EAPCET పరీక్షల షెడ్యూల్ విడుదల
AP: ఏప్రిల్ 11న EAPCET నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
ఇవాళ షెడ్యూల్ విడుదల చేసిన ఆయన..
జూలై 4 నుంచి 8 వరకు ఇంజినీరింగ్, జూలై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
నోటిఫికేషన్ విడుదల సమయంలో దరఖాస్తు తేదీలు, ఫీజు వంటి వివరాలు ఉంటాయన్నారు.
ఆగస్టులో ఫలితాలు విడుదల చేసి.. సెప్టెంబర్లో కౌన్సెలింగ్ నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు.