ఐఐఐటీడీఎంలో మాస్టర్ ఆఫ్ డిజైన్
జబల్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ( ఐఐఐటీడీఎం) - మాస్టర్ ఆఫ్ డిజైన్(ఎం డిజైన్) ప్రోగ్రామ్లో ప్రవేశా నికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్, పార్ట్ టైం విధానాల్లో ప్రోగ్రామ్ అందుబా టులో ఉంది. రెగ్యులర్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి గేట్/ సీడ్ వ్యాలిడ్ స్కోర్ తప్పనిసరి. పార్ట్ టైం ప్రోగ్రామ్ను వర్కింగ్ ప్రొఫెషనల్స్క ప్రత్యేకిం చారు. వీరికి గేట్/ సీడ్ వ్యాలిడ్ స్కోర్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ/ ప్రైవేట్ సంస్థల్లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో కనీసం అయిదేళ్ల అను భవం ఉంటే చాలు. డిఫెన్స్ విభాగాల్లో పనిచేసేవారికి ఈ నిబంధన వర్తించదు. వీరి దరఖాస్తులను సంస్థ నేరుగా పరిగణనలోకి తీసుకుంటుంది.
సీట్లు: రెగ్యులర్ ప్రోగ్రామ్లో 30 సీట్లు ఉన్నాయి. వీటిలో 10 సీట్లను గేట్, 20 సీట్లను సీడ్ అభ్యర్థు లకు కేటాయించారు. గేట్ కేటగిరీలో సీట్లు మిగిలిన పక్షంలో సీడ్ అభ్యర్థులతో, సీడ్ కేటగిరీలో సీట్లు మిగిలితే గేట్ అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో బీటెక్/ బీ డిజైన్/ బీ ఆర్క్/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: రెగ్యులర్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి అభ్యర్థు లను గేట్/ సీడ్ వ్యాలిడ్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పార్ట్ టైం ప్రోగ్రామ్లో చేరాలనుకొనేవారికి
ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అవ కాశం కల్పిస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 6
పార్ట్ టైం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు: మే 18న
రెగ్యులర్, పార్ట్ టైం ప్రోగ్రామ్లలో ప్రవేశం పొందిన అభ్యర్థుల జాబితా విడుదల: మే 27న
ప్రోగ్రామ్ ఫీజు చెల్లిం చేందుకు చివరి తేదీ:
జూన్ 3
వెబ్సైట్: www.iiitdmj.ac.in