Avoid cold drinks
శీతల పానీయాలు కూల్ డ్రింక్స్ మానండి
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! !!!!!
మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చిన వెంటనే వారికి మంచినీరు ఇచ్చి స్వాగతం పలికే సాంప్రదాయం మనది. లేదా మజ్జిగ ఇచ్చి దాహం చల్లబరిచే సంస్కృతి మనది. ఏమీ చదువుకోని మన పెద్దలు ఎంతో మంచి అలవాట్లను మనకు నేర్పారు. మనం ఈ రోజు అన్నీ బాగా చదువుకుని ఏమి నేర్పుతున్నాము, ఏమి చేస్తున్నామంటే ఇంటి కొచ్చిన అతిధులకు, మన పిల్లలకు కూల్డ్రింక్సు పేరు చెప్పుకుని ఒక చల్లటి విషపదార్థాన్ని అందిస్తున్నాము. ఆ కూల్డ్రింక్ సీసాలను పెద్ద మొత్తంలో, పెద్ద సైజు సీసాలతో తెచ్చుకుని ఇంట్లో ఫ్రిజ్లో నిల్వయుంచి అటువచ్చి ఇటువచ్చి వాటిని ఆనందంగా త్రాగుచున్నాము. ఏదన్నా ఒకటి డబ్బు పెట్టి కొని తిన్నామన్నా, త్రాగామన్నా దాని ద్వారా మనకు రుచితో, ఆనందంతో పాటు కొద్దిగా ఆరోగ్యము లభిస్తే ఫరవాలేదనుకోవచ్చు. కూల్ డ్రింక్స్ను మనం త్రాగడం ద్వారా మనకు రుచితో పాటు ఆనందంతో పాటు మనకేమి వస్తుందో ఆలోచిద్దాము. ఒక పదార్థంలో ఆమ్ల గుణం ఉన్నదా? క్షారగుణం ఉన్నదా? ఏది ఎంత ఉంది అని తెలుసుకోవడానికి PH (పిహెచ్) మీటరు సహకరిస్తుంది. PH అనేది 7 కంటే ఎక్కువగా ఉంటే క్షారగుణమని, 7 కంటే తక్కువ ఉంటే ఆమ్ల గుణమని (యాసిడ్) తెలుస్తుంది. ఏ పదార్థంలోనన్నా ఆ PH మీటరును ముంచితే ఆ పదార్థము ఏ స్థితిలో ఉన్నది. అందులో నుండి వచ్చే అంకెను బట్టి తెలిసిపోతుంది. కూల్డ్రింక్ను గ్లాసులో పోసి ఆ మీటరు ముంచితే వాటి బండారము బయటపడుతుంది. ఇప్పుడు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న 10 రకాల కూల్డ్రింక్సును పరీక్షిస్తే వాటి PH అనేది 1.1 నుండి 20 మధ్యలోనే అన్నింటికి ఉంటున్నది. తియ్యగా ఉండే వాటిలో, పుల్లపుల్లగా ఉండే వాటిలో కూడా అంత యాసిడ్ ఉన్నట్లుగా తెలుస్తున్నది.మనం లెట్రిన్స్న శుభ్రం చేసుకునే యాసిడ్ సీసాలను చూసి ఉంటారు. ఆ యాసిడ్ యొక్క PH చూస్తే 1.5 నుండి 2.0 మధ్యలో ఉంటుంది. అంటే ఆ యాసిడ్ అంత ఘాటుగా ఉంటుంది. కాబట్టే ఎండిపోయిన మలంపై పోస్తే శుభ్రంగా తినేస్తుంది. మనం త్రాగే కూల్డ్రింక్ సీసాలు కూడా లెట్రిన్ క్లీన్ చేసే యాసిడ్తో సమానంగా ఆమ్ల గుణాన్ని కలిగి ఉన్నాయి. నేను చెప్పినది తప్పు అయితే మీరు ఈసారి లెట్రిన్ బాగా మరకలు పడి ఎండిపోయినప్పుడు దానిపై యాసిడ్ పొయ్యకుండా కూల్డ్రింక్ పోసి 5 ని॥లు ఆగి శుభ్రం చేయండి. చక్కగా యాసిడ్ లాగా పనిచేసి ఆ ప్లేట్ను శుభ్రం చేసేస్తుంది. టాయ్లెట్ క్లీనర్స్తో సమానమైన కూల్డ్రింక్స్ను మనం త్రా యాసిడ్ అనేవి కలుపుతారు. ఇన్నిరకాల యాసిడ్లు కలిస్తేగానీ మనకు మజా రావడం లేదు. అందుచేతే కూల్డ్రింక్ త్రాగినపుడు గొంతులో, కడుపులో మంట, త్రేన్పులు, కపాలంలో, తలనరాలలో, విపరీతమైన బాధ, అసిడిటి మొ||నవి వస్తుంటాయి. నాకొక చిన్నప్పటి విషయము గుర్తుకు వస్తున్నది. నేను పుట్టాక మొత్తం మీద 20 కూల్డ్రింక్లు త్రాగి ఉంటాను. ఒకసారి ఎక్కడో పెళ్ళిలో ఫ్రీగా వచ్చింది కదా అని థమ్స్ అప్ త్రాగడానికి ప్రయత్నించాను. అది పొంగి నురుగు నురుగ్గా రావడం చూస్తే నాకు భయం వేసింది. కాసేపటికి త్రాగాను. ఒక గుక్క మింగే సరికే గొంతులో మంట పుట్టినట్లుగా అయ్యి, బీరులాంటిదేమన్నా కలుపుతారా ఏమిటి, ఇంత ఘాటుగా
అనుకుని త్రాగలేక వదిలేసాను. అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అలా మండడానికి కొంత కారణం ఏమిటో, ఆ పవరు ఏమిటో తెలుస్తున్నది. ఇంకొక రహస్యం మీకు తెలుసా! మనం చనిపోయిన తరువాత దహన సంస్కారం చేస్తే శవం పూర్తిగా కాలిపోతుంది, ఎముకలు పూర్తిగా కాలిపోతాయి. కానీ నోటిలోని పళ్ళు మాత్రం కాలిపోవు. శవాన్ని కాల్చడానికి బదులుగా భూమిలో పాతిపెడితే శరీరము మొత్తం మట్టిలో కలిసిపోతుంది. 20 తరువాత • మట్టి భాగాన్ని త్రవ్వి తీస్తే పళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంటాయి. అంత గట్టిగా మన పళ్ళు తయారుచెయ్యబడ్డాయి. ఏ పళ్ళనైతే అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్ళనైతే మట్టి తనలో కరిగించుకోలేకపోయిందో, అవే పళ్ళను 20 రోజులపాటు ఏదైనా ఒక కూల్డ్రింక్లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్ళు నల్లగా మారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక నల్లని రంగు కూల్ డ్రింకులో ఒక పన్నును వేసి 8వ రోజు చూసే సరికి ఆ పన్ను పూర్తిగా కరిగిపోయి, మాయమైనది. ఇది నేను స్వయముగా పరిశీలించిన విషయము. మనం పుట్టిన దగ్గర్నుండీ చనిపోయే లోపులో సుమారు 50 టన్నుల ఆహారాన్నయినా ఈ పళ్ళతో నములుతాము. అన్ని టన్నుల ఆహారాన్ని నమిలినా అరగని పళ్ళు మాత్రం ఒక కూల్డ్రింక్ నెల తిరగకుండా కరిగించేస్తున్నదంటే అవి త్రాగే డ్రింకులా లేక విషపదార్థాలా? విషపదార్థాలే. కాకపోతే ఎక్కువగా నీటి శాతం ఉండబట్టి మెల్లగా చంపే విషంలా పని చేస్తాయి. అలాంటి గట్టి పళ్ళనే నాశనం చేసే డ్రింక్స్కి మన లోపలి ప్రేగులు, నరాలు, కణాలు ఒక లెక్కా ఏమిటి? ఈ భూమిపై నివసించే ప్రతిప్రాణితో పాటు మనము కూడా ప్రాణవాయువును (ఆక్సిజన్) లోపలకు పీల్చుకుని, కార్బన్-డై-ఆక్సైడ్ను విడిచిపెడుతూ ఉంటాము. ఈ కార్బన్-డై-ఆక్సైడ్ అనే విషవాయువును
కూల్ డ్రింక్స్ ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచడం కొరకు అన్ని కూల్ డ్రింకుల్లోకలుపుతారు. అందుచేతనే, మనం ఏ రకమైన కూల్డ్రింక్ త్రాగినా, త్రాగిన వెంటనే నోటిలో నుండీ, ముక్కులో నుండీ ఆ చెడ్డవాయువు బయటకు వస్తుంది. ఒక కాలేజీలో ఇద్దరు కుర్రవాళ్ళు పోటీ పెట్టుకుని ఒకరు 8 మరొకరు 9 కూల్డ్రింక్స్్ను అతి కష్టంగా త్రాగారు. డాక్టరు వచ్చే లోపే ఇద్దరూ చనిపోయారు. శవపరీక్షలో చూస్తే, వారిద్దరి శరీరములో కార్బన్ డైఆక్సైడ్ అనే విషవాయువు ఎక్కువై పోయి మరణించారనే తెలిసింది. ఈ విషయము ముంబాయిలో జరిగినది. ఆ డ్రింక్స్లో కలిపే విషవాయువు ఎంత హానికరమో అర్ధమైనదా? కొన్ని రకాల కూల్డ్రింక్స్లోలో కాఫీ నుండి తీసే మందు కెఫిన్ అనే రసాయనిక పదార్థాన్ని మన భారతదేశంలో అమ్మే వాటిలో బాగా ఎక్కువగా కలుపుతున్నారు. ఈ కెఫిన్ మందువల్ల చిరాకు, నిద్రపట్టక పోవడం తలనొప్పిలాంటివి వస్తాయి. అన్నిరకాల కూల్డ్రింక్స్ ఇంకా ఏమేమి కలుపుతారని రసాయనిక పరీక్షలు. చేయగా తెలిసిన సత్యాలేమిటంటే, విషపూరిత రసాయనాలు అయిన ఆక్సనిక్, కాడ్మియం, జింక్, సోడియం, గ్లూటమేట్, పొటాషియం సార్బేట్, మిథాయిల్ బెంజీన్, బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్ మొ||నవి కలుపుతున్నట్లు వెల్లడైంది. ఇన్ని విషాలు కలిసినవి కాబట్టే 6 సం||లలోపు పిల్లలు త్రాగరాదని హెచ్చరిక సీసాలపై వ్రాసి ఉంటుంది. మనదేశంలో వ్రాయడం లేదు. కూల్డ్రింక్స్ అధికంగా పంచదార కలుపుతారు కాబట్టి పళ్ళు, ప్రేగులు దెబ్బతింటాయి. ఆ డ్రింక్స్ శరీరానికి పనికి వచ్చే ఒక్క లాభమూ లేదు. డబ్బు పెట్టి విషాన్ని కొనుక్కున్నట్లుగా ఉంది. మీ పిల్లలకు మీ చేతులతో కొనిపెట్టినా, మీరు డబ్బు ఇచ్చి ప్రోత్సహించినా, మీ చేతులతో వారి ఆరోగ్యాన్ని పాడుచేసినట్లే. కాfబట్టి ఇలాంటి చెడు అలవాట్లను మానిపించి పిల్లలకు ప్రతిరోజూ పండ్లను, పండ్ల
రసాలను ఎక్కువగా అందించే ఏర్పాటు చేయండి. చుట్టం వస్తే కూల్డ్రింక్ ఇచ్చి డబ్బులు వేస్టు చేయవద్దు. అతిధి దేవోభవ అన్నారు. దేవతాస్వరూపులైన అతిధులకు మంచినీరు ఇవ్వండి. ఆరోగ్యాన్నిస్తుంది. మన సమాజంలో ఇలాంటి చెడ్డ అలవాట్లను పూర్తిగా అరికట్టాలంటే ముందు మన ఇంటిలో అరికట్టాలి. కాబట్టి ప్రతి కుటుంబంలో ఏ ఒక్కరూ మీకై ఇలాంటి తప్పును చేసి ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి. మీరు సంపాదించుకున్న డబ్బు మిమ్మల్ని నాశనం చేయకూడదు. కాబట్టి ఆ డబ్బుతో పండ్లు కొని, పళ్ళరసాలు పిల్లలకు అలవాటు చేస్తే ఎంతో ఇష్టంగా త్రాగుతారు. ఆరోగ్యాన్ని నింపుకుంటారు