-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

రూరల్ డెవలప్మెంట్లో పీజీ డిప్లొమాలు | nirdpr

 



రూరల్ డెవలప్మెంట్లో పీజీ డిప్లొమాలు

 హైదరాబాద్, రాజేంద్రనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీ రాజ్(ఎన్ఐఆర్డీ పీఆర్)- పీజీ డిప్లొమా ప్రోగ్రామ్లలో ప్రవేశా నికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ (పీజీడీఆర్ డీఎం), పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ రూరల్ మేనేజ్ మెంట్(పీజీడీఎంఆర్ఎం)

ప్రోగ్రామ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన మేనేజ్మెంట్ విధానాలు బోధిస్తారు.

ఈ ప్రోగ్రామ్లకు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది.

పీజీడీఆర్ డీఎం: ఇది ఏడాది వ్యవధి గల ఫుల్ టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు, ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసిన వారు కూడా అప్లయ్ చేసుకో వచ్చు. అకడమిక్ ప్రతిభ ఆధా రంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్ ఇస్తారు. 

పీజీడీఎం ఆర్ఎం: ఇది రెండేళ్ల వ్యవధి గల ఫుల్ టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ద్వితీయ శ్రేణి మార్కు లతో డిగ్రీ ఉత్తీర్ణులైనవారు/ ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్/ / మ్యాట్/ సీమ్యాట్/ ఏటీఎంఏ/ జీమ్యాట్ వ్యాలిడ్ స్కోర్ తప్పని సరి. ఈ స్కోర్ ఆధారంగా షార్టిస్ట్ చేసిన అభ్యర్థులకు గ్రూప్ డిస్క షన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు ప్రవేశాలు కల్పిస్తారు.

ముఖ్య సమాచారం

ప్రోగ్రామ్ ఫీజు: ఏడాదికి రూ.1,80,000

స్కాలర్షిప్: మొదటి ట్రైమెస్టర్లో సాధించిన మెరిట్ ఆధారంగా సంస్థ దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్., ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200 నిబంధనల ప్రకారం స్కాలర్షిప్ చెల్లిస్తారు.

 దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.400;

* ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 15 

వెబ్సైట్: www.nirdpr.org.in