ఇండియన్ నేవీ 2500 సెయిలర్
• పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2022 ఆగస్టు బ్యాచ్ ద్వారా ఆర్టిఫిషర్
అప్రెంటీస్ (ఏఏ), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) పోస్టులను భర్తీ చేయనుంది. నేవీలో ప్రధానంగా ఆఫీసర్స్, సెయిలర్స్, సివి లియన్స్ మూడు రకాల పోస్టులు ఉంటాయి. సెయిలర్స్, సివిలియన్స్ పోస్టులకు ఇండియన్ నేవీ విడిగా నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తుంది. ఆర్టిఫిషర్ అప్రెంటిస్ (ఏఏ)- 500
అర్హత:
ఇంటర్మీడియెట్/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్చదివి ఉండాలి.
వయసు:
2002 ఆగస్టు 1 నుంచి 2005 జులై 31 మధ్య జన్మించి ఉండాలి. సీనియర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్ఎస్ఆర్): 2000
అర్హత:
ఇంటర్మీడియెట్/10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి.
దరఖాస్తులు:
ఏప్రిల్ 5 వరకు ఆన్లైస్లో అప్లైచేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు:
రూ.215. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
వెబ్సైట్:
సెలెక్షన్ ప్రాసెస్:
ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ మూడు దశల్లో ఎంపిక జరుగుతుంది. ఆర్టిఫిషర్ అప్రెంటీస్ కు దేశవ్యాప్తంగా నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్టులో మెరిట్, సీనియర్ సెకండరీ రిక్రూట్స్ కు స్టేట్‌వైజ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్టులో అర్హత సాధించిన కనీసం 10 వేల మందిని ఫిజికల్ టెస్టులకు ఎంపిక చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి మెడికల్ టెస్ట్‌ని ర్వహిస్తారు.