ఇంజినీరింగ్ పోస్టులకు ఒకే పరీక్ష!
TS: రాష్ట్రంలోని అన్ని సివిల్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి ఒకే పరీక్ష నిర్వహించాలని సర్కార్ యోచిస్తోంది.
నీటిపారుదల, రహదారులు-భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, ప్రజారోగ్య శాఖల్లో పోస్టుల భర్తీకి వేర్వేరుగా పరీక్షల నిర్వహణ వల్ల సమయం వృథాతోపాటు కొన్ని శాఖల్లో పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
దీంతో ఈ 5శాఖలకూ ఒకే పరీక్ష నిర్వహించాలన్న అంశంపై మేధోమథనం చేస్తున్నారు.