ముఖంపై నల్ల, తెల్ల మంగు మచ్చలు పోవాలంటే?
పసుపు కొమ్ము, చందనం తీసుకుని బాగా నూరి, గేదె పాలతో కలిపి మచ్చలున్న చోట రాసుకుంటే ఫలితం ఉంటుంది.
పావు టీ స్పూన్ నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే మచ్చలు తొలిగిపోతాయి.
కలబంద గుజ్జును తీసి మచ్చలపై పూసి, ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. కొన్ని రోజులకు ముఖం కాంతి వంతమవుతుంది.