షాంపూ వాడుతున్నారా
షాంపూతో తలస్నానం చేసేసి, కండిషనర్ పెట్టేస్తే.. హమ్మయ్య.. జుట్టు శుభ్రపడిపోయిందని భావిస్తుంటారు. చాలామంది. కానీ వాటివల్ల ఉపయోగమేమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరెలా? ఏం చేయాలంటారు? అనేగా.. అయితే ఇవిగో మీ కోసమే ఈ చిట్కాలు...
చుండ్రు మాయం..!
గుడ్డులోని పచ్చసొనకు కొద్దిగా కొబ్బరి పాలు, విటమిన్ 'ఇ' నూనెను కలిపి తలంతా పట్టించండి. అలా గంటసేపు ఉంచుకుని, ఆరాక తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం తలలోని చుండ్రును పోగొడుతుంది.
జుట్టు రాలదు!
రెండు పెద్ద చెంచాల సెనగపిండిలో తేనె, తగినంత నీరు కలిపి.. మరీ చిక్కగా లేదా పల్చగా కాకుండా మధ్యస్థంగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూర్తిగా పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులాగా మెరవడమే కాదు.. పెరుగుతుంది.. రాలదు కూడా.
పెరుగుదల మొదలిలా..!
జుట్టు పోషణకు అరటి పండు చక్కటి పరిష్కారం. ఈ పండు గుజ్జుకు కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించాలి. దీన్ని 45 నిమిషాల వరకు ఉంచి, తలస్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే చిట్లిన వెంట్రుకలు తిరిగి మామూలు స్థితిలోకి వస్తాయి. జుట్టు కూడా పెరుగుతుంది.