Avoid tea and coffee
☕టీ, కాఫీలను మానండి
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
ఇది కాఫీ టైము, ఇది టీ టైము అని అందరికీ ఉంటున్నది. అంటే అంత టైము ప్రకారముగా మానకుండా వాటిని త్రాగేటట్లుగా మనిషి అలవాటు పడిపొయ్యాడు. తెల్లదొరలు మన దేశాన్ని పాలించినప్పుడు, వాళ్ళ అలవాట్లు మనవాళ్ళు నేర్చుకొని దాన్ని మానకుండా త్రాగుతూ, దేశమంతటా ఆ అంటువ్యాధి లాగా ఒకరికొకరు ముట్టించుకుని ఓనమాలు నేర్చుకోనివారి దగ్గర్నుండీ, బాగా చదువుకున్నవారి వరకు అందరూ త్రాగుచున్నారు. కాఫీ, టీలను త్రాగడాన్ని ఎవరూ దురలవాటుగా అనుకోరు. ఎవరూ దురలవాటని అనడంలేదు. మనదేశంలో బ్రాందీలు, విస్కీలు త్రాగితే దాన్ని దురలవాటుగా చెప్పుకుంటారు. అదే ఇతర దేశాలలో బ్రాందీలు, విస్కీలు త్రాగినా ఎవరూ దాన్ని దురలవాటు అని అనరు. ఎందుకంటే అక్కడ ఆడ, మగ, పిల్ల, పెద్ద అందరూ కలిసి కూర్చుని త్రాగుతారు. ఇలా అందరూ త్రాగేవారే కాబట్టి ఇంక అది దురలవాటనే వారు ఎవరుంటారు? అదే మనదేశంలో అయితే బ్రాందీలను, విస్కీలను త్రాగేవారు 40, 50 శాతం మంది ఉంటే మిగతా వారు త్రాగడం లేదు కాబట్టి, వీరు అనడానికి మిగిలారు. అందుకని అది దురలవాటుగా పేరుపడింది. మరి కాఫీ, టీలు కూడా శరీరంపై అదే ప్రభావాన్ని చూపే వ్యసనాలు. అయినప్పటికీ కాఫీ, టీలను దురలవాటుగా ఎందుకనటం లేదంటే, అందరూ త్రాగుతున్నారు. కాబట్టి అనేవారెవరు నాబోటివాడు అనాలి తప్ప. వాస్తవానికి కాఫీ, టీలు కూడా సిగరెట్లు, గుట్కాలు, విస్కీలు, జరదా, కిళ్ళీలలాగా ఒక వ్యసనమే. వ్యసనము అంటే, కొన్ని రోజులు త్రాగాక అది త్రాగకుండా ఒకరొజు
మానినపుడు, ఆ టైముకి మీరు మరిచినా అది మరవకుండా త్రాగమని గుర్తు చేస్తూ వుంటుంది. మీరు సంవత్సరం పాటు రోజూ ఒక టైము ప్రకారం మజ్జిగ త్రాగి, ఎప్పుడన్నా ఒక్క రోజు మాని చూడండి. ఆ టైముకు మీరు మజ్జిగ త్రాగ లేదని మీ శరీరము ఇబ్బంది పడుతుందేమో. ఇది ఆహార పదార్ధము కాబట్టి అలా ఇబ్బంది అనిపించదు. మరి టీ, కాఫీలు ఆహార పదార్థాలా? ప్రతి రోజూ ఎన్నోసార్లు, ఎంతమంది కొరకో త్రాగుతున్నాము. ఎంతమందికో మన చేతులతో ఇస్తున్నాము. అవి మందు పదార్థాలు తప్ప ఆహారం కాదు. టీ, కాఫీలలో ఏముంటుందో చూద్దాము.
ఒక కప్పు కాఫీలో 150 మిల్లీ గ్రాముల కెఫీన్ అనే మందు ఉంటుంది. ఒక కప్పు టీలో 150 మిల్లీ గ్రాముల టీన్ అనే మందు ఉంటుంది. ఈ రెండు మందులను నరాల సంబంధించి, రక్త నాళాల సంబంధించి ఇబ్బందులు వచ్చినప్పుడు వాడితే వాటిని తగ్గించుకోవడానికి పనిచేస్తాయి. నేను బి. ఫార్మసీ చదివినప్పుడు మాకు కాఫీల నుండి, టీల నుండి ఆ సారాన్ని తీసి మందులుగా తయారు చేయడం తెలిసింది. ఎవరికన్నా నరాలు, రక్తనాళాలు ఇబ్బందులు వచ్చినప్పుడు, వైద్యులు ఆ నరాలు చురుగ్గా పనిచేయడానికి ఈ మందులను వాడతారు. మనం రోజులో ఒక కప్పు కాఫీ గానీ, టీ గానీ త్రాగితే, నరాలకు సంబంధించి 150 మి.గ్రా. టాబ్లెట్ వేసుకున్నట్లే. ఎవరైనా కొందరు కాఫీ చెడ్డది, టీ మంచిది అని అంటూ ఉంటారు. వాస్తవానికి ఈ రెండూ ఒకేజాతి. అక్కా చెల్లెళ్ళు, అంతే భేదం. మనం రోజుకి ఎన్ని కప్పులు త్రాగుతున్నాము? 10 12 కప్పులని, మరి కొందరు 5, 6 సార్లని ఇలా లెక్క వస్తుంది. ఈ విధముగా రోజు మొత్తంలో ఆ మందును ఎంత ఎక్కువగా మనలోకి పంపుతున్నామో ఆలోచించండి. ఇలా ఒక్క రోజు లేదా రెండు
రోజులా? ఎన్ని సంవత్సరాల నుండి ఈ శరీరాన్ని ఆ ఉద్రేకపరిచే పదార్థాలతో ఇబ్బంది పెడుతున్నాము కదా! కాఫీ, టీలు త్రాగిన తరువాత మనలో ఏమి జరుగుతుందో చూద్దాము. మామూలుగా మనలోని నరాలు సమస్థితిలో పనిచేసుకుంటూ ఉంటాయి. మీరు కాఫీ, టీలను త్రాగిన అరగంటలో అందులోని మందు మీలో పనిచెయ్యడం మొదలు పెడుతుంది. కెఫిన్, టిన్ ల ప్రభావం వలన మనలోని నరాల వ్యవస్థ ఒక్కసారే చురుగ్గా, ఉషారుగా పని చెయ్యడం ప్రారంభిస్తుంది. మామూలుగా నడిచే ఎద్దు కొరడా దెబ్బ వేస్తే స్పీడ్గా గా పరిగెత్తి నట్లుగా మనలో నరాలు కూడా అలానే పనిచేస్తూ ఉంటాయి. ఇలా ఆ పవరు సుమారుగా 2, 3 గంటల పాటు మనలో ఉంటుంది. ఆ పవరు పనిచేసినంతసేపు మీరు మరీ హుషారుగా, చురుగ్గా మనస్సు తేలికగా చక చకా చేసుకుందామనే ఊపులో ఉంటారు. ఇలా ఉంటే మంచిదేగదా అని మీరు అనవచ్చు. పరుగెత్తిన ఎద్దు కొంతసేపటికి అలుపు వచ్చి మామూలుగా నడిచే నడక కూడా నడవకుండా, దున్నపోతు నడకకు తగ్గిపోతుంది. అలాగే మనలో కూడా నరాలు సహజ స్థితిలో పనిచేయాల్సింది పోయి మరీ దిగజారిపోయి పని చేస్తుంటాయి. అలాంటప్పుడు మీకు నీరసంగా, బద్ధకంగా, హుషారు తగ్గిపోయి నట్లుగా ఉంటుంది. ఆ సమయంలో శరీరం మళ్ళీ నాకు కాఫీ కావాలని లేదా టీ కావాలని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ టైముకి శరీరం అడిగినా మీరు అందివ్వకపోతే మీకు వెంటనే తలనొప్పిగా మనస్సు పనిచెయ్యనట్లుగా అనిపించి నీరసంగా అయిపోతారు. అందుకే మీకు కాఫీ, టీల టైము అయినప్పుడు ఎక్కడున్నా ముందు వాటిని త్రాగేవరకు తోచదు. ఈ అలవాట్లు శరీరాన్ని మనస్సును దిగజారిపోయేట్లు చేస్తాయి. అందుకే వీటిని దురలవాట్లు అన్నారు. ఉత్తి మామూలుగా పనిచేసే నరాలను ఉద్రేకపరచడమెందుకు ఆ ఫై
మనము ఇబ్బందులు పడటమెందుకు? మనిషి అంటే, ఎప్పుడూ సమస్థితిలో ఉండవలసినవాడు. అంతేగానీ, రోజూ శరీరాన్ని, మనస్సును ఉద్రేకపరుచు అనేవాడు కాదు. కాఫీ, టీలను త్రాగడం వల్ల నష్టాలు ఆలోచిద్దాము. 1) ప్రేగులపై వీటి ప్రభావం పడి ఆహారం మీద వాంఛపోతుంది. ఆకలి రావడం అందరికీ అనుభవమే. 2) పొట్ట, ప్రేగులలో మంటలను, పూతలను రాకుండా ఒకరకమైన జిగురు పదార్థం కాపాడుతుంది. ఆ జిగురును పుట్టించే గ్లోబ్లెట్ కణాలపై వీటి ప్రభావం పడి ఆ జిగురు ఉత్పత్తిని సగానికి సగం తగ్గించివేస్తాయి. దాంతో కడుపులో మంటలు, ప్రేగుపూతలు, అల్సర్స్ మొ||నవి. వస్తాయి. మనం ఈ సమస్యలు వచ్చినప్పుడు కారాలను, పులుపులను మానుతున్నామే గాని, టీ, కాఫీలను మానము. ఆ సమస్యలు అందుకే పూర్తిగా తగ్గడం లేదు. 3) పొట్ట, ప్రేగులలో ఆహారాన్ని అరిగించడానికి ఎన్నో ఎంజైములు ఊరతాయి. వాటి ఉత్పత్తిని తగ్గించివేస్తాయి. 4) నరాలు ఎక్కువగా ఉద్రేకపడి పనిచేస్తున్నందుకు త్వరగా అలసటకు గురి అవుతాయి. 5) కాఫీ, టీల పవరు మనలో అయిపోయినపుడు మనం వాటిని మళ్ళీ త్రాగకపోతే వెంటనే తలనొప్పులొస్తాయి. అలా అలవాటు అయిన తలనొప్పులు రోజులో ఏదో ఒక టైములో వస్తూనే ఉంటాయి. 50, 60 శాతం తలనొప్పులకు కాఫీ, టీలే కారణాలు అని అనవచ్చు. 6) కాఫీ, టీలు కిడ్నీలపై ఉండే ఎడ్రినల్ గ్రంథులపై పనిచేసి కొంచెం కొంచెం మూత్రం ఎక్కువ సార్లుగా పోసి అతిమూత్ర వ్యాధి వచ్చేట్లుగా చేస్తాయి. 7) మన లివరకు, ప్రతిరోజు ఒక కప్పు త్రాగినందుకు వచ్చిన దోషాన్ని శుభ్రం చేసుకోవడానికి రోజు పడుతుంది. మనం రోజుకి 5, 6 కప్పులు త్రాగితే మిగతా కప్పులలో మందు ప్రభావాన్ని శుద్ధి చేయలేక లివరుకు సమస్యగా మారుతుంది. 8) మెదడును ఎక్కువగా పనిచేయించడం
చే త ఎక్కువగా ఆలోచనలు రావడం, స్థిరంగా లేనట్లుగా అనిపించడం, చిరాకుగా ఉండడం జరుగుతుంది. 9) నరాలు ఎప్పుడూ ఉద్రేకంలో ఉండడం వల్ల రిలాక్సు కావు. దానితో సరిగా నిద్రరాదు. పడుకున్న వెంటనే నిద్ర పట్టదు. 10) ప్రొfద్దున్నే కాఫీ, టీలు త్రాగడం వల్ల మన శరీరానికి విసర్జన క్రియ ఆగిపోతుంది. పరగడుపున మన శరీరం మనలో ఉన్న చెడును క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఇవి గిన వెంటనే ఆ చెడువదిలే కార్యక్రమాన్ని ఆపి సడన్ గా ఉద్రేకపడి ఈ గొడవలో పడిపోతుంది.
కాలక్షేపానికి త్రాగే కాఫీ, టీలలో ఏముందో తెలుసుకోకుండా, ఎన్నాళ్ళుగానో ఈ శరీరాన్ని ఏడిపిస్తూ వస్తున్నాము. కాలక్షేపానికి మీ ఇంటికి కాస్త బుర పూసుకుంటారా? మీ కారు ఆయిల్టాంకులో కాస్త ఇసుక పోసుకుంటారా? అలా చెయ్యరే! మరి ఎన్నో కోట్లు పోసినా కొనలేని ఈ శరీరంలో కాలక్షేపానికి అలాంటి చెత్తను ఎందుకు పోస్తున్నారు? పైగా ఒకరకంగా కాదు. మనకోసం ఒకసారి, బంధువులకిచ్చి వారికి తోడుగా మరోసారి, ఏమీ ఊసిపోక ఇంకొకసారి, ఊరికే వచ్చిందనో, స్నేహితులకొరకో ఇలా రోజుకి ఎన్నిసార్లు ఇలా ఈ శరీరాన్ని ఔషధమయం చేస్తున్నారు. ఇది మన శరీరము. మన సుఖము కొరకే పనిచేస్తున్నది. కాబట్టి ఇక అలాంటి టీ, కాఫీల సాంప్రదాయాలను పూర్తిగా వదిలివేయండి. మీ ఇంటికి బంధువులొచ్చినా గానీ ఇవ్వకండి. ఏం ఆశ్చర్యంగా ఉందా? లేదా ఇంకొకసారి రారని అనుమానమా? మనం బాగుపడి నలుగురినీ బాగుచెయ్యాలి గానీ, మనం చెడిపోయి నలుగురినీ చెడగొట్టకూడదు గదా! మీ ఇంటికి బంధువులొచ్చినప్పుడు ఎలా చెయ్యాలో చెబుతాను. వారు రావడంతోనే కూర్చోబెట్టి, పెద్ద చెంబుతో మంచినీళ్ళు తెచ్చి దగ్గరుండి మరీ పొట్టనిండుగా త్రాగించండి. పది నిమిషాలు ఆగి కాఫీ త్రాగుతారా, టీ త్రాగుతారా అనిమర్యాదకు అడగండి. పొట్ట బరువుగా ఉంది, ఇక ఏమీ అక్కర్లేదని పని అయ్యాక వెళ్ళిపోతారు. మీరు కూడా కాఫీ, టీలను మాని ఆ టైములో ఎక్కువగా నీటిని త్రాగే అలవాటు చేసుకోండి. శరీరం శుద్ధి అవుతుంది. ఆరోగ్యానికి మంచిది. కాఫీ, టీలను మానినప్పుడు మొదటి 5, 6 రోజులపాటు మనసు, నోరు లాగేస్తూ ఉంటాయి. వాటిపై వాంఛను పోగొట్టుకోవడానికి మానిన రోజు నుండి మీరు గోరువెచ్చని నీటిలో ఒకటి, రెండు నిమ్మకాయలు రసాన్ని పిండి (కావాలంటే 1, 2 స్పూన్ల తేనె) పుల్లగా ఉండేటట్లుగా త్రాగండి. ఎప్పుడైతే నోరు పుల్లగా అవుతుందో వాటిమీద వాంఛ పోతుంది. పులుపుకు ఆ గుణం ఉన్నది. రోజుకి అలా 2, 3 సార్లు త్రాగవచ్చు. వీటిని మానినందుకు తలనొప్పిగా ఉంటే రెండు పూటలా తలస్నానం చన్నీళ్ళతో చేయండి. అత్యవసరమైతే నొప్పికి మాత్రలు వేసుకోవచ్చు. వారం రోజుల్లోనే మీ శరీరం వాటి స్నేహాన్ని మరువగలదు. ఒక్కసారి పూర్తిగా మానితే ఇక మళ్ళీ జీవితంలో వాటిని ఎవరికొరకు త్రాగకండి. అసలు కాఫీ, టీలు ఎవరికి వారు త్రాగేదానికంటే నలుగురి గురించి త్రాగడమే ఎక్కువగా ఉంటుంది. ఎవరికోసమో మన జీవితాన్ని పణంగా పెట్టవద్దు. కాఫీ, టీల బదులుగా పాలుకూడా వద్దు. పాలుత్రాగే వయస్సు దాటిపోయింది. కాబట్టి ఆ టైములో పుల్లటి పండ్ల రసంలో తేనె నిమ్మరసం నీళ్ళో, చెరుకురసమో, కొబ్బరి నీళ్ళో మొ॥గు వాటిని మంచి అలవాట్లుగా మార్చుకుంటే జీవితం మంచిగా ఉంటుంది. మనం మంచిగా అవ్వడానికి ప్రయత్నిద్దాం.