30,453 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
TS: రాష్ట్రంలో 30,453 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో నియామక సంస్థలు ఉద్యోగాల భర్తీపై సంబంధిత శాఖలను సంప్రదించనున్నాయి. శాఖల వారీగా ఆర్థిక శాఖ జీవోలు విడుదల చేసింది.
గ్రూప్-1, హోంశాఖ, వైద్య, ఆరోగ్య, జైళ్లు, రవాణాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి, అలాగే టెట్ నిర్వహణకు అనుమతి ఇచ్చింది.