నార్త్ ఈస్టర్న్ రైల్వేలో గ్రూప్ సీ స్పోర్ట్స్ కోటా పోస్టులు
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ గోరఖ్ పూర్కి చెందిన నార్త్ ఈస్టర్న్ రైల్వేలో గ్రూప్ సీ స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: క్రికెట్, బాస్కెట్బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, రెజ్లింగ్ తదితరాలు.
అర్హత: 10+2/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18-25 ఏళ్లు వయసు ఉండాలి.
జీతం: నెలకు రూ.20,200 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్పోర్ట్స్, అకడమిక్ మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» వెబ్సైట్: www.ner.indianrailways.gov.in