-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

ప్రణాళిక ఉందా? | Have a plan?



 ప్రణాళిక ఉందా?


ఉద్యోగిగా ఉన్నత స్థానానికి ఎదగాలంటే చేసే పనులను వేగంగా, సంపూర్ణంగా చేయడం నేర్చు కోవాలి. అప్పుడే క్రమంగా ఉన్నతస్థాయికి చేరగ లుగుతారు... ముందురోజు రాత్రే మరుసటి రోజుకు కావాల్సిన దుస్తులను సిద్ధం చేసుకోవాలి. అలాగే వంటకు సంబంధించి కూడా. ఉదయం త్వరగా లేవడం అలవాటు చేసుకోండి. కొత్తలో ఇబ్బందిగానే ఉన్నా తర్వాత అలవాటుగా మారు తుంది. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులూ చేయగ లరు. కాబట్టి రోజూ కనీసం ఓ గంట వ్యాయామం, యోగాకి కేటాయించాల్సిందే. ధ్యానం వల్ల మనసు ప్రశాంతంగా మారడమే కాకుండా ఏకాగ్రత పెరుగు తుంది. ఉద్యోగిగా మీకు మరింత సమాచారం. తెలిసి ఉండటం కూడా ముఖ్యమే. కాబట్టి రోజూ ఓ అరగంట వార్తాపత్రికలు తిరగే యడమో, వార్తలు చూడటమో చేయండి.

జాబితా ఉందా...

ఆ రోజు చేయాలనుకునే పనుల జాబితాను మొదటే రాసుకుంటే రోజులో ఏం చేయాలనేదానిపై స్పష్టత ఉంటుంది. ఉద్యోగినులకు ఇది చాలా అవ సరం కూడా. ఆ జాబితా ముఖ్యమైన పనులతో చిన్నగా ఉండేలా చూసుకోవాలి. ఏదైనా తర్వాతే.. ఎన్ని పనులున్నా... కార్యాలయానికి నిర్దేశించిన సమయానికి కల్లా వచ్చేయాలి. ఇది ఉద్యోగిగా పాటించాల్సిన మొదటి విధి. వచ్చాక టీ, కాఫీ లంటూ, సహోద్యోగులతో మాట్లాడుతూ సమయాన్ని వృథా చేయొద్దు. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులున్నా... ఆఫీసుకు వచ్చాక కేవలం పని మీదే దృష్టి సారించాలి. అప్పుడే మీరు బాధ్యత గల ఉద్యోగి అవుతారు. పనుల్లో కూడా ఏ పని అత్యవసరమో తెలు సుకుని ముందుగా దాన్ని పూర్తి చేయాలి.