-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

కరోనా తర్వాత కీళ్ల నొప్పులా? | Joint pain after corona?


కరోనా తర్వాత కీళ్ల నొప్పులా?

కోవిడ్ సోకిన చాలా మందిలో దీర్ఘకాలిక సమస్యలు. వస్తున్నాయి. వాటిలో ఒళ్లు నొప్పులు, కీళ్లనొప్పులు, కీళ్ల వాపులు కనిపిస్తున్నాయి. కొంత మంది బాధితులకు బాగా అలసట కనిపిస్తోంది. ఈ లక్షణాలన్నీ కొద్ది రోజులు లేదా కొన్ని వారాల వరకూ ఉంటాయి. కొందరికీ మూడునెలల తర్వాత ఈ సమస్యలు తగ్గిపోతాయి.

బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు కూడా కొంతమందిలో ఇలా కీళ్ల నొప్పులు, వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నొప్పులు తగ్గిపోవటానికి రెండు, మూడు నెలలు కూడా పట్టవచ్చు. అలసట ఎక్కువగా ఉంటే విశ్రాంతి తీసుకోవాలి. సరైన సమయానికి నిద్రపోవాలి. దీంతో పాటు నొప్పులు బాగా ఉంటే పారాసిటమాల్ లాంటి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే సరిపోతుంది. నీళ్లు బాగా తాగాలి. వ్యాయామం తక్కువ చేయండి. యోగా, ధ్యానం చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది.

తినే ఆహారపదార్థాల్లో విటమిన్-సి, మినరల్స్ ఉండేట్లు చూసుకోవాలి. ప్రొటీన్లు ఉండాలి. సమతులాహారం తీసుకోవాలి. ప్రతిరోజూ నడవడం వల్ల శరీరానికి వ్యాయామం ఫలం దక్కుతుంది. ఆల్కహాల్, స్మోకింగ్ అలవాటుండే వాళ్లు.. వాటి జోలికి పోకుండా ఉంటే మంచిది. అరికాళ్లలో అసజహ లక్షణాలు ఉంటే విటమిన్ బి-12 లోపం ఉన్నట్లుగా భావించాలి. చెక్ చేసుకోండి. దానికి కూడా సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇవన్నీ చేసినా నొప్పులు తగ్గకపోతే.. దగ్గర్లోని డాక్టరు సంప్రదించాలి.