-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

ఈ అయిద ప్రేమభాషలే | These are the five love languages



 ఈ అయిద ప్రేమభాషలే...

ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ భాష ఇతరులకు అర్థంకాదు. అలాగే దంపతుల నడుమ | అనుబంధం అందరికీ తెలీదు. అదొక ప్రత్యేకమైన భాష ఇరువురి మధ్య బంధాన్ని పెనవేసుకునేలా చేసే ఈ భాషకు అక్షరాలుండవు. మనసులను అర్థం చేసుకుంటూ అడుగువేయడమే ముఖ్యం. మరి వీటి గురించి తెలుసుకుందామా.

అర్ధం చేసుకోవాలి... 

ఎదుటివారిని అర్ధం చేసుకోవడం నేర్చుకుంటే చాలు. బంధాల మధ్య సమస్యలు చోటు చేసుకోవు. అవతలివ్యక్తి చెప్పేది పూర్తిగా వినాలి. వారి అభిప్రాయానికి విలువనివ్వాలి. ఒక్కొక్కరి ఆలోచనధోరణి. ఒక్కో రకంగా ఉంటుంది. అలానే భాగస్వామి మనలాగే ఆలోచించాలనే నియమం లేదు. అలా అనుకుంటే చాలు, వారి కోణం నుంచి ఆలోచించడం మొదలు పెడతాం. అప్పుడు మీ ఆలోచన.. విధానం మారిపోతుంది. ఏదైనా సందర్భంలో కోపం వచ్చినప్పుడు పది నిమిషాలు మెదలకుండా ఉండి, ఆ తర్వాత ఆలోచిస్తే కోపం మటుమాయం. అవుతుంది. లేదంటే ఇరువురి మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉంది.

పంచుకోవాలి...

కలిసి జీవించడమే కాదు, సంతోషాన్ని కూడా బరువురూ పంచుకోవాలి. నవ్వుతూ ఉండటంలో దొరికే శారీరక మానసిక ఆరోగ్యంపై ఇరువురూ అవగాహనతో ఉంటే చాలు. సమస్యనూ నవ్వుతూ పరిష్కరించుకునే శక్తి దానంతటదే వస్తుంది. అలా జీవితంలో ప్రతి నిమిషం ఆనందదాయకంగా మారుతుంది.

అలాగే అవసరమైనప్పుడు తోడుగా ఉన్న భావన ఎదుటి వారిలో కలిగించాలి. వారేం చెబుతున్నారో శ్రద్ధగా విని, ఆ బాధను పంచుకోవడంలో స్నేహితులుగా మెలిగితే అది మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది.

సారీ చెప్పాలి.. 

భాగస్వామి చేతిలో చేయి చేసి నేనున్నాననే భరోసా కల్పించాలి. అది వారిని మీకు మరింత దగ్గర చేస్తుంది. రోజూ ఉదయం నవ్వుతూ పలకరింపు, దగ్గరకు తీసుకోవడం వంటివి వాతావరణాన్నిఆహ్లాదకరంగా మారుస్తాయి. అప్పుడప్పుడూ వారెదురుచూడని విధంగా ఆశ్చర్యం కలిగించే చిన్న చిన్న కానుకలివ్వాలి. మీ ప్రవర్తనలో తప్పు అనిపిస్తే ఆలస్యం చేయకుండా క్షమాపణ. కోరితే సమస్య అక్కడితో ముగిసి పోతుంది. ఆలస్యం చేస్తే అపాఠాలకు తావిచ్చినట్లు అవుతుంది. పాండే ప్రతి సాయానికి కృతజ్ఞతలు చెప్పడమూ. అలవరుచుకోవాలి..


ప్రశంసలు... 

భాగస్వామి ఏదైనా పని విజయవంతంగా పూర్తి చేసినప్పుడు ప్రశంసించాలి. మన మనిషే కదా, పొగడటం ఎందుకులే అనుకోకూడదు. మీరిచ్చే ఆ చిన్న ప్రోత్సాహం, ఆ చిన్న ప్రశంస వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. చిన్నదైనా పెద్దదైనా పనిని పంచుకోవడంలో బరువురికి ద సంతోషం ప్రత్యేకమవుతుంది


గతంలోకి... 

అప్పుడప్పుడు గతంలోకి తొంగి చూడాలి. అప్పటి మధుర జ్ఞాపకాలను ఇరువురూ నెమరు వేసుకోవడంలో మనసులు ఆనందంతో నిండుతాయి. పరిచయమైన కొత్తలో తీయించుకున్న ఫొటోలు, రాసుకున్న ప్రేమలేఖలను ఓసారి ఇద్దరూ తిరగేస్తే. లు వీలైతే ఇద్దరూ కలిసి తిరిగిన ప్రదేశాలకు మరో సారి వెళ్లిరండి. వీటన్నింటితో మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. భవిష్యత్తులోనూ ఆ ప్రేమ బంధం నిలుస్తుంది..