నిలబడి ఇల్లు చేరుతారు.

"నో బడిఈజ్ హ్యాపీ నౌ" ఎవరూ సుఖంగా లేరు ప్రతీ రంగంలో పోటీ, ఎంతో హా పరుగెత్తలేకపోతున్నాం. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతూ అమిత మైనఒత్తిడికి లోనవుతుంటారు వివాహం తర్వాత భార్యభర్తలిద్దరికి మానసిక వత్తిడి, బతకడం నొక పెద్ద సమస్యగా మారింది. లైఫ్ గ్యారంటీ లేదు. లైఫ్ సెక్యూరిటీ లేదు. జాబ్ గ్యారెంటీ లేదు.

గర్భిణీ స్త్రీలకు మానసిక ఒత్తిడి వుండరాదు. బహిస్టు అయిన వారిలో మానసిక హెచ్చుగా వుంటుంది. బహిష్టులు ఆగిపోయే సమయంలో స్త్రీలకు మానసిక వత్తిడి విపరీతం వుంటుంది. వయస్సు పైబడిన కొద్ది రిటైర్మెంట్ అయిన తరువాత వారికి పిల్లల వివహలుచేయలేదని, చదువులు పూర్తికాలేదని మానసికంగా క్షోభకు గురి అవుతూ వుంటా జీవితాలు దుర్భరమై ఉద్యోగాల కొరకు దూర ప్రదేశాలకు తరలివెళ్లడం, భాగస్వాములను కోల్పోవడం, వారి వినియోగాల వల్ల మానసిక ఒత్తిళ్లు యేర్పడు వుంటాయి.

మానసికమైన వొత్తిడి 'స్ట్రెస్సు' అయితే శారీరకమైన వత్తిడిని ''స్ట్రెయిన్' అంట 'డ్రెస్సు' వల్ల (స్ట్రెయిన్ ఏర్పడుతుంది.

"సైస్సు అవసరమే కాని అది తగు మోతాదులో మాత్రమే వుండాలి. ఎక్కువైనా ప్రమాద తక్కువయినా మంచిదికాదు. డైనమిక్ మనిషికి పని వత్తిడి వుంటేనే జీవించగలగుతా ఆరోగ్యంగా జీవించాలంటే అతనికి స్ట్రెస్సు అవసరం. పని వత్తిడి తప్పనిసరిగా వుండా కొందరికి పని లేకపోతే ఏమీ తోచదు. పని కావాలని కల్పించుకుంటారు.

"రిటైర్ అయ్యారు కదా కాస్త యిప్పుడైనా విశ్రాంతి తీసుకోరాదూ” అంటుంది భార్య వినడు ఏదో పని కల్పించుకుని చేస్తాడు. అది అతనికి సరదా. ఏ పని లేకు తోట పని చేస్తాడు. రోజు 10 నుండి 18 గంటలు పని చేసేవారు మనలో వున్నారు. వారు ఏలఆరోగ్యంగా, ఆనందంగవుంటున్నారు. వొత్తిడి అవసరమే. కాని విపరీతమైన ఒత్తిడి పనికిరాదు.

👉 రక రకాల ఒత్తిళ్లు;-

మనకు నిత్యజీవితంలో ఒత్తిడిని కలిగించే విషయాలు కుటుంబ విషయాలు, వృత్తి పరమైన విషయాలు, వైవాహిక సంబంధాల వల్ల కలిగే ఒత్తిడికలిగే ఒత్తిళ్లు.

ఉద్యోగాల విషయమైన ఒత్తిళ్ళు భద్రతకు ముప్పు వాటిల్లడం వల్ల కలిగే ఒత్తిళ్లు జీవితంలో అనుకున్నది సాధించలేక పోవడం వాళ్లకి వల్ల కలిగిన ఒత్తిళ్లు .సరైన స్టిమ్యులేషన్ జీవితంలో ఏర్పడక కలిగే మానసిక ఒత్తిళ్ళు. శారీరకంగా ఈ ఒత్తిళ్లు ఏర్పడడానికి తగిన కారణాలు ఏమిటి ?మనిషి మానసికపరమైన ఒత్తిడికి గురవుతారు ఏం జరుగుతుంది?

 మనిషి మెదడులోని కార్టెక్స్, సభకారైక్స్, లింటెక్ సిమ్, హైపో ఆడినాల్ గ్రంధులు, అసంకల్పిత నాడీమండలం యివన్సీ చాలా స శరీరంలోని గుండెను, జీర్ణకోశాన్ని, చర్మం, కండరాలను ప్రభావితం చేయా అవయవాలలో కొన్ని అనారోగ్య లక్షణాలు బహిర్గతమవుతాయి. అవి గుండె జబ్బులకు దారితీస్తాయి. గుండె జబ్బులు వారిని విశ్లేషిస్తే రెండు రకాలంగా మనస్తత్వాలున్నవారు బయటపడతారు. వీరిని ఏ మరియు టైపుగా విభజించారు. 

టైప్ "ఏ" వారు పట్టుదలగా, కాంపిటేటివ్ స్పిరిటీతో ఏదో జీవితంలో అనుకుంటూ వుంటారు. వారిలో నిత్యం యేదో సాధించాలనే తపన కనిపిస్తూ వుంటుంది. వారు ఎల్లప్పుడూ రెస్ట్స్ గా తిరుగుతూ వుంటారు.


టైప్ 'బి' వారు సాదాసీదాగా వుంటారు. దీనిని సీరియస్గా తీసుకోరు. ఎప్పుడూ హాపీగా జీవితాన్ని సాఫీగా సాగనిస్తూ వుంటారు. 'టైన్ 'ఎ' వారికి హెచ్చుగా గుండెజబ్బులు వస్తాయి.

గ్యాస్ట్రిక్ అల్సర్స్ వస్తాయి . వారిహెచ్చుగా స్ట్రెస్సుకు గురి అవుతారు. మానసికంగా ఎప్పుడూ స్ట్రెస్స్సులో వుంటారు. ఆందోళన, భయం, నిద్రలేమితనం, గుండెదడ, ఓణుకు, చెమటలు పట్టడం, మాటిమాటికి బాత్రూంకి వెళ్లడం, అనీజీగా, రెస్ట్ గా వుండడం ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, మనస్సు సంతోషంగా లేకపోవడం, చిరాకు, కోపం - దిగులుగా వుండడం. వీటి మూలంగా నలుగురిలోకి రాలేకపోవడం. పనిలో సామర్థ్యం తగ్గడం. ఇలాంటి బ్బందులెన్నో ఎదురవుతూ వుంటాయి. శరీర అనారోగ్యత వల్ల వారు హెచ్చుగా బాధపడుతూ వుంటారు. గుండెనొప్పి, కడుపులో మంట, ఫెస్టిక్ అల్సర్స్ అవుతాయి. పలురకాల చర్మ వ్యాధులు, ఉబ్బరం, రక్తపోటు ఇర్రిటిబుల్ బలహీనతలు ఏర్పడుతూ వుంటాయి.

చిన్న పిల్లలలో కూడా యీ వొత్తిడి కనిపిస్తుంది. వారు నోట్లో వేళ్లు పెట్టుకోవడం, గోళ్లు కొరకడం, నిద్రలో మూత్ర విసర్జన చేసుకోవడం, నిద్రలో నడవడం, మాట్లాడడం, కలవరించడం చేస్తారు టెన్షన్ వల్ల కొందరు ఆహారం తీసుకోరు మరికొందరు టెన్షన్ ఉన్నప్పుడే అధిక ఆహారం తీసుకుంటారు. స్ట్రెస్ వల్ల ఇబ్బంది పడే బదులు అది తగ్గించుకోవడం వస్తాము కదా ఎక్కువ ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు కదా మానసిక ఒత్తిడి తగ్గించుకునే విధానాన్ని"రిలాక్సేషన్" అంటారు


👉 రిలాక్సేషన్ అవసరము!

మనిషి రిలాక్స్ కావడానికి అనేక మార్గాలున్నాయి ఎవరికి తోచింది వారు అవలంబించవచ్చు. మెడిటేషన్ ప్రాణాయామం యోగా ఆసనాలు వేయడం ప్రార్థన చేయడం అంతేకాకుండా హిప్నోసిస్ సెల్ఫీ మొదలగు అనేక ఆధునిక

పద్ధతులు కలవు. స్నేహితులతో సరదాగా పిక్నిక్ కి వెళ్లడం మనకి మనకి ఇష్టమైన వ్యాపకాలు పెట్టుకోవడము గేమ్స్ ఆడడం, మూవీ చూడటం, సంగీతం వినడం వల్ల రిలాక్సేషన్ పొందవచ్చు. ప్రతీ రోజు కొన్ని నిముషాల పాటు రిలాక్స్ కావడం అతని ఆరోగ్యానికి

ఎంతో అవసరము మనసుకి శరీరానికి కొంత రెస్ట్ ఇవ్వాలి

, ఉద్రేకాలుతగ్గించు కోవాలి.

లేకపోతే ప్రమాదం.

రుగ్మతలను పెంచే మానసిక వత్తిళ్లను గురించి కొంత తెలుసుకుందాం:--

భయాలు,ఆందోళనలు, కోపం, చికాకు విసుగుదల, డిప్రెషన్, విచారం, దిగులు, ఆత్మాన్మన్యూనతా భావన, కుటుంబ సమస్యలు, వృత్తిలో పని వత్తిళ్లు, ప్రతీ విషయానికి అతిగా స్పందించడం మొదలయినవి మానసిక రుగ్మతల క్రిందకి వస్తాయి. వీటి ప్రభావం శరీరం మీద తప్పక చూపుతాయి.

వాహనాలు నడిపే డ్రైవర్లకు ఎటువంటి మానసిక వత్తిళ్లు ప్రమాదాలను తెచ్చిపెడతాయని పాశ్చాత్య దేశాలలో జరిపిన ప్రయోగాల మూలంగా తేల్చారు. మనిషి ముఖంపై వచ్చే మొటిమల నుండి గుండె జబ్బుల వరకు, తలనొప్పి నుండి కీళ్ళ నొప్పుల వరకు, చర్మవ్యాధుల నుండి క్యాట్సర్ వ్యాధుల వరకు - పెస్టిక్ అల్సర్స్ మొదలయినవి కొత్తికవల్ల యేర్పడతాయి. మానసిక పరమైన (వల్ల శారీరకమైన (స్ట్రెయిన్

సుమారు 90 శాతం వ్యాధులన్నీ మానసిక రుగ్మతల మూలంగానే యేర్పడతాయనేది. వైద్య శాస్త్ర నిపుణులు వరి కోరకల మూలంగా తేల్చారు. మానసిక వొత్తిడి మూలంగా కొత్త వ్యాధి సోకడానికి లేదా అంతకు పూర్వమే వున్న వ్యాధి మరింత తీవ్రం అవడానికి అవకాశం స్తుంది. ఇది వంశపారంపర్యంగా రావడానికి అవకాశముంది. శరీర దార్థత్వ మున్నప్పటికి మానసిక బలహీనత వ్యాధి సోకే అవకాశం ఎంతో వుంది.

దుమ్మువల్ల, ధూళి వల్ల, పూల పుప్పొడి వల్ల, చేప, మాంసం మొదలైనవి. శరీరానికి పడకపోవడం వల్ల కొంతమందికి ఉబ్బసం, చర్మంపై దద్దుర్లుతో కూడిన దురదలు, జలుబు, ఎలర్జీకి సంబంధించిన వ్యాధులు, ఉబ్బసం కూడా ఎలర్జీ వల్ల వస్తుంది. మానసిక ఒత్తిదులు వ్యాధులను మరింత ఉధృతం చేస్తాయి. శరీరంలోని తెల్ల రక్త కణాలు సైనికుల్లా పని చేసి రోగ కారక క్రిముల్ని అంతం చేస్తాయి. ఇవి 'ఇమ్యూనో గ్లోబిన్ ఇ' అనే యాంటీ బాడీసన్ను ఉత్పత్తి చేస్తాయి. అయితే మానసిక వత్తిడి వల్ల తెల్ల రక్తకణాలు శరీడానికి ఉపయోగపడే పదార్థాలను కూడా పొరపాటున శత్రువులుగా భావించి ఐ.జి.ఇ ద్వారా బాడి చేయిస్తాయి. ఈ దాడి ఫలితంగా మనిషిలో ఎలర్జీ ఏర్పడుతుంది. అదేవిధంగా వొక వయస్సులోని వారికి కీళ్ల నొప్పులు యేర్పడుతాయి. వాటిని 'ఆల్రైటీస్' అంటారు. ఈ బాధ రాకుండా నివారించుకోవచ్చును. ఎలా? ఎల్లప్పుడూ సంతోషంగా, నిర్విచారంగా వుంటే వారికి ఈ వ్యాధులు సోకవు. జీవితాంతం వారు హేపీగా వుంటారు.

డిప్రెషన్, దీర్ఘకాల కోపం, కోపం మ్రింగుకుని సంచరించే వారికి యీ వ్యాదులు సోకుతాయని ప్రయోగాల వల్ల తేలింది. తరువాత కూడా మానసిక వత్తిడుల వల్ల బాధలు ఎక్కువ అయ్యాయని తేలింది.

పిల్లల్లో మానసిక వత్తిళ్లు రావడానికి మూల కారణాలు చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడం, లేదా తల్లి తండ్రులు విడాకులు తీసుకోవడం వల్ల వారిలో డిప్రెషన్ కలుగుతుంది.

స్కూలు మాస్టర్లంటే భయం వుంటే పిల్లలకి స్కూలుకు వెళ్లే ముందు కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులు, రాత్రిపూట పక్క తడపడం వంటి బాధలు వస్తాయి. సెలవుల్లో పిల్లలు చాలా ఆరోగ్యంగా వుంటారు. వారికి స్కూలు భయం వుండదు. మీరు గమనించే వుంటారు. దీనికి కారణం కేవలం వారికి స్కూలు అంటే వున్న భయమే కారణం.


👉మానసిక వత్తిడి వల్ల కలిగే వ్యాధులు .

మానసిక వత్తిడుల మూలంగా తలనొప్పి, వెన్నుపోటు యేర్పడుతూ వుంటాయి. తలకండరాలు కుంచించుకుని పోవడం వల్ల వీపు నొప్పి (చెన్నునొప్పి) యేర్పడుతుంది. ఆశయసిద్ధి.కోసం పాటుబడేవారు. ఇతరుల మెప్పుకొరకుకష్టపడేవారు, విమర్శలకు స్పందించేవారికి ఈ బాధలు ఎక్కువగా కనిపిస్తాయి. కాని యిలాంటి పరిస్థితులను కూడా సంతోషంతోఎదుర్కొనే వారికి ఈ బాధలు రావు, మానసిక ఒత్తిడులు, లైంగిక దోషాలకి దారి తీస్తాయి. కేంద్రీనాడీ మండలం మానసిక వొత్తిదులకు లోనై రక్తంలో "టెషాకటస్టిరోన్" అనే హార్మోన్. ఇది క్రమంగా సంపుసకత్వానికి దారి తీయవచ్చు. లేదా సెక్సులో భావప్రాప్తి కలుగకపోవచ్చు.


👉 రక్తపోటు,గుండెపోటు:-

"మానసిక వత్తిడుల మూలంగా "ఎండ్రినలిన్" అనే హార్మోన్ శాతాన్ని పెంచడం వల్ల గుండె కొట్టుకునే వేగం పెంచడంతో పాటు, రక్తనాళాలు దళసరిగా తయారై, ఇది క్రమంగా దక్షపోటుకు దారి తీస్తుంది. బి.పి.ని కంట్రోలు చేయకపోతే ఇది క్రమంగా గుండెవా జబ్బుకు దారితీయవచ్చు. ప్రతీ చిన్న విషయానికి సహనాన్ని కోల్పోయి విసుగు ప్రదర్శించడం ఉదా: ట్రాఫిక్లో మీరువెహికల్ మీద వెళ్తూ జాం అయ్యారు అనుకోండి. మీకువిపరీతమైన చికాకు కలుగుతుంది. శక్తికి మించిన పనులు నెత్తి మీద వేసుకొని బాధల పడుతూ అందరి మీద చికాకుపడుతూ వుంటారు. ప్రతీ చిన్న మాటను అపార్థం చేసుకునా బాధపడతారు. ఆందోళన చెందుతూ వుంటారు. వారి వల్ల వారికి, వారి వద్ద వున్న వారికి కూడా యిబ్బందే! 


👉చర్మవ్యాధులు:-

సాధారణంగా భయాందోళనలు, టెన్షన్లకు గురయినప్పుడు చమటలు పట్టడం మీరు గమనిస్తూ వుంటారు. మానసిక వత్తిడి ప్రభావం శరీరం మీద వుంటుందని చెప్పడానిక మంచి ఉదాహరణ. మొటిమలు, పులిపిర్లు, ఎక్జిమా, సోరియాసిస్, ఎలర్జీతో కూడిన దురద మొదలైనచర్మవ్యాధులకు చాలా మందిలో కారణం మానసిక వొత్తిడులేనని నిపుణులు నిర్ధారించారు. 


👉జీర్ణకోశ వ్యాధులు 

ఆహారం జీర్ణం కావడానికి మనశరీరంలో జీర్ణరసాలు (ఆమ్లాలు) ఉత్పత్తి అయ్యి కడుపులో కలుస్తాయి. మానసిక వత్తిడుల వల్ల ఈ ఆమ్లాల ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియకు సరిపోగా

మిగిలినవి కడుపులో పేరుకుపోవడం మూలాన ఇది ఎసిడిటికి, తద్వారా కడుపులో లేదా

చిన్నప్రేములో పుండుకు పెప్టిక్ అల్సర్)కు దారి తీస్తుంది.


👉'స్ట్రెస్' లక్షణాలు - వ్యాధులు



అమెరికన్ అకాడమీ వారి ప్రయోగాల ఫలితంగా ప్రజలలో 60 శాతం మంది రోగులకు మానసిక వత్తిడి వల్ల వచ్చిన రోగాలేనని అక్కడి వైద్య నిపుణుల సర్వేలో తేలింది. ప్రతీవారం షుమారు 95 మిలియన్ల మంది మానసిక వత్తిళ్ల వల్ల వచ్చిన వ్యాధులకు చికిత్స పొందుతూ మెడిటేషన్ క్లాసులకు కూడా హాజరు అవుతూ వుంటారు.

ఉత్పాదక వ్యవస్థలలో కూడా ఉత్పాదనా శక్తి మానసిక వత్తిళ్ల మూలంగా బాగా పడిపోయినట్లు సర్వేలో తేలింది. కార్మికులలోను యాజమాన్యంలోను మానసిక ప్రశాంతత నెలకొని వుంటే ఉత్పాదన బాగా పెరుగుతుంది. అమెరికాలో వత్తిడి సమస్యల మూలంగా ఏటా 150 మిలియన్ల డాలర్ల వ్యాపారం నష్టం వస్తూ వున్నదని తేలింది. మానసిక వత్తిడి వల్ల కుటుంబ వ్యవహారాలు కూడా దెబ్బతింటాయి. ఒంటరితనం ఏర్పడడం వల్ల ఏ పనులు సక్రమంగా నెరవేరవు దాని వల్ల చెడు అలవాట్లకు లోను కావాల్సి వస్తుంది. మానసిక వొత్తిడికి గురైనవారు హెచ్చుగా తింటారు. హెచ్చగా మద్యం సేవిస్తారు. సిగరెట్లు హెచ్చుగా కాలుస్తారు. వీటి వల్ల మానసిక ఆవేదనలు తగ్గుతాయి. అవయినా తాత్కాలికంగా తగ్గుతాయి. మానసికంగా తాత్కాలికమైన వుపశమనం లభిస్తుంది. కాని దాని యొక్క దుష్ఫలితాలు ఆలస్యంగా ప్రస్ఫుటమవుతాయి. అవి చాలా వ్యయ ప్రయాసలకు లోను చేస్తాయి.

చాలా మందిలో నొక అపోహ పేరుకునిపోయి వుంది. అది మానసిక వత్తిడి ఆధునికకాలంలో సహజంగా యేర్పడేదేనని. నిజమే, కాని దానిని తగ్గించుకునే యేర్పాట్లు మనం చేసుకోవాలి కదా.

'స్ట్రెస్' లక్షణాలను నాలుగుగా విభజింపవచ్చు. అంటే వైద్యపరంగాను, మానసిక శాస్త్రరీత్యా కూడా ఈ విభజనలు సమంజసంగానే వుంటాయి. 

👉'స్ట్రెస్సు' లక్షణాలు కండరాలలో నొప్పులను కలుగజేసే వొత్తిడుల వల్ల వచ్చే వ్యాధులు


1. టెన్షన్ తలనొప్పి

2. విసుగుదల, కోపం, 

3. పండ్లుకొరుకుట

4. దవడ నొప్పి, 

5. మాటలు తడబడుట, నత్తి

6. కాళ్లు చేతులు తిమ్మిరులెక్కుట, ఒణుకుట 

7. కండరాల పీకులు, నొప్పులు, 

8. మెడలకుపికు

9. వెన్నెముక పీకు,

10. ఒళ్లంతా నొప్పులు


👉నరముల వత్తిడి వల్ల వచ్చే వ్యాధులు



1. మైగ్రేన్ తలనొప్పి,

 2. వెలుతురు, ధ్వని పడకపోవడం.

3. స్వల్పంగా తలనొప్పి రావడం, కళ్ళు మసకలు కమ్మినట్లు వుండడం. మూర్చ వచ్చినట్లు భావన, 

4. చెవుల నుండి ధ్వనలు వినరావడం.

5. కంటి పాపలు పెద్దవి కావడం, 

6. నోరెండిపోవడం,

7. మింగుడు పడకపోవడం,

8. తరచు జలబు, దగ్గు రావడం

9. గుండెనొప్పి

 10. లైంగిక యిబ్బందులు

11. మలబద్ధకము,

12. నరాల బలహీనత మొదలైనవి


👉మానసిక లక్షణాలు

1. చింత, బాధపడుట, తప్పుచేసిన వానివలే విచారించుట, నరాల బలహీనత.

2. దిగులుగా వుండడం

3. విపరీతమైన కోపం, నిస్త్రాణ,

4. జీర్ణశక్తిలో మార్పులు రావడం

5. సమస్యల మీద మనసు కేంద్రీకరించలేకపోవడం

 6. కొత్త విషయాలు అవగాహన చేసుకోలేకపోవడం.

7. మతిమరుపు, 

8. ఎప్పుడూ విచారంగా వుండడం

9. ఆత్మహత్య చేసుకోవాలనే భావన కలగడం.

10. నలుగురిలోకి రావడానికి భయపడడం

 11. వొంటరిగా వుండాలనుకోవడం


👉'స్ట్రెన్' వల్ల నడవడికలో కలిగే మార్పు లక్షణాలు


1. డ్రెస్వేవేసుకోవడంలో తలదువ్వుకోవడంలో శ్రద్ధ వహించకపోవడం

2. ఏపనైనా ఆలశ్యంగా చేయడం.

3. ఎప్పుడూ సీరియస్గా వుండడం

4. అసంగతమైన ప్రవర్తన

5. చిన్న విషయంలో కూడా అతిగా ప్రవర్తించడం

6. కాళ్లు చేతులు అదే పనిగా వూపడం.. 

7. పని చేయలేకపోయినందుకు అబద్ధాలు చెప్పడం

8. త్వరగా అర్థం కాకుండా సంభాషించడం

9. ఎప్పుడూ అలసినట్లుండటం

10. నిద్రపోకపోవడం

11. డ్రగ్సు తరుచువాడడం

12. సిగరెట్లు విపరీతంగా కాల్చడం

13. మద్యాన్ని అతిగా సేవించడం

14. దుబారాగా ఖర్చు చేయడం, గాంబ్లింగ్ అడడం మొదలైనవి. మానసిక ఒత్తిడి వల్ల ఎలాంటి బాధలు కలుగుతాయో అవగాహన చేసుకున్నాం.

ఇప్పుడు ఈ మానసిక ఒత్తిడి నుండి ఎలా బయటపడవచ్చో తెలుసుకుందాం!


👉మానసిక ప్రశాంతి పొందటం ఎలా?


మానసిక వత్తిళ్లు తగ్గాలంటే అతి సులభమయిన మార్గంవ్యాయామం 

చేయడం. దీనికి అనేక కారణాలను ఆపాదించవచ్చు. అందులో ప్రధానమైనది కండరాల టెన్షను తగ్గడం. ఉదాహరణకు రోజంతా ఏదో పని ఒత్తిడి మీద మానసిక సంక్షోభంతో విచారంగా వుండి నిస్త్రాణగా వున్నవారికి, ఎనిమిది గంటల సేపు వొకే గదిలో దుర్వాసుడులాంటి యజమాని క్రింద పని చేసి అతడి చేత కసుళ్లు తిని అతణ్ణి ఏమీ అనలేక యింటికి పెందరాడే వద్దామనుకుంటే బస్సులు దొరక్క ఎంతో అదనపు టెన్షన్తో ఎవరినీ ఏమీ అనలేక యిల్లు చేరుకుని ఈజీచైర్లో కూలబడ్డ వ్యక్తి మానసిక స్థితిని వూహించండి. తన

బాస్ నుఎదిరించలేడు. పని చేయకుండా వుండలేదు. బస్సులు దొరక్క చికాకుతో ఆఫీసు నుంచి కాలినడకన యింటికి వచ్చాడు. ఇక్కడ అతని టెన్షను రిలీజ్ కావడానికి అవకాశమెక్కడుంది?


అటువంటి వ్యక్తికి టెన్షన్ రిలీజు అయ్యేది టెన్నీస్ కోర్టులోనో, స్విమ్మింగ్పూల్లోనో, ఇంతి ఆటలోనో, ఇనుపగుళ్లు విసరడంలోనే అయి వుండాలి. లేదా జాగింగ్లోనే అయి ం ఏదో వ్యాయామ క్రీడలో అతని కండరాలకు విశ్రాంతి దొరుకుతుంది. వ్యాయామం చేయడం వల్లనో, క్రీడలు ఆడడం వల్లనో కండరాలలో ఏర్పడిన కేటకొలొమైన్స్లోని అధిక్యతను మెటాబాలైజు చేసి కండరాలలోని టెన్షను తగ్గిస్తుంది. అంతేకాని వ్యాయామం వల్ల మీ పనిలోని వత్తిడి తగ్గదు. బస్సులు దొరక్కపోవడం చేత కలిగే అసౌకర్యం పోదు. బాస్ వల్ల కలిగే మానసిక సంక్షోభం తగ్గదు. కాని వ్యాయామం వల్ల మీ కండరాలు సడలి మీకు ఏర్పడిన మానసిక వత్తిళ్లు తగ్గడానికి అవకాశాలు వున్నాయి. వ్యాయామం లేకపోతే మీలోని స్ట్రెస్స్సు ఏమవుతుంది? క్రోనిక్ ప్రాబ్లెమ్గా మారి గుండె మీద అదనపు వత్తిడిని తెస్తుంది. అది నెమ్మదిగా హార్ట్ ఎటాక్కు దారి తీస్తుంది. కనుక మానసిక వత్తిళ్ల వల్ల యిన్ని సమస్యలు వుత్పన్నమయి శారీరకంగా ఎన్నో మార్పులకు కారణమవుతుంది. సాయంత్రం సమయం చాలా మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు వ్యాయమం చేసుకోవడానికి అనువైన సమయం. ఎగ్జిక్యూటివ్స్కు అమితమైన మానసిక వత్తిళ్లు ఏర్పడుతూ వుంటాయి. వాటి నుండి బయట పడడానికి క్రీడలు ఆదుకోవడానికి గాని, జాగింగ్కుగాని మరి ఇతర వ్యాయామాలకు గాని అది అనువైన సమయం. ఆఫీసుల నుంచి యింటికి వచ్చే దారిలో వున్న హెల్తు క్లబ్లకు వెళ్లి కొంత సేపు ఆటలు ఆడి టెన్షను రిలీజు చేయించుకుని చీకటి పడ్డాక ఎగ్జిక్యూటివ్లు యిల్లు చేరుకుంటారు. ఇంటికి వచ్చి స్నానం చేయగానే బాగా రిలాక్సేషన్ కలుగుతుంది. మంచి మానసిక స్థితిలో భార్యా పిల్లలతో కలిసి భోజనాలు చేస్తారు. కాస్త వినోదంగా గడిపి తరువాత నిద్రపోతారు. ఉదయానికల్లా వారు ఎంతో ఫ్రెష్ గా మరల పనికి వెళ్లడానికి సంసిద్ధంగా వుంటారు. స్ట్రెస్ మేనేజిమెంటుకు వ్యాయామం నొక ముఖ్యమైన భాగం. ఆఫీసులోని సమస్యలను ఇంట్లోకి తేకూడదు. ఆఫీసులోనే విడచి పెట్టాలి. ఎందుచేతనంటే ఇల్లు ఆఫీసుకాదు గనక. అటువంటప్పుడు మనకున్న శక్తినంతా యింటికోసమే వినియోగించడానికి వీలవుతుంది.


 👉ప్రతిరోజూ వ్యాయమం

ఎన్నో పరిశోధనల వల్ల తేలిన విషయం ఏమిటంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన కండరాలలోని ఏక్టివిటీ పెరిగి మెదడులోని అల్ఫావేవ్ ఏక్టివిటీని వుద్దీపనం చేస్తుంది. అదే విధంగా మెదడులోని ఆల్ఫావేవ్ ఏక్టివిటీని వుద్దీపనం చేసేవి మరో రెండు కూడా వున్నాయి. అవి నొకటి మెడిటేషన్ రెండవది రిలాక్సేషన్.

ఈ విధంగా అరగంట సేపు ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెదడులొ గల పిట్యూటరీ గ్రంథి నుండి ఎండార్ఫిన్ అనే మార్ఫిన్ వంటి పదార్థాలు ఉత్పత్తి అవుతాయి ఇవి పెయిన్కిల్లర్స్ గా పని చేయడమే కాకుండా శరీరానికి ప్రశాంతతకు చేకూరుస్తాయి ఏరోబిక్ వ్యాయామం వల్ల శరీరానికి కలిగే లాభం యిది! అంతేకాకుండా వ్యాయామం వుండి మనలో ఏర్పడిన స్ట్రెస్స్ భారాన్ని శరీరంలోని వివిధ అవయవాలకు సరఫరాచేస్తుంది. ఒకే పనిని అదే పనిగా చేయకుండా మరో పనిలోకి వెళ్లి తేఅది రెస్టులాగా పని చేసి పని వత్తిడిని తగ్గిస్తుంది" అంటాడు డాక్టర్ హన్స్ సెలైతనగ్రంధం లో

మీరు చేసే పని మీకు కొంత ఇబ్బంది కలిగించినప్పుడు జాగింగ్ గాని, లేదా ఈత ఆడడానికివెళితే మీకురీలక్స్ వుండి మరల ఆ పనిని పూర్తి చేయటానికిఅనుకూలంగా వుంటుంది. అలాకాక అదే పనిగా ఆ పనిని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే కనుక మీ మనోభారాన్ని మీ కండరాలకు మళ్లించడమే సెమీ కండరాలు మీ బ్రెయిన్కు విశ్రాంతిని కల్పిస్తాయి. ప్రశాంతతను

సహస శాస్త్రవేత్త వాక్టర్ విలియం జేమ్స్ యిలా అన్నారు. "మీ మనో వ్యధ నుండి మస్కులర్ స్ట్రెయిన్ ను విడదియగలిగితేమీమనోవ్యధనుండి మటుమాయమైపోతుంది. కనుక మీరు చేసే పనిలోని మార్పు మీ మనోవికాసానికి తోడ్పడుతుంది. మానసిక వత్తిడి తగ్గుతుంది దానినే డైవర్షన్ అని అంటారు. డైవర్షన్ వల్ల మానసిక పరిణామం వస్తుంది.

దానివల్ల రిలాక్సేషన్ సాధ్యపడుతుంది

శారీరక వ్యాయామం వల్ల మానసిక స్థితిలో విశేషమయిన మార్పు ఏర్పడుతుంది. అది మరపు మీద విశేషంగా దాని ప్రభావం చూపుతుంది. దాని మూలంగా 

1) మనలోని కోసం, ఆందోళన, నిస్పృహ, నిరాశ, ఎగ్రిషన్, పోస్టిలిటీ మాయమవుతాయి.

 2) ఇన్ సామ్ని యా తగ్గితుంది 

3) కొత్త పరిచయాలు అవడానికి అవకాశాలు లభిస్తాయి. సాంఘికంగా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి

 4. నలుగురితో కలిసి సమాజపరమైన కార్యకలాపాలలోపాల్గొనడానికి అవకాశాలు లభిస్తాయి. 

5.క్రమశిక్షణ అలవడుతుంది. ఆరోగ్య జీవితానికి వచ్చే కార్యక్రమాలను చేపట్టే అవకాశం లభిస్తుంది. 

ఎరో బిక్ ఎక్సర్ సైజ్జెమూలంగా మామూలు ఆరోగ్యం అభివృద్ధి కావడమే కాక కార్డియో వాస్కులర్ సిస్టం కూడా బాగా పని చేస్తుంది. స్ట్రెస్ మూలంగా కార్డియో వెన్క్యులర్ సిస్టం బాగా దెబ్బ తింటుంది.కనుక దాని దుష్ఫలితాలను నివారించడానికి ఏరోబిక్ ఎక్సర్ సైజులు చాలా మంచిది . హార్ట్ బీట్ రేటు, బ్లడ్ ప్రెషర్ కంట్రోలవుతాయి. ఇవి రెండు..స్ట్రెస్ లో బాగాఎక్కువవుతాయి. కనుక స్ట్రెస్ వల్ల కలిగే దుష్ఫలితాలను ఇందుమూలంగా నివారించవచ్చును. కార్డియో వాస్కులర్ ఫీట్స్ ఉన్న వ్యక్తులకు ఏరోబిక్ ఎక్సర్ సైజులు బాగా ఉపకరిస్తాయి రోజు ఉండే మానసిక ఒత్తిడి ప్రభావం తగ్గుతుంది


👉. ప్రోగిసిన్ మజిల్ రిలాక్సేషన్

ప్రోగ్రెసివ్ మసిల్లాక్సేషన్ను కనిపెట్టినవారు డాక్టరు ఎడ్మెండు జాకోబ్సన్ 1930లో. దీనిమూలoగా రిలాక్సేషన్ యొక్క ప్రాధాన్యత వ్యక్తమవుతుంది. దీని మూలంగా శరీరవ్యాప్తంగా కండరాల ప్రోగెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్ విశదమవుతుంది. ఎందుకంటే తీవ్రమైన స్ట్రెస్సు నుండి క్రమేపి రిలాక్సుకావడానికిసాధ్యపడుతుంది. అది కూడా మన విల్ ప్రకారం అంటే యధేచ్చగా రిలాక్సు కావడానికి వీలవుతుంది. దైనందికంగా మనం అనుభవించే ఓత్తిళ్లను, అందుమూలంగా ఏర్పడే విషాద ఛాయలను యీ మార్గం ద్వారా పోగొట్టుకొనవచ్చును,


👉రిలాక్సేషన్ ఎక్సర్ సైజెస్ ఎక్కడ చేయాలి?

రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ ను విశాలంగా వున్న గదులలో బాగా వెలుతురు, గాలి ప్రసరించేచోటల్లో నిర్వహించాలి. అవి కూడా వొక పద్ధతిలో క్రమశిక్షణతో కాలం పాటిస్తూ చేయాలి. ఒక్కొక్కరి పద్ధతి వొక్కక్క విధంగా వుంటుంది. ఏదయినా అనుసరించవచ్చును. కాని ఏ పద్ధతిని అనుసరిస్తే దానినే ఆసొంతము అనుసరించాలి గాని మధ్యలో కారణాంతరాల మూలంగా అనుసరించే పద్ధతిని మార్చకూడదు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే మీరు ఎక్సర్సైజ్ చేసిన ప్రతిసారి మీ మసిల్ రిలాక్సేషన్ ఎఫెక్టు ఎలాగుందో గమనిస్తూ వుండాలి. మీరు చేసే ఎక్సర్సైజెస్ శరీరంలోని అన్ని మజిల్ గ్రూప్పుకు చెందినవై వుండాలి. ప్రతీ ఎక్సర్సైజుకు కనీసం 20 నిమిషాలు కేటాయించండి. అంతకంటే తక్కువ టైం తీసుకుని త్వరితగతిని ఎక్సర్సైజన్ చేస్తే మంచి ఫలితాలురావు, సాధారణంగా ప్రతీరోజూ రెండుసార్లు యీ రకమైన మజిల్ రిలాక్సేషన్ ఎక్సరై సైజస్ చేయాలి.

ఈ ఎక్సర్సైజులు చేసే వ్యక్తి నేల మీద పడుకుని ముఖం పైకి లేపి మోకాళ్ల క్రింద ఒక ఉండు వుంచుకొని, పాజిటివ్ దృక్పథంతో చేయాలి. శరీరాన్ని ఎంతవరకు వీలయితే అంతవరకు రిలాక్సు చేయాలి. శరీరంలోని ప్రతీ మజిల్ గ్రూపును దృష్టిలో వుంచుకొని స్వీకెన్సు ప్రకారం యీ ఎక్సర్సైజులు చేయాలి. కండరాలను పూర్తిగా బిగపెట్టకూడదు. 70 శాతం వరకు మాత్రమే శరీరంలోని కండరాలను బిగపెట్టాలి. పూర్తిగా బిగపెడితే కండరాలు పట్టేస్తాయి. మీరు అసలు వ్యాయామం చేయలేరు. ముందు కండరాలను బిగువుగా వుంచి తరువాత క్రమేపి రిలీజు చేయాలి. అప్పుడుగాని ఆశించిన రీతిలో పొందలేరు. కండరాలను 5 సెకనులకు మించి బిగదీయకూడదు. తరువాత రాను రిలీజు చేయాలి. మజిల కంట్రాక్షన్కు రిలాక్సేషన్కు కొంత టైమును ఆ తరువాతే మరో గ్రూపుకు వెళ్లాలి.

సంపూర్ణ ప్రోగ్రెసివ్ మ్యాకల్ రిలాక్సేషన్ ఎలా చేయాలి?

1. ముందుగా మీ బొటనవేలును వoచి మీ పాదాలపై బరువు మోపి మీ కాలి గమనించండి. అంటే బొటనవ్రేలు నుంచి పాదం పైభాగం వరకు టెన్షన్ గమనించండి. తరువాత రిలాక్స్అవండి. మరోసారి యిదే రిపీటు చేయండి.

2. తరువాత పాదాలను మీ ముఖం వైపుకు బాగా వoచండి. మీ పాదాల దగ్గక పిక్కల వద్ద మీరు మజిల్ టెన్నన్ను నోట్ చేయండి. అలాగే కొంతసేపు వుంచండి. తరువాత రిలాక్సు అవండి. మరోసారి రిపీట్ చేయండి.

3. మీ మడమలను భూమి మీదకి బాగా వత్తి పట్టండి. మీ తొడల కండరాలపై దాని ప్రభావాన్ని నోట్ చేయండి. రిలాక్సు, రిపీట్, చేయండి

4. మీ కుడి తొడను భూమి మీద నుండి పైకి లేపి తిన్నగా వుంచండి. కంట్రాక్టుచేయండి. అలాగే కొంతసేపు వుంచి టెన్షన్ ను స్టడీ చేయండి. రిలాక్సు. అలాగేఎడమకాలును చాపిండి, టెన్షన్ స్టడీ చేయండి. రిపీట్ చేయండి. (రెండు కాళ్లు.

కూడా) 

5. ఇప్పుడు పిరుదులను భూమి మీద నుండి కొంచెం పైకి లేపండి. అలాగే వుంచి టెన్ననన్ను నోట్ చేయండి. రిలాక్సు, రిపీట్,

6. ఇప్పుడు పొత్తి కడుపు వద్ద గల కండరాలను కంట్రాక్టు చేయండి. అలాగే వుంచండి.

రిలాక్సుకండి. రిపీట్ చేయండి. 

7. మీ పొట్టను లోనికి బాగా లాక్కుని మీ వెన్నెముక వరకు వెనక్కి లాగండి. అలాగే ' వుండండి. క్రమేపి రిలాక్సు అవండి. టెన్షన్ నోట్ చేయండి. పొట్టలోనికి లాగి నేల మీద వెల్లకిలా పడుకోండి. పొట్టని యధాస్థానంలోకి తీసుకునిరండి. రిలాక్సు అవండి. సీటు చేయండి.

బాగా లోనికి గాలి పీల్చండి. గాలిని

లోన బంధించండి. తరువాత నెమ్మదిగా బయటకు

విడవండి. రిపీటు చేయండి. మీరు గాలి పీల్చడం గమనించండి. రిలాక్సేషన్ పొందడాన్ని గమనించండి. 

9. మీ రెండు చేతులను మీ బాడీకి యిరువైపులా వుంచండి. పిడికిలి బిగించండి. అలాగే వుంచండి. టెన్షన్ను స్టడీ చేయండి. రిలీజ్ రిపీట్ చేయండి.

10. రెండు చేతులను మీ భుజాల వద్దకు మోచేతుల వద్దకు వంచండి. రెండు చేతులు చేర్చి గట్టిగా బంధించండి. టెన్షన్ గమనించండి. బైసెప్పును గమనించండి. రిలాక్సు రిపీట్ చేయండి.

11 మీరు రెండు చేతులునేల మీద అరచేతులు రెండూ పైకి వుండే విధంగా వత్తండి మీ బైసెప్పు మీదున్న టెన్షను గమనించండి. రిలాక్సు, రిపీట్, 

12 మీ భుజాల రెండిటిని మీకు వీలయినంత వరకు పైకి ఎత్తండి. అలాగే వుంచి టెన్షన్ చూడండి

రిలాక్సు, రిపీట్.

13.మీ తలను వెనకకు వంచండి టెన్సన్ చూడండి. మీ వెన్నెముకలోను, మీ మెడలోను టెన్షన్ గమనించండి. రిలాక్సు, రిపీట్, 

14. ఇప్పుడు తలను గుండెల మీదకు ముందుకు వంచండి. మెడ మీద టెన్షన్ నోట్ 

15. మీ నాలుకను మీ నోటి పై భాగానికి అంటించండి. అలాగే వుంచి టెషన్ చూడండి.

చేయండి. రిలాక్సు రిపీట్,

 16. మీ పండ్లను దగ్గరగా అదిమి వుంచండి. టెన్నన్ను గమనించండి, రిలాక్సు రిపీట్

 17. మీ కళ్లను గట్టిగా మూసేయండి. టెన్నను నోట్ చేయండి. కళ్లు మూసుకునే రిలాక్స్ అవండి. రిపీటు చేయండి.

18. మీ ఫోర్హెడ్ (ఫాలభాగం)ను కుదించండి, టెన్షన్ నోట్ చేయండి. రిలాక్సు,

ఈ రకంగా ప్రతిరోజు చేయండి. మీకు టైము లేకపోతే కనీసం మీ కండరాలు ఏ ప్రాంతంలో నొప్పిగా వున్నాయో ఆ ప్రాంతాలలో మాత్రమే చేయండి. అసలు మానేయకండి. ఏదయినా కంటిన్యూగా చేస్తేనే ఫలితాలు లభిస్తాయి. సాధ్యమయినంత వరకు పూర్తిగా చేయడానికే ప్రయత్నించండి.


👉రిలాక్సేషన్కు బ్రీతింగ్ టెక్నిక్సు తెలుసుకోండి!

స్ట్రెసు తగ్గించుకోవడానికి ఎక్సర్సైజులు మాత్రమే కాకుండా బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా. వున్నాయి. వీటిని మన పూర్వులు వందల సంవత్సరాల నుంచి అమలులో వుంచారు. ఇది యోగ శాస్త్రంలో భాగం. దీని వల్ల మన ఋషులు మహా మేధా సంపన్నులయ్యారు. గాలి పీల్చి వదిలేసరికి మీ శరీరంలో వున్న టెన్షన్ మొత్తం రిలీజు అవుతుంది. మీ శరీరంలోకి విరవిగా ఆక్సిజన్ సరఫరా అవుతుంది..

ఇది మీరు కొన్ని నిముషాల కాలంలో నేర్చుకోవచ్చు. చాలా సులభం! ఇందాక చెప్పిన ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్లా టైం పట్టదు. మిగతా ఎక్సర్సైజులు లాగా వీటికి కూడా బాగా గాలి, వెలుతురు ప్రసరించే విశాలమైన గది వుండాలి. అక్కడ యీ ఎక్సర్సైజెస్ చేయాలి.


మూడు రకములయిన బ్రీతింగ్ ఎక్సర్సైజులను గురించి యిక్కడ ముచ్చటించడం జరిగింది. వీటిలో ఏవొక్కటినైనా, మీరు బాగా స్ట్రెస్సును ఫీలయినప్పుడు వుపయోగించవచ్చు. మీకు తప్పక రిలీఫ్ ఏర్పడుతుంది. 

1. డీప్ బ్రీతింగ్ :-మీరు వెల్లకిలా నేల మీద పడుకొని మీ మోకాళ్ల క్రింద దిండు వుంచుకోండి రెండు

కాళ్ళు ఎడంగా వుంచండి. బొటన వ్రేళ్లు పైకి వుంచండి. ఒక చెయ్యి మీ పొత్తికడుపు మీద వుంచండి. రెండవ చెయ్యి మీ గుండెల మీద వుంచండి. నెమ్మదిగా గాలి పీల్చి వదలండి గాలి పీల్చినప్పుడు మీ పొత్తి కడుపు మీదనున్న చేయి

పైకి లేచి గాలి వదిలినప్పుడు ఆ చేయి కిందికి పడుతుంది . గాలి పీల్చినప్పుడుగాని వదిలినప్పుడుగాని గుండె మీద వుంచిన చేయి మాత్రము కదలకూడదు. ఇదే విధంగా వోక పదిసార్లు చేయాలి. తరువాత మీ బాడీలోని టెన్షన్ ఎంతవరకు తగ్గిందో గమనించాలి. అంతకు పూర్వం వున్న టెన్నక్కు తేడాను గమనించాలి. మొత్తం ప్రక్రియను మరో రెండుసార్లు రిపీటు చేయండి.

2. నిట్టూర్పు

దీనిలో పొత్తి కడుపుతో బ్రితింగ్ టెక్నికను అవలంభించడం జరుగుతుంది. మీ నాసి క

గుండా గాలిని లోనికి పీల్చండి. కొన్నిమార్లు పీల్చండి. (4,5,6)... పెదిమలను బిగింది. గాలిని నోటిద్వారా బయటకు వదలండి. ఇదే విధంగా అనేకసార్లు రిసీట్ చేయండి. మీరు టెన్షన్ ఫీలయినప్పుడల్లా యిలా చేయండి. 3. పూర్తి స్వాభావికమైన బ్రీతింగు నిట్టనిలువుగా కూర్చోండి లేదా నిట్టనిలువుగా నిలబడండి, మీ నాసిక ద్వారా గాలినిలోనికి పీల్చండి. మీ ఊపిరితిత్తులను గాలితో నింపండి. గాలిని బిగపెట్టండి. వీలయినంత వరకు దమ్మును నిలపండి. ఇప్పుడు మెల్లగా గాలిని బయటకు వదలండి. గుండె, పొత్తికడుపు

పూర్తిగా రిలాక్సు అవుతాయి. మరో పదిసార్లు రిపీటు చేయండి.


👉ఆటోజెనిక్ ట్రైనింగు 

ఆటోజెనిక్ ట్రైనింగ్ అంటే అదొకరకంగా సెల్ఫ్ సజెషస్సు వంటిది. మనంతట మనం ఏకాంతంగా వున్న సమయంలో మనం ఎంతో బరువుగా వుంటూ వున్నట్లు ఎంతో వేడిగా వున్నట్లు వూహిస్తాం. దానినే ఆటో హిప్నోటిక్ స్టేటు అని అంటాం. మనం ఆ విధంగా సెల్ఫ్ సజెషన్సు యిచ్చుకుంటే మన శరీరం ఎంతో బరువెక్కిపోయినట్లు, ఎంతో వేడిగా వున్నట్లు ఫీలింగు వస్తుంది. మన ప్రతీ అంగము క్రమేపి బరువెక్కుతూ వున్నట్లుగా భావన మనలో ఏర్పడుతుంది. మన శరీరం వేడెక్కుతున్నట్లు అనిపిస్తుంది. మన రక్తనాళాలలోని రక్తం డైలేటు కావడం వల్ల వేడెక్కిన ఇంప్రెషను మనకు కలుగుతుంది. ఆ భావన రాగానే శరీరంలోని రక్తనాళాలలోనికి రక్తం విరివిగా ప్రవహిస్తుంది. మరి బరువుగా వున్న భావనకుకారణం మీ శరీరంలోని కండరాలు రిలాక్సు అవుతాయి. ఈ టెక్నిక్ వాడే ముందు మీరు నిలబడినా, కూర్చున్నా కూడా కంఫర్టబుల్ గా వుండాలి.

కళ్ళు మూసుకుని కూర్చోవాలి. వరుసగా ఆరింటి మీద క్రమేపి మీ మనస్సును కేంద్రీకృతం చేయాలి. ఇవి ఆరు వివిధ స్టేజీలు.

1. నా కుడిచెయ్యి బరువుగా వుంది. నా ఎడమ చెయ్యి బరువుగా వుంది. ఇప్పుడు నా రెండు చేతులు బాగా బరువుగా వున్నాయి. నా కుడికాలు బరువెక్కుతూ వుంది. నా ఎడమకాలు బరువెక్కుతూ వుంది. నా రెండు కాళ్ళు బాగా బరువెక్కాయి. ఇప్పుడు -నా రెండు చేతులు రెండు కాళ్ళు కూడా బాగా ఐదువెక్కాయి.

2. నా కుడిచేయి వేడెక్కుతూ వుంది. నా ఎడమచేయి వేడెక్కుతూ వుంది. నా రెండు చేతులు వేడెక్కాయి. నా కుడికాలు వేడెక్కుతూ వుంది. నా ఎడమకాలు వేడెక్కుతూఉంది. నా రెండు కాళ్ళు వేడెక్కుతూ వున్నాయి. ఇప్పుడు నా రెండు చేతులు, నా రెండు కాళ్ళు కూడా వేడెక్కాయి.

3. నా గుండె స్పందన ప్రశాంత వుంది. రెగ్యులర్గా నా గుండె నార్మల్ గా కొట్టుకుంటూ వుంది. అదే నాలుగు నుండి అయిదు పర్యాయములు రిసీటు చేయండి.. 

4. నా వూపిరి బాగా వస్తూంది. (అని అయిదారుసార్లు అనుకోండి) వెచ్చ వుంది (నాలుగైదు సార్లు అనుకోండి)

నా నుదురు చల్లగానే వుంది (నాలుగైదుసార్లు అనుకోండి) ఈ రకమైన ఆటోజెనిక్ ట్రైనింగు చాలా మంచిది. కాని యిది చాలా కష్టమైన టెక్నిక్.

పూర్వం చెప్పుకున్న వాటికన్నా యీ టెక్నిక్ చాలా కష్టమైనది. ఈ పద్ధతిలో తొందరపాటు పనికిరాదు. స్లోగా ప్రాక్టీస్ చేయాలి. ఇది రిలాక్సేషన్ టెక్నిక్ అవరోధంగా నిలబడగలదు. దీనిలో ప్రతి స్టేజిని మాస్టరు చేయాలి. ఒక స్టేజి తరువాత మరో స్టేజికి వెళ్లాల్సి వుంటుంది.

👉 మెడిటేషన్ (ధ్యానం)

ధాన్యం చేయడం వల్ల మానసికమైన, శారీరక సంబంధమైన ప్రశాంతత ఏర్పడుతుంది. దీనివల్ల మానసికమైన, భౌతికమైన లాభాలు ఎన్నో వున్నాయి...


"ధాన్యం వల్ల మీ మీద మీకు ఒక రకమైన కంట్రోలు ఏర్పడుతుంది. మీ మనస్సు నిర్మలంగా వుంటుంది. వత్తిళ్ళు మీ దరికి రాకుండా అడ్డుకోగలుగుతుంది. వత్తిళ్ల వల్లనే మనకు మెంటల్ టెన్షన్స్ ఏర్పడతాయి. వాటి దుష్ప్రభావం శరీరం మీద కూడా కనిపిస్తుంది. ధ్యానం మానసిక ప్రశాంతత అవసరమైనప్పుడు వాడవచ్చు. ధ్యాన మందిరం ఏకాంతంగా, అతి ప్రశాంతంగా, మన ధ్యాననిష్టకు భంగం కలుగకుండా వుండాలి. అక్కడ ఏ విధమైన అలజడులు ఏర్పడకూడదు. అక్కడి వాతావరణం ప్రశాంతంగా వుండి ఆవేశకావేశాలకు తావు కల్పించకుండా వుండాలి. ఎవ్వరూ అక్కడికి రావడానికి వీలు వుండకూడదు. ఏ విధమైన యాంత్రిక ధ్వనులు వినబడకూడదు.


ధ్యానం చేయగల సామర్థ్యం అలవడితే మనం ఎక్కడయినా కూర్చొని ధ్యానం చేయవచ్చు. దానికి మానసిక ఏకాగ్రత కావాలి. అది సాధనపై సమకూదేదేగాని సులలభంగా దొరికేది కాదు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు పర్యాయాలు, 15 నిముషాలుచొప్పున ధ్యానం చేయడం మంచిది.


పైన మనం రిలాక్సేషన్ కు అనేక పద్ధతులను ముచ్చటించాం కదా వీటిలోఏది ఉత్తమమైనది?


మానసిక వత్తిళ్లకు అందరూ ఒకే విధంగా రియాక్టు అవరు. ఒక్కొక్కరి రియాక్షన్ వొక్కక్క మాదిరిగా వుంటుంది. కనుక ఎవరికి నచ్చిన పద్ధతిని వారు ఎంపిక చేసుకోవచ్చు. ఇదే పద్ధతిని అవలంభించాలని ఎక్కడాలేదు. ఎవరి యిష్టం వారిది. ఏ టెక్నిక్ వుపయోగిస్తే మీకు ఆశించిన ఫలితాలు లభిస్తాయో అదే టెక్నికను వాడవచ్చు. దీని లక్ష్యం రిలాక్సుకావడం, మానసికపరమైన వత్తిళ్లను అదుపు చేసుకోవడం. ఒక్కొక్క వ్యక్తి అన్ని మార్గాలు. అన్వేషించి అందులో తనకి బాగా నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చును. అంతేకాకుండా. రెండు మూడు పద్ధతులను కూడా కలిసి ప్రయత్నించవచ్చును. అన్ని పద్ధతులు మంచినే (స్ట్రెస్సులను తగ్గించేవే! రిలాక్సేషన్ను కలిగించేవే! మానసకింగాను, కారీరకంగాను కూడా ప్రశాంతతను కలిగించేవే.

ముఖ్య లక్షణం మన మానసికస్థితిని అందోళనల నుంచి ఆత్మశాంతి వైపుకు మరల్చడ మనకి కళ్ళు మూసుకుంటే ఎదురుగా కనిపించేవి మన ముందున్న బాధ్యతలు, బెదిరిస్తూ దర్శనమిచ్చే మన కర్తవ్యాలు. వీటి వల్ల కళ్ళు మూసినా, కళ్లు తెరిచినా మనకి బాధ్యతలు, బరువులు, కర్తవ్యాలు, కష్టాలు, వీటిని క్షణకాలం మ పోయి ప్రశాంతంగా వుండడానికే యిన్ని రకాలయిన ఎక్సర్సైజ్లు మన పూర్వులు కనిపెట్టి మనకు ప్రసాదించారు. వాటిని వుపయోగించి వాటి సత్ఫలితాలను మనం పొందాల్సి వుంది.

మనం పైన పేర్కొన్న కొన్ని టెక్నిక్లు చాలా తేలికగా పట్టుబడతాయి. వాటిని ప్రాక్టీసు చేయడం మంచిది. అంతేకాదు వాటికి కాలవ్యవధి కూడా తక్కువ పడుతుంది. ఫలితాలు కూడా బాగుంటాయి. కనుక తేలికగా వాటిని అవలంభించండి.

మీరు ఏ పద్ధతిని ఎంపిక చేసుకున్నా మీకు ప్రధానంగా స్ట్రెస్సు ప్రాబ్లమ్ వున్నప్పుడు మరి కొంత శ్రమ అయినా మీరు ప్రయత్నం చేయడంలో తప్పులేదు. మీకు వాటి వల్ల వుపయోగం వుంటుంది కాని టైమ్వేస్టు కాదు. అయినా అన్నీ చేసినా కూడా ఎక్కువ టైము కూడా పట్టదు.

స్ట్రెస్ మేనేజిమెంటులో యిదొక ప్రధాన భాగం. ప్రతీవారికి యీ రిలాక్సేషన్ టెక్నిక్ తెలియాలి. ఎందుకంటే ప్రతీ వ్యక్తికి టెన్షన్ వుంటుంది. మానసిక వత్తిళ్లు వుంటాయి. తప్పవు. వారు స్త్రీ, పురుషులలో ఎవరయినా కానీ వారికి వత్తిళ్లు అనివార్యం, వారిని అస్వస్థులను చేసేది స్ట్రెస్సుకాదు. అది కలిగించే ఏజెంటు అనారోగ్యాన్ని తెచ్చి పెడుతుంది. ఆ ఏజెంటు చేసే కార్యక్రమానికి మనం రియాక్టు అవుతాం. ఆ రియాక్షనే మన శారీరక, మానసిక రుగ్మతలకు ప్రబల కారణం. ఆ రియాక్షన్సును మానవుడు కంట్రోలు చేయగలిగితే అతడు జీవితాన్ని ఆనందంగా అర్థవంతంగా గడుపుతాడు. కనుక రిలాక్సు కావడం తెలుసుకోండి. రియాక్షన్ తగ్గించుకోండి!


          ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                    ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి                           👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                    https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                                                  ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

                                             ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                                     👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                         https://www.facebook.com/groups/287841976124793

                                                   ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                              👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                           https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

                                         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా  జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

                                      ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                      ═════════◄••❀••►═════════ 

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT