-->

నిఘా పెడుతున్నారా? | Surveillance?


నిఘా పెడుతున్నారా?

కొందరు అమ్మానాన్నలు పిల్లలు ప్రతి అడుగుపైనా ఆంక్షలు పెడుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదంటు న్నారు మానసిక నిపుణులు. తాజాగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక సేవకురాలు సుధా మూర్తి కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పిల్లల పెంపకంపై సూచనలు, సలహాలు చెప్పుకొచ్చారిలా..

స్నేహం.. 



తల్లిదండ్రులు, పిల్లల మధ్య స్నేహం, పరస్పర గౌరవం ఉండాలి. అంతేకానీ నిఘా వేసినట్లుగా ఉంటే.. వారికి ఊపిరి ఆడదు. ఒత్తిడిగానూ భావించొచ్చు. మీ అభిప్రాయాల్ని చిన్నారులపై రుద్ద డానికి ప్రయత్నించకూడదు. మారుతున్న జీవనశైలికి తగినట్లుగా అభి ప్రాయ స్వేచ్ఛ ఇవ్వాలి. వారి ఇష్టాయిష్టాలకూ విలువనివ్వాలి. లేదంటే వారి ఆలోచనా సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి సొంతంగా నిర్ణ యాలు తీసుకునేలా, ఆలోచనలు పంచుకునేలా చూడండి. అప్పుడే వచ్చిన రంగంలో ఉన్నతస్థాయికి చేరుకోగలుగుతారు.

ఉదాహరణగా...



 నియమాలను పెట్టి పాటించమనొద్దు. మీ అలవా ట్లనూ వారిపై రుబొద్దు. పుస్తకపఠనం, తోటపని, వ్యాయామం వంటి అభి రుచులను పరిచయం చేయాలనిపిస్తే. ముందు మీరు ఆచరించాలి. అప్పుడు వాళ్లూ మిమ్మల్ని ఉదాహరణగా తీసు కొని ఆసక్తి కలిగినవి ప్రయత్నిస్తారు. మీరే వారికి హీరోలు. మీ నుంచే వారు స్ఫూర్తి పొందుతారు. పిల్లలు ఎలా ఉండాలని మీరు కోరుకుంటు న్నారో.. అలాగే మీరూ వారెదుట ఉండటానికి ప్రయత్నించండి. అప్పుడు పిల్లలూ మిమ్మల్ని అనుకరిస్తారు, అను సరిస్తారు. అలాకాకుండా బలవంతంగా నేర్పాలనుకుంటే ఒత్తిడి పెంచినవారు అవుతారు.

సాధారణ జీవితం...



 స్థాయిని దాటి దేన్నీ అందించొద్దు. సాధారణ జీవితాన్ని మీరనుభవిస్తూ వాళ్లకీ అందించండి. అలాకాకుండా ఉన్న దానికన్నా ఎక్కువగా జీవించడానికి ప్రయత్నిస్తే వాళ్లూ అలాగే ఆశిస్తారు. భవిష్య క్లో ఇది వాళ్లకి ముప్పు కలిగించొచ్చు. అందరితో కలిసి జీవించడం, ఉన్నదాన్ని నలుగురితో పంచుకోవడాన్ని నేర్పండి. ఆడంబరంగా వేడుకలు నిర్వహించడం కంటే.. దానిలో కొంత మొత్తాన్ని పేదలకు పంచేలా చూడండి. సహాయ గుణంతోపాటు దయ, ప్రేమ వంటివి నేర్పిన వారు అవుతారు.

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT