-->

తెల్లటి బియ్యాన్ని మానండి | Avoid white riceAvoid white rice
తెల్లటి బియ్యాన్ని మానండి 

*************************

. ఆంధ్రులకు అన్నం ప్రధానమైన ఆహారం. రోజుకి కావలసిన శక్తిలో సుమారు 70 శాతం పైగా శక్తిని అన్నమే మన శరీరానికి సమకూర్చుతుంది. మన జీవితానికి అతి ప్రధానమైన అన్నాన్ని మన పూర్వీకులు వడ్లను దంచుకుని వాటిని తినవలసి వచ్చేది. దంచడంతో పోషకపదార్థాలు ఏవి నశించకుండా అన్నీ మిగిలి ఉండేవి. ఎప్పటి నుండైతే మనిషి మిల్లులను కనుకున్నాడో అప్పట్నుండి బియ్యాన్ని పాలిష్ పట్టడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఆ పాలిష్ పట్టడం అనే జబ్బు ముదిరిపోయి, బియ్యాన్ని ముత్యాల్లా మెరిసేట్లుగా పాలిష్ తింటున్నారు. తొక్కతీసిన బియ్యం ఎర్రగా ఉంటాయి. ఈ ఎర్రటి బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేస్తే పురుగుపడుతుందని, వాటిని తెల్లగా పాలిష్ పట్టి దాచుకునేట్లుగా ఏర్పాట్లు వచ్చాయి. పైగా వండుకోవడం తేలిక. నమలకుండా మ్రింగడానికీ తేలిక. బియ్యాన్ని పాలిష్ పడితే ఏమవుతుందోచూద్దాము, ఎర్రటి బియ్యాన్ని పాలిష్ మరలో పోస్తే, ఆ మిల్లు ఆ బియ్యం పై ఒక పొరను చెక్కేస్తుంది. ఆ చెక్కగా వచ్చిన పై పొట్టును మొదటి పాలిష్ (తౌడు) అంటారు. ఈ పై పొరలో, బియ్యంలో ఉండే అతిముఖ్యమైన పోషక పదార్థాలు 50 శాతం వరకూ వచ్చేస్తాయి. అవి, ముఖ్యంగా 12 రకాల బి విటమిన్లు, విటమిన్-ఇ, పీచుపదార్థాలు, లిసిథిన్ మొదలైనవి. ఈ మొదటి పాలిష్ లో అన్నీ ముఖ్యమైనవి ఉన్నాయి. కాబట్టి ఈ తౌడును మందుల కంపెనీల వారు కొనుక్కుని మందుల తయారీకి వాడతారు. ఈ తౌడునే ఖాళీ గొట్టాలలో పోసి, బలానికి గొట్టాలుగా, గొట్టాన్ని రూపాయికి మనకమ్ముతారు. మొత్తం తౌడునే కాకుండా ఆ గొట్టాలలో నిల్వ ఉండడానికి, రంగుకు, వాసనకు కొన్ని మందులను కలిపి తయారు చేస్తారు. తెల్లటి బియ్యం తిని బి-కాంప్లెక్సు గొట్టాలు వేసుకోవడం ప్రజలకు తేలికగా ఉంది. ఈ మొదటి పాలిష్ తౌడును బలానికని పాలల్లో వాడే పొడుల్లో, ఇతర బలవర్ధకమైన ఆహార పదార్థాలలో కలుపుతూ ఉంటారు. మొదటి పాలిష్ పోగా వచ్చిన బియ్యం కొద్ది తెలుపే తప్ప పూర్తిగా తెలుపు రావు. అందుచేత ఈ బియ్యాన్ని మరలా పాలిష్ మరలో పోస్తారు. దాంతో పెద్ద పొరను మిల్లులు లేపేస్తాయి. ఈసారి తెల్లగా మెరిసిపోతూ వస్తాయి. రెండవ సారి వచ్చిన తౌడును (30 శాతం పోషక పదార్థాలుంటాయి), గేదెలకు, ఆవులకు, ఇతర పశువులు, చేపలకు, రొయ్యలకు బలానికి వాడతారు. ఆ తెల్ల బియ్యాన్ని మాత్రం వాడుకునేందుకు మనం ఉంచుకుంటాము. ఈ రకముగా తెల్లటి బియ్యాన్ని ఎన్నో సంవత్సరాలుగా మనము తింటూ శరీరానికి ఎంతో నష్టాన్ని కలిగించుకుంటున్నాము. తెల్లటి బియ్యం వల్ల నష్టాలను తెలుసుకుందాం. 

1) బియ్యంలో ఉండే 12 రకాల 'బి' విటమిన్స్ 80 శాతం పైగా కోల్పోయి, కేవలం 15, 20 శాతం మాత్రమే మిగులుతాయి. 

2) శరీరానికి బలాన్నిచ్చే

'బి' విటమిన్లు సరిగా లేకుండా ఉన్న తెల్లటి అన్నాన్ని తిన్నందుకు ఎక్కువగా అలసి పోవడం, త్వరగా నీరసం రావడం, పిక్కలు లాగడం, కష్టపడి పని చేయలేక పోవడం మొదలైనవన్నీ వస్తాయి. ఉదాహరణకు మన ఇళ్ళలో ఇప్పుడున్న 70, 75 సంవత్సరాల ముసలి వారికున్న ఓపిక 50 సంవత్సరాల వారికి లేదు. 50 సంవత్సరాల వారికున్న ఓపిక 25, 30 సంవత్సరాల వారికి లేదు. వీరికున్న ఓపిక చిన్న పిల్లల్లో లేదు. దీనికి కారణం చూస్తే ముఖ్యముగా తెల్లటి బియ్యాన్ని తినడం అని స్పష్టంగా తెలుస్తున్నది. 

3) పై పొరలో విటమిన్ 'ఇ' అనేది ఉంటుంది. ఇది త్వరగా ముసలి తనం రాకుండా చేస్తుంది. తెల్లటి బియ్యంలో ఇది పూర్తిగా ఉండదు. 4) లిసిథిన్ అనే పదార్ధము తెల్లటి బియ్యంలో ఉండదు. ఈ పదార్ధము మనలో కొవ్వు, కొలెస్ట్రాల్ పదార్థాలు పేరుకోకుండా. నివారించేందుకు క్రొవ్వుకు విరుగుడుగా పనిచేస్తుంది. తెల్లటి బియ్యాన్ని తినేవారికి ఈ రక్షణ శరీరంలో ఉండదు. గుండె జబ్బులు రాకుండా నివారించే శక్తి తెల్లటి బియ్యంలో ఉండదు. 

5) పీచుపదార్థాలన్నీ బియ్యం పై పొరలలో ఉండడం వల్ల, తెల్ల బియ్యంలో పీచు లేనందువల్ల మలబద్దకం వస్తుంది. ఎన్ని మందులు వాడినా తగ్గదు. 

6) తెల్లటి బియ్యం తినేవారు ఎక్కువ బరువు పెరుగుతారు. ఈ బియ్యములో పీచుపదార్థాలు లేనందువల్ల తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి, రక్తంలోనికి ఒకేసారి చేరి పోతుంది. దాంతో శరీరము ఈ శక్తి అంతటినీ క్రొవ్వుగా మార్చివేస్తుంది. అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి.

 7) తెల్లటి అన్నం మెతుకులు సన్నగా ఉండే సరికి, సరిగా పంటి క్రింద పడక, నమలకుండా తేలిగ్గా జారి గొంతులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. నమలనందుకు నోటిలో గానీ, పొట్టలోగాని జీర్ణక్రియ సరిగా ఉండదు. 

8) శరీరానికి ఎక్కువ సేపు వరకూ, ఎక్కువ శక్తిని సమకూర్చలేదు. తిన్న 3, 4గంటలలోనే నీరసం వచ్చేట్లుగా చేస్తుంది.

 9) తెల్లటి బియ్యం తినడం వల్ల బి" కాంప్లెక్సు గొట్టాలు, బలానికి టానిక్కులు త్రాగవలసిన స్థితిని శరీరానికి కలిగిస్తున్నాము. 

10) కాళ్ళకు నీరు పట్టడం, తిమ్మిర్లు రావడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. 

11) తెల్లటి బియ్యంలో తేలిగ్గా జీర్ణమయ్యే క్రొవ్వు పదార్థాలుండవు. తొడులోకి ఈ క్రొవ్వు పదార్థాలు వెళ్ళి పోతున్నాయి. ఈ ఉపయోగపడే క్రొవ్వు పదార్థాలు హాని లేకుండా శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి. తెల్లటివి తినే వారికి ఈ శక్తి లోపిస్తుంది. 

12) తెల్లటి అన్నం రుచి ఉండదు. చప్పగా ఉంటుంది. పచ్చళ్ళను ఇందులో ఎక్కువగా తినాలనిపించే విధముగా చప్పదనముంటుంది.


ఏదో మన పెద్దలు దంపుడు బియ్యం తిన్న బలంతో మనల్ని కన్నందుకు, మనం ఇన్నాళ్ళూ ఎన్ని తప్పులు చేసినా ఏ తెల్లటన్నాన్ని తిన్నా ఆ బలం మనల్ని రక్షించింది. మన పిల్లలు మన నుండి పుట్టారు కాబట్టి మనలో ఉన్న బలం వారిలో లేదు. అలాంటి వారికి మనం పుట్టినప్పటనుండీ ఆ తెల్లటన్నాన్ని పెట్టడం వల్ల, ఆ తల్లిదండ్రులకు సేవ చేయాల్సింది పోయి, ఇప్పుడు పిల్లలకే తల్లిదండ్రులు చేసిపెట్టే రోజులొచ్చాయి. ఇదంతా తెల్లటి బియ్యం చలవే. కేజి ముడి బియ్యం 14, 15 రూపాయలకు వస్తాయి. ఈ ముడిబియ్యాన్ని పాలిష్పట్టి ఉపయోగపడే రెండు పొరలను తీసివేయగా, ఆ పనికి రాని తెల్లటి బియ్యంలో ఏమీ లాభం లేదు కాబట్టి ఆ తెల్లటి బియ్యాన్ని కేజి 5, 6 రూపాయలకో అమ్మాలి. కానీ మనం దానికి వ్యతిరేకంగా తెల్లటి బియ్యాన్ని 20, 25 రూపాయలకు కొంటున్నాము. "డబ్బు పోయి శని పట్టడం" అంటే తెల్లటి బియ్యాన్ని కొనుక్కోవడమే మరి. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము. తౌడుకు 10, 15 రోజులలో పురుగులు పట్టేస్తాయి. ముడి బియ్యంలో అయితే2, 3 నెలలకు గానీ పురుగు పట్టదు. అదే తెల్లటి బియ్యానికైతే 7, 8 నెలలైనా పురుగు పట్టదు. బాగా లాభమున్న ఆహారమేదో సరిగా తెల్సుకుని, పురుగులు వాటికే తొందరగా పట్టి తినడం మొదలు పెడతా ఎక్స్యి. పురుగులకు ఏది తినాలో, ఎందులో లాభమున్నదో తెలుస్తున్నది గానీ జ్ఞానమున్న ఈ మనిషికి మాత్రం తెల్లటి వాటిని పట్టడం తెలుస్తున్నది. అందుచేతనే, మనిషికి అన్నీ ఉన్నా ఆరోగ్యం మాత్రం ఉండడం లేదు.


ఇన్నాళ్లూ తెల్లటి బియ్యాన్ని తింటే తిన్నాము, ఇక మాత్రం మనందరము | ఆ తప్పు జరగకుండా ఇంటిల్లపాదీ ముడి బియ్యాన్ని తినే మంచి అలవాటు చేసుకుందాము. ముడి బియ్యం మాకు దొరకవని తప్పుకునే ప్రయత్నం చేయకండి. మొదటి పాలిష్ పట్టిన బియ్యం కూడా పనికి రావు. పూర్తి ముడి బియ్యం మాత్రం కొనండి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రైతు బజార్లు వచ్చాయి. చాలా చోట్ల అమ్ముతున్నారు. లేదా మీరు బియ్యాన్నమ్మే రైతులను తెచ్చిపెట్టమంటే వారే తెస్తారు. మనకేది కావాలో మార్కెట్లోకి అది వచ్చిదిగుతుంది. అలాంటిచోట అయితే చౌకగా దొరుకుతాయి. సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతున్నాయి. కొన్ని చోట్ల ఖాదీ భాండార్లలో కూడా అమ్ముతున్నారు. మీకు దగ్గర్లో ఎక్కడన్నా రైస్ మిల్లులుంటే, వారివద్దే మనం అడిగి తెచ్చుకోవచ్చు. ఆ బియ్యం నిల్వచేసుకోవడానికి వేప ఆకు బాగా వేసి, గట్టి మూటకట్టి ఉంచితే పురుగు పట్టదు. వండు కోవడానికి శ్రమ ఏమీ ఉండదు. మామూలుగా గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీరు పోస్తే చాలు. రైస్ కుక్కర్లు వచ్చాయి కాబట్టి, అందులో పెట్టి మూడు కూతల వచ్చాక 10 ఇంట్లో ఉన్నదినిమిషాల పాటు మంటను బాగా తగ్గించి అలా సిమ్లో ఉంచితే సరిపోతుంది. పాత బియ్యం అయితే అన్నం. . జిగురు రాదు. మెత్తగా దూదిలాగా పొట్టవిప్పి ఉడికి ఉంటుంది. ఈ అన్నం

అరగదు అనేది అపోహే. మనకి మాంసం ముక్కలు, ఆవకాయ బద్దలు అదగ్గాలేనిది ముడి బియ్యం అన్నం అరగదంటే అది వంక తప్ప మరేమీ కాదు, గోధుమలను, రాగులను, జొన్నలను కూడా అన్నంగా వండుకునైనా తినవచ్చు. గోధుమ రవ్వ అయితే ఎర్రటి గోధుమ రవ్వను (ఇవ్వు గోధుము రవ్వ) వండుకోండి. పళ్ళు లేనివారు ఈ అన్నం అయితే చాలా బాగా తినవచ్చు. విరేచనం బాగా అవుతుంది. తెల్లగోధుమ రవ్వ అయితే దానినీ పాలిష్ పట్టి ఉంటారు కాబట్టి లాభముండదు. అన్నం బదులుగా రొట్టెలు తిందామనుకునే వారు గోధుమ పుల్కాలు, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు లేదా మూడు, నాలుగు రకాల గింజలను కలిపి ఆడించి ఆ పిండితో రొట్టెలు చేసుకోవచ్చు. గోధుమ పిండిని షాపులో కొనవద్దు. గోధుమలను పాలిష్ పట్టి పై లాభాన్ని తీసివేసి లోపల పొరను (తెల్లటి బియ్యంలాగా తెల్లటి గోధుమను) మర లడించి, ఆ పిండిని పొట్లంలో అందంగా పెట్టి, మాపిండితో అయితే మీ రొట్టెలు ఇలా పొంగును అన్నట్లుగా చూపించి మోసం చేస్తారు. నిజంగా ఆ పిండితో రొట్టెలు చేస్తే అవి బయట పొంగడమే కాదు, మన పొట్టకూడా ఆ తరువాత పొంగుతుంది. అందుచేతనే, గోధుమలను ఆడించి, ఆ పిండితో రొట్టెలను చేసి తినవచ్చు. గోధుమ రొట్టెలు గుల్లగా రావాలంటే ఆ పిండిలో నువ్వుల పొడిగానీ, వేరుశనగ పొడిగానీ కొద్దిగా కలిపి చేస్తే మెత్తగా ఉంటాయి. మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ అన్నాన్ని తినండి. పండును ఆశించి చెట్టుకు మంచి బలమైన పోషణ చేస్తున్నారు. పాలను ఆశించి పశువులకు మంచి తిండి పెడుతున్నారు. అన్నింటికీ పెట్టి చివరకు మనల్ని ఎండ కట్టుకునే పాలిపోయే బియ్యపు అన్నాన్ని తినే సంస్కృతిని ప్రక్కన బెట్టి మంచి బలాన్నందించే ముడిబియ్యాన్నే ముందుచూపుతో వాడుకుందాం. బంధువులు వచ్చినా వారికే మన మంచిని నేర్పుదాం. మొత్తం

కుటుంబం అంతా పుష్టిగా తయారవుదాం మంచి అలవాట్లు మన మందు తరాలకు అందిద్దాం

నేడు సిరి ధాన్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి కొర్రలు సామలు, ఊదలు, అరికలు అండు కొర్రలు... వాటిని కూడా రోజు ఒక పూట అన్నం లాగా వండుకొని తింటే ఆరోగ్యంగా ఉంటారు...

ఒక పూట ముడి బియ్యం ఒక పూట మిల్లెట్స్ వాడండి ఆరోగ్యంగా ఉంటారు...

          ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                    ═════════◄••❀••►═════════ 

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నో టిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

 ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి                           👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                    https://chat.whatsapp.com/GMBlJ2ORA0ZBtlndUsarBf

                                                  ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

https://chat.whatsapp.com/K2cVpC2iD0OJabEvXDFWVN

                                             ━━━━━━━༺༻━━━━━━━ 

దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                                     👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                                         https://www.facebook.com/groups/287841976124793

                                                   ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                                              👇👇👇👇👇👇👇👇👇👇👇👇

                           https://chat.whatsapp.com/JIGpBFB0qJ67lJQTfEgH40

                                         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా  జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

                                      ═════════◄••❀••►═════════ 

SUBSCRIBE TO PRUDHVIINFO NEWSLETTER 

                                      ═════════◄••❀••►═════════ 

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT