నిమ్మకాయను ముఖంపై అద్దుతున్నారా?
నిమ్మకాయ రసంతో ముఖాన్ని కాంతివంతం చేసుకోవచ్చు.
ఇందుకోసం బాగా మగ్గిన నిమ్మకాయ ముక్క తీసుకొని ముఖంపై గుండ్రంగా రుద్దుకోవాలి. నలుపు చారలు ఉన్న చోట ఎక్కువ సమయం రుద్దాలి.
ఆ తర్వాత 5ని.లు అలానే ఉండండి.
ఇప్పుడు ముఖంపై ఆయిల్తో 2 నిమిషాలు మర్దన చేసుకోవాలి.
ఇలా చేస్తే మురికి, మృత కణాలు వదిలిపోతాయి.
మర్దన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడుక్కుంటే అందంగా మెరిసిపోతుంది.