-->

ఆరోగ్యంపై మనస్సు ప్రభావం | Influence of mind on health

Influence of mind on the health

Influence of mind on the health
 ఆరోగ్యంపై మనస్సు ప్రభావం

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

ప్రతి ఇంట్లో భర్త భార్య మీద కోప్పడడం, తల్లి పిల్లలని కోప్పడడం సర్వసాధారణమైన విషయమైపోయింది. కోపాలు, చిరాకులులేని ಇಲ್ಲ వెతికినా దొరకడం కష్టంగా ఉంది. అలాగే బయటకు వెళ్తే చాలు ఎదురింటి వాళ్ళు, ప్రక్కింటి వాళ్ళు పోట్లాడుకుంటూ కనిపిస్తారు. ఆఫీసులలో చూస్తే బాస్లు క్రిందవారిపై అరుస్తూ ఉంటారు. వర్కర్స్ ఒకరికొకరు పడక అరుచుకుంటూ ఉంటారు. ఈ విధంగా కోపతాపాలనేవి మనిషికి లక్షణాలుగా మారిపోయినవని చెప్పవచ్చు. కోపం అనే ఆయుధాన్ని ఉపయోగించి చాలా మంది పనులు సాధించుకొంటూ ఉంటారు. కోపస్వభావం ఉన్న మనిషిని చూస్తే భయం వేస్తుంది కాబట్టి, ఆ భయంతో వారు ఏది చెబితే అది ఎదుటి వాళ్ళు చేస్తూ ఉంటారు. కోపంతో తాత్కాలికంగా ప్రయోజనం పొందవచ్చేమోకాని దాని వలన అనేక దుష్పలితాలు కలుగుతాయి. మన కోపం ఎదుటి వారిని భయపెట్టడం, బాధపెట్టడమే కాకుండా స్వయంగా మనకి ఎంతో నష్టాన్ని కలుగుజేస్తుంది. కోపం ఉన్న ఎవరి ప్రేమాభిమానాల్ని పూర్తిగా పొందలేరు. పదిమందితో కలిసి హాయిగా నవ్వుతూ గడపలేరు. నా మాటఅందరూ చచ్చినట్లు వింటారు, నేనంటే అందరికీ హడల్ అని మిధ్యా గర్వంతో ఆనందపడాలి తప్ప అంతకుమించి వారు బాపుకునేదేం ఉండదు. మనిషికి కోపాలు వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, భయాందోళనలు కలిగినప్పుడు, ఏడ్చినప్పుడు మొదలగు సందర్భాలలో శరీరంలో, మనస్సులో జరిగే మార్పును పరిశీలిద్దాము.

   పైన చెప్పినట్లుగా మన మనస్సులో అలాంటి సందర్భం ఎప్పుడు వచ్చినా, ఏ రకముగా వచ్చినా మన మెదడులోని కణాలు ఒత్తిడికి గురి అవుతాయి. ఆ ఒత్తిడి వచ్చిన మరుక్షణంలోనే ఆ కణాలకు ప్రాణవాయువు తగ్గిపోతుంది. ఇలా ప్రాణవాయువు తగ్గిన వెంటనే శరీరం స్పందించి వెంటనే రక్తంలోనికి ఎడ్రినలిన్ అనే హార్మోనును విడుదల చేస్తుంది. ఈ హార్మోనుల వల్ల గుండె ఎక్కువగా, మరింత వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. గుండె ఎప్పుడయితే ఎక్కువగా పనిచేస్తుందో, దానికి తగ్గట్లుగా ఊపిరితిత్తులు కూడా వేగంగా పనిచేయవలసి వస్తుంది. ఈ విధంగా గుండె, ఊపిరితిత్తులు ఎక్కువగా పనిచేసి మెదడులోని కణాలకు తగ్గిన ప్రాణవాయువును, ఎక్కువ రక్తం ద్వారా అందించేందుకు ప్రయత్నిస్తాయి. మామూలుగా పరుగెత్తే గుర్రపుబండిని, ప్రయాణం తొందరగా ఉన్నప్పుడు గట్టిగా ఒక కొరడా దెబ్బ వేస్తే, ఆ గుర్రం ఊపందుకుని పరుగులెత్తినట్లే, మన శరీరంలో కూడా గుండె, ఊపిరితిత్తులు ఎక్కువగా పనిచేయడానికి ఎడ్రినలిన్ అనే హార్మోనును కొరడా దెబ్బలా శరీరం ఉపయోగిస్తూ ఉంటుంది. మనలో భయం వచ్చినా, కోపం వచ్చినా, టెన్షన్ వచ్చినా మరుక్షణంలో ఏడవడం ప్రారంభించిన వెంటనే కళ్ళమ్మట నీరు వచ్చినట్లుగా రక్తంలోకి ఈ హార్మోను అలా వెంటనే విడుదల అవుతుంది. ఇలాగ విడుదల అయిన వెంటనే మన శరీరంలో జరిగే రసాయనిక మార్పులు, నష్టాలు ఎలా ఉంటాయో చూద్దాము. 

1) గుండె ఎక్కువగాదడదడా కొట్టుకోవడం వల్ల బి. పి. వెంటనే పెరిగిపోతుంది. ఎవరన్నా గట్టిగా అరుస్తుంటే, వీడికి బి.పి. ఏమన్నా పెరిగిందా ఏమిటి ఇలా అరుస్తున్నాడంటారు.

 2) ఊపిరితిత్తులు ఎక్కువ గాలిని అందించడం కొరకు ఎక్కువగా కొట్టుకుంటాయి. దానివల్ల ఆయాసంతో బుసకొట్టినట్లుగా గాలిని ఎగబీల్చవలసి వస్తుంది.

 3) కోపం వచ్చినప్పుడు వెంటనే ముఖం, కళ్ళు ఎర్రగా అయిపోతాయి. తలకు ఎక్కువ రక్త ప్రసరణవల్ల అలా అవుతుంది. 

4) తల, మాడు భాగము, శరీరము వెంటనే రక్తం ఉడుకుతున్నట్లుగా వేడెక్కిపోతాయి. ఈ వేడివల్లే ఎక్కువ మందిలో వెంటనే తలనొప్పి, మాడు నొప్పులొస్తాయి. 5) రక్తంలోకి ఎడ్రినలిన్ అనే హార్మోను విడుదల కావలం వల్ల కండరాలు బిగుసుకుని పోతాయి. దానివల్లే మెడనొప్పులు లాంటివి వస్తుంటాయి. 

6) ఈ సంఘటనలు జరిగిన కొన్ని గంటల వరకు ఆకలి చచ్చిపోతుంది, అసలు తినాలని వాంఛపోతుంది. 

7) కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువగా ఊరిపోతుంది. జిగురు ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్లే మంటలు, అల్సర్స్ ఎక్కువగా అవుతాయి. 

8) ఎడ్రినలిన్, లివరులో నిలువ ఉన్న గ్లూకోజు పదార్థాలను రక్తంలోకి ఎక్కువగా విడుదలయ్యేట్లు చేస్తుంది. సుగరు పేషంట్లకు కోపాలు, టెన్షన్స్ వచ్చినప్పుడు ఈ కారణంగానే సుగరు పెరిగిపోతుంది. 

9) కోపాలు వచ్చినప్పుడు నిగ్రహశక్తిని కోల్పోయి మంచి చెడు విచక్షణ కోల్పోతారు. 

10) ఇన్ని రకాలైన మార్పులు శరీరంలో, మనస్సులో జరిగేసరికి వాటినుండి రక్షించుకోవడానికి శరీరం ఎంతో శక్తిని వృధా చేసుకుంటూ ఉంటుంది. దానివల్లే ఇలాంటి సంఘటనలు పూర్తి అయ్యాక ఎక్కువగా నీరసం వస్తుంది. ఇవే కాకుండా శరీరంలో, మనస్సులో ఇంకా అనేక రకాల మార్పులు జరుగుతాయి. మొత్తం ఇన్ని విధాలుగా నష్టం జరగడానికి కొన్ని నిముషాలు చాలు. ఈ నష్టాన్ని సవరించుకొని శరీరం, మళ్ళీ మామూలు స్థితికి రావడానికి ఎన్నో గంటలపాటు శ్రమించాల్సి ఉంటుంది. పూర్తిగా ఆ స్థితి నుండి బయటపడ్డాక అయ్యో నేనెలా ఎందుకు ప్రవర్తించాను, అలా చేయకుండా. ఉంటే బాగుండేది అని పశ్చాత్తాపపడతాము. అయినా సరే శరీరములో, మెదడులో వచ్చిన నష్టం నష్టమేగదా! మనం దాన్ని అనుభవించవలసి వచ్చింది. కదా! మనికి బాగా కోపం వచ్చినప్పుడు నాకు గనుక కోపం వచ్చిందంటే నేను మనిషినే కాదు అని అంటూ ఉంటాము. అంటే పశువునవుతాను అని అర్థం. అప్పుడు పశుప్రవృత్తి మనలో వస్తుంది. కోపం మనిషిని పశువులా ప్రవర్తింపజేస్తుంది. పైగా నాకు కోపం వస్తే నేను ఏమి చేస్తానో నాకే తెలియదు. అని గట్టిగా అరుస్తాం. కోపం వల్ల మన మనస్సు నిగ్రహాన్ని కోల్పోయి, మన సహజగుణాలను ఆ సమయంలో పని చెయ్యనివ్వదు. అందుచేతనే ఏది చేతిలో ఉంటే దాన్ని విసిరివేయడమో, వేటినన్నా పగలగొట్టడమో లేదా మనుషులను బాదడమో, కొట్టడమో చేస్తూ ఉంటాము. ఇదంతా లోపల ఉత్పత్తి అయిన హార్మోనుల ప్రభావం వలన జరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడన్నా ఏడ్చినప్పుడు కళ్ళ వెంట నీళ్ళు వెచ్చగా వస్తాయి. అదే మనం బాగా నవ్వినప్పుడు కూడా కళ్ళవెంట నీళ్ళు వస్తాయి. కానీ, ఈ నీళ్ళు చల్లగా ఉంటాయి. ఏ నీరైనా కొన్ని క్షణాల్లోనే వచ్చేస్తుంది. మరి రెండూ వేరువేరుగా చల్లగా, వేడిగా ఎందుకున్నాయి. నవ్వినప్పుడు శరీరానికి, మెదడుకు లాభాన్ని కలిగించే రసాయనాలు విడుదలవుతాయి. దానివల్ల మెదడు చల్లబడి ఆ నీరు బయటకు వస్తుంది. ఏడ్చినప్పుడు చెడ్డ హార్మానులు రక్తంలోకి విడుదలయ్యి రక్తం ఉడికిపోతుంది. దానివల్ల వెచ్చగా వస్తాయి. మన స్పందనను బట్టే మనలోకూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకే పెద్దలు చెప్పినది, తన కోపమే తన శత్రువు అని. బాహ్యంగా మనకు ఎంతో మంది శత్రువులుంటే వాళ్ళపై కక్ష తీర్చుకుంటాము. మనమంటే భయపడేట్లుగా చేయగలుగుతాం. కానీ మనలో ఉన్న కోపం అనే శత్రువును మాత్రం ఏమీ అనలేక పెంచి పోషించుకుంటున్నాము. మన వస్తువులను, మన ఆస్తిని, మన ఇంటిని మన శత్రువులు నాశనం చేయవచ్చు కాని మన శరీరారోగ్యాన్ని మాత్రం ఏమీ పాడుచేయలేరు. మన శరీరారోగ్యాన్ని, మనల్ని పాడుచేసుకునేది స్వయంగా మనమే. మనకు మనమే పెద్ద శత్రువులం. మన పిల్లవాడు చిన్న తప్పు చేస్తే దానికి కోపంతో పెద్దగా కేకలేస్తాము. వెంటనే మీ రక్తంలోకి ఎడ్రినలిన్ విడుదల కావడం, శరీరంలో రకరకాల మార్పులు రావడం మీ ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. కాబట్టి అలాంటి పొరపాటు మనం పెద్దవారిగా చెయ్యకూడదు. మనల్ని చూసి మన పిల్లలు కూడా అదే స్వభావాన్ని అలవాటు చేసుకొంటారు. ఎవరు ఎంత తప్పు చెయ్యనివ్వండి, మీరు మాత్రం ఆవేశం పెంచుకోవద్దు. 'రోడ్డుపై వెళ్ళే ఇద్దరు వ్యక్తుల యొక్క స్కూటర్లు రెండు ఒక్కోసారి ఒకదానికొకటి కొంచెం రాసుకుంటాయి. దానికి కూడా ఆగిపోయి ఇద్దరూ గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. దానితో ఇద్దరికీ లోపల రసాలు ఊరిపోతాయి. ఇద్దరికీ నష్టం తప్పదు. అదే ఒకరు అంటే అన్నారులే. మనదోవను మనం పోదాం అని సర్దుకుని పోయే గుణం ఉన్న వారికి కొంచెం కూడా నష్టం రాదు. అందుకనే పెద్దలు తన శాంతమే తనకు రక్ష అని అన్నారు. ప్రతినిత్యం అశాంతితో, ఉద్రేకాలతో, బాధలతో ఉండేవారికి క్రమంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయి అవయవాలు పనిచేస్తేశక్తిని కోల్పోయి రకరకాల రోగాలకు గురి అవుతూ వుంటాయి. మనము బాగుపడాలన్నా మన చేతిలోనే ఉన్నది. మనంచెడిపోవాలన్నా మన చేతిలోనే ఉన్నది. ఎలాంటి సమస్యలు వచ్చినా దానిని ఓర్పుతో, నేర్పుతో సరిదిద్దుకోవాలే తప్ప కోపం రాకూడదు. మనలో ఏమీ తప్పులేకపోయినా సరే ఎవరన్నా మనల్ని అంటున్నా మనమేమీ పట్టించుకోకుండా.. బుద్ధుడిలా ఉంటే మనం అదృష్టవంతులం అవుతాము.

బుద్ధుడు అందరినీ సన్యాసుల్లా మార్చుతున్నాడని కొందరు పెద్దలు వచ్చి అనరాని మాటలు అంటూ తిడుతూ రెచ్చగొడుతూ ఉంటారు. వారు ఎన్నన్నా బుద్ధుడిలో కొంచెం కూడా చలనం ఉండదు. వారికి కాసేపటికి నోరు నొప్పి పుట్టి ఇలా అంటారు. మేము ఎంతసేపట్నుండీ తిట్టినా వులకవు, పలుకవు మనిషివా! నీవసలు పశువువా! అని. అప్పుడు చిరునవ్వుతో బుద్ధుడంటాడు, మీరన్న మాటలను నేను స్వీకరించలేదు. అందుకే అవి నన్ను బాధించలేదని ఒక ఉదాహరణ చెబుతాడు. మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు సరిగా మర్యాద చేస్తే ఉంటాడు, మనం సరిగా పలుకరించకపోతే తిరిగి వెనిక్కి వెళ్ళిపోతాడు. అలాగే, మీరన్న మాటలను నేను పట్టించుకోలేదు కాబట్టి అవి నన్ను చేరకుండా మళ్ళీ మిమ్మల్నే చేరుతాయి అని సమాధానవమిస్తాడు. ఎవరన్నా మనల్ని ఒకటి అంటే మనం వారిని పది అంటాం కదా. అలా కాకుండా ఎవరేమన్నా మనం వాటిని పట్టించుకోకుండా మౌనం వహించడం ఎంతో మేలు చేస్తుంది. ఇంకొక మంచి మాట నాకు తెలిసినది చెబుతాను. విన్నది ఎప్పుడు విన్నవానికే చెందుతుంది, చూచినది చూచినవారికే ఎప్పుడూ చెందుతుంది, తిన్నది ఎప్పుడూ అన్న వానికే చెందుతుంది. చెందినప్పుడు మరి, అన్నది అన్న వానికే చెందదా? ఆలోచించండి. ఈ మూడు విషయాలలో ఎవరిది వారికేనిజానికి అన్నది ఎప్పుడూ అన్నవానికే చెందుతుంది. ఎవరేమన్నా మనం మంచిదయితే ఇలా నష్టం వారికే తప్ప మనకేమీ రాదు. మన మనస్సు పట్టించుకోండా ఉండగలుగుతాము. మన మనస్సుమంచిదయితే మనుషులందరూ మంచివారిగానే కనబడతారు. అప్పుడు ద్వంద్వాలు ఉండవు. మనిషిగా మనకు మనస్సే ప్రధానం. అందుకే వేమనగారు. ఇలా చెప్పారు. "ఒక్క మనస్సుతోడనున్నది సకలము, తిక్కబట్టి నరులు తెలియలేరు, ఇక్కమెరిగి నడువ నొక్కటే చాలురా, విశ్వదాభిరామ వినుర వేమ".మనస్సు ప్రశాంతంగా ఉంటే ముఖంలో నవ్వు, ఆనందం కలిసి ఉంటాయి. అందుకే నవ్వుతూ ఉండే పసిపిల్లలను చూసినప్పుడు అందరికీ ఆనందం కలుగుతుంది. ఒకరి ముఖంలో ఆనందం ఎందరికో ఆనందాన్నిస్తుంది. ఒకరి ముఖంలో కోపం ఎందరికో కోపాన్ని లోపల పుట్టిస్తుంది. మనిషికి శారీక అనారోగ్యం ఉంటే దానివల్ల తను ఒక్కడే ఆ బాధను అనుభిస్తూ ఉంటాడు. అదే మనిషికి మానసిక అనారోగ్యం ఉంటే (కోపం, ఆవేశము, మాటలతో హింసించడం) దానివల్ల తనతోపాటు ఇంకెందరినో బాధిస్తూ ఉంటాడు. మనిషికి శారీరక ఆరోగ్యము కంటే మానసిక ఆరోగ్యము ఎంతో ముఖ్యము. అలాంటి మానసికారోగ్యాన్ని మనం మంచిగా ఉంచుకునేట్లు ప్రయత్నిద్దాము. మనం ఎవరిమీద అరవవద్దు, ఎవరన్నా మనల్ని అంటే పట్టించుకోనూ వద్దు. ఇలా ఉంటే ప్రతిక్షణం హాయిగా ఉంటుంది. చివరకు జీవితమే హాయిగా సాగుతుంది.

          ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                    ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి                           👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                    https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                                                  ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

                                             ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                                     👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                         https://www.facebook.com/groups/287841976124793

                                                   ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                              👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                           https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

                                         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా  జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

                                      ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                      ═════════◄••❀••►═════════ 

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT