-->

'జేమ్స్ వెబ్ టెలిస్కోప్'తో విశ్వం గుట్టు బట్టబయలు | 'James Web Telescope'

 

'జేమ్స్ వెబ్ టెలిస్కోప్' తో విశ్వం గుట్టు బట్టబయలు


గతంలోకి తొంగి చూడాలనుకుంటే, మన పరిధి కొన్ని వందల ఏళ్ల వరకే పరిమితమవుతుంది. కానీ అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్స్పస్ టెలిస్కోప్, మనల్ని ఏకంగా 13 బిలియన్ సంవత్సరాల నాటి, సుదూర అంతరిక్షంలోకి తీసుకువెళ్లగలిగింది. మునుపెన్నడూ మానవాళి చూడని సుదూర దృశ్యాలను ఈ టెలిస్కోప్ చూపించగలుగుతోంది. ఈ టెలిస్కోప్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం !


అంతరిక్షంలో ఆ ప్రదేశంలో....

ఈ టెలిస్కోప్ పూర్వపు హబుల్ టెలిస్కోప్లో భూకక్ష్యలో తిరు గుతూ ఉండదు. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో, సూర్యుని కక్ష్యలో, లాగేంజ్ పాయింట్ (ఎల్2)లో తిరుగుతూ అంతరి క్షంలోని సుదూర దృశ్యాలను భూమికి పంపిస్తూ ఉంటుంది.

లక్ష్యాలు ఏవంటే...

ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ అయిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్, హబుల్ టెలి స్కోప్ను మించిన పొడవాటి తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది. ఇది ప్రధా నంగా నాలుగు లక్ష్యాలను కలిగి ఉంటుంది. విశ్వం రహస్యాలు, నక్షత్ర | మండలాలు, నివాసయోగ్యమైన గ్రహాలు, ఇతర విశ్వ సంఘటనలను కనిపెట్టగలిగే ఈ టెలిస్కోప్, విశ్వం ప్రారంభంలోని గేలక్సీల కలయిక, నక్షత్రాలు, గ్రహ వ్యవస్థలు, గ్రహాల తీరులను కనిపెడుతుంది. ఫొటో లను చిత్రించడంతో పాటు, ఈ టెలిస్కోప్ స్పెక్ట్రా డాటాను కూడా అందిస్తుంది. ఈ డాటాతో గ్రహాల భౌతిక, రసాయన రూపాలు తెలు స్తాయి. చేరువలోని గేలక్సీలకు సంబంధించిన మరిన్ని వివరాలను అధ్యయనం చేయడంలో శాస్త్రవేత్తలకు ఈ వివరాలు తోడ్పడతాయి.


రూపకర్త ఆవిడే

కెనడా, ఐరోపా, అమెరికా స్పేస్ ఏజెన్సీల మధ్య అంతర్జాతీయ భాగ స్వామ్యంలో భాగంగా జేమ్స్ వెబ్ టెలిస్కోపన్ను రూపొందించడం జరి గింది. ఈ టెలిస్కోపు డిజైన్ చేయడంలో, మరీ ముఖ్యంగా కెమెరా రూపకల్పనలో అమెరికా మహిళా ఖగోళ శాస్త్రవేత్త, మర్సియా జె. రూకి కీలక పాత్ర పోషించారు. ఈ టెలిస్కోప్కు జేమ్స్ వెబ్ పేరు పెట్టడానికీ ఓ కారణం ఉంది. 2002లో అప్పటి నాసా అడ్మినిస్ట్రేటర్, షాన్ ఒ కీఫె, ఏజెన్సీ రూపొందించే తదుపరి టెలిస్కోప్కు స్పేస్ సైన్స్లో కీలక వ్యక్తిగా పేరుపొందిన జేమ్స్ వెబ్ పేరును పెట్టాలని నిర్ణయించారు. 1960లో చంద్రుడి మీద మనిషిని దింపేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో నాసాను నడిపించిన అంతరిక్ష ఛాంపియన్ ఈయన.

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT