-->

ఆరోగ్యానికి, డాక్టర్ కి ఉన్న సంబంధం | Relationship between health and doctor

Relationship between health and doctor

Relationship between health and doctor

ఆరోగ్యానికి, డాక్టర్ కి ఉన్న సంబంధం

======================

'ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్" అంటారు. అంటే రోగం వచ్చాక. తగ్గించుకొనే దాని కంటే రోగం రాకుండా ముందే జాగ్రత్తగా ఉండడం మంచిదని దాని అర్థం. రోగమంటూ ఒక్కసారి వచ్చిందంటే అతుకుపడినట్లే కదా. ఎప్పటికైనా అతుకు అతుకే. రోగం రాకుండదంటే ఆరోగ్యంగా బ్రతకడమే మార్గం. ఆరోగ్యంగా బ్రతకడానికి డాక్టర్తోగానీ, హస్పిటల్తో కానీ పనిలేదు. జంతువులన్నీ ఆరోగ్యంగా జీవిస్తున్నాయి. అవి ఆ ఆరోగ్యాన్ని పొందడానికి ఏ వైద్యుల సహాయం, ఏ హస్పిటల్ సహాయం తీసుకుంటున్నాయి? ఈ వాస్తవం తెలియక చాలామంది ఇష్టం వచ్చినట్లు అన్నీ తినడం, త్రాగడం చేసి, ఏదన్నా రోగం వస్తే వైద్యం చేయడానికి వైద్యులున్నారు కదా, ఆరోగ్యాన్నివ్వడానికి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా అని అంటూ, ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకుంటూ ఉంటారు. అసలు ఆరోగ్యానికి, డాక్టర్కు, ఆరోగ్యానికి, హాస్పిటల్స్కు సంబంధం ఉంటుందా? లేదా? అని ఆలోచిస్తే అసలు డాక్టర్కి, ఆరోగ్యానికి సంబంధం లేదు. కాబట్టి, ఆరోగ్యవంతులు ఎవరూ డాక్టర్ వద్దకు, హాస్పిటల్స్కు వెళ్ళరు. డాక్టరుకు ఉన్న సంబంధం అలా రోగంతో మాత్రమే. రోగం ఎవరి కొస్తుందీ అంటే అనారోగ్యవంతులకి కాబట్టి అనారోగ్యంతో ఉన్నవారే డాక్టర్ను సంప్రదిస్తారు. రోగిని బాధిస్తున్న రోగం గురించే డాక్టర్లు ఆలోచనంతా పెట్టుకుని ఆ బాధ నుండి మనల్ని రక్షిస్తున్నారు. పూర్తిగా ఆ బాధ పోయినప్పటి నుండి మళ్ళీ ఏ బాధ రానంతకాలం మనం డాక్టర్ ముఖం చూడం. ఒకసారి బాధలు వచ్చి తగ్గాక, మీరు ఇంటి వద్ద ఏమని ప్రార్థిస్తుంటారో తెలుసుగదా! ఓ దేవుడా! నేను జీవితంలో హాస్పిటల్ పాలుగాకుండా, డాక్టర్ల చుట్టూ తిరగకుండా

ఆరోగ్యంగా, చల్లగా ఉండేటట్లు చూడు తండ్రీ నీ కొండకు నడిచి వచ్చి మరీ గుండు కొట్టించుకుని, నీ హుండీలో లక్షరూపాయలు (డాక్టర్లకు ఇచ్చేబదులు నీకే) వేస్తానని ప్రార్థిస్తుంటారు. నిజానికి డాక్టర్లు, హాస్పిటల్స్ ఆరోగ్యాన్నిచ్చేటట్లయితే మీరు హాస్పిటల్స్కి, డాక్టర్ల వద్దకు వెళ్ళేట్లు చేయిదేముడా, డాక్టర్లకు లక్షలిస్తానని ప్రార్థించడం చెయ్యాలి. రోగికి పూర్తి ఆరోగ్యం డాక్టర్ల వల్ల, హాస్పిటల్స్ వల్ల రాదని వైద్యులందరికీ తెలుసు. ఈ విషయం ప్రజలకే తెలియడం లేదు. ఆరోగ్యం అనేది డాక్టర్ల చేతిలో ఉన్నదనే అపోహలో ఉంటున్నారు. నాలుగులక్షలు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటే ఆరోగ్యరక్షణకు అది సరిపోతుందను కుంటున్నారు. ఆరోగ్యమనేది ఒకరు ఇస్తే వచ్చేది కాదు, మనం పుచ్చుకునేదీ కాదు, డబ్బులు పోసి కొనుక్కునేది అంతకంటే కాదు. అలా వైద్యులు ఆరోగ్యాన్నిచ్చే వారైతే, మనకు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, కనీసం డాక్టరు అని నమ్ముకొని ఆయన్ని పెళ్ళి చేసుకున్నందుకు వాళ్ళ ఆవిడకు ఆరోగ్యం ఇవ్వగలుగుతున్నారా? వాళ్ళకు పుట్టిన పిల్లలకన్నా పూర్తిగా ఇవ్వగలుగుతున్నారా? లేదా కని, పెంచి వైద్యుడు కావడానికి కారకులైన వాళ్ళ తల్లిదండ్రులకైనా అందించగలుగుచున్నారా? లేదే! అందాకా ఎందుకు, వాళ్ళ స్వంతానికైనా పూర్తి ఆరోగ్యాన్ని ఆ మందులు, హాస్పిటల్, వైద్యశాస్త్రం వల్ల అందించుకోగలుగు తున్నారా? అదీ లేదే! చివరకు వాళ్ళకి బి.పి.లు, సుగర్లు, కీళ్ళ నొప్పులు, గుండెజబ్బులు వస్తూనే ఉన్నాయి కదా! పైగా, సుగర్ స్పెషలిస్టుగా పనిచేస్తూ ఎన్నో వేలమందికి సుగర రోగానికి ఉపశమనాన్ని కలిగించే సుగరు డాక్టర్ గారి కన్నా సుగరు జబ్బు రాకుండా ఏమన్నా ఉంటున్నదా అంటే, శుభ్రంగా వచ్చే స్తున్నది. మరి వారికే వారి కుటుంబాలకే ఆరోగ్యం గ్యారెంటీ లేనప్పుడు మరి మీకెవరిస్తారు? అందుచేత ఆరోగ్యం అనేది డాక్టర్లు ఇచ్చేదికాదు. వారు ఇచ్చేది

రోగాల నుండి ఉపశమనము లేదా విముక్తి మాత్రమే. ఆరోగ్యం ఇంకొకరు ఇచ్చేది కాదని ఇప్పటికైనా తెలిసిందికదా! మరి మన ఆరోగ్యం ఎవరిచేతుల్లో ఉందో తెలుసుకుందాము.


          ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                    ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి                           👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                    https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                                                  ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

                                             ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                                     👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                         https://www.facebook.com/groups/287841976124793

                                                   ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                              👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                           https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

                                         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా  జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

                                      ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                      ═════════◄••❀••►═════════ 

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT