-->

అతి అత్యంత ప్రమాదం | health


అతి అత్యంత ప్రమాదం

పక్కన పై ఎక్కువ సేపు ఫోన్ చూస్తున్నారా...? ఫోన్ లేకపోయినా.. రింగ్ అవ్వకపోయినా.. మెసేజ్ రాకపోయినా కలవరపడుతున్నారా? ఫేస్ బుక్ చూడకపోతే నిద్రరావడం లేదా..? ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే ఇది సాధారణం కాదట. సెల్ ఫోన్ అతి వినియోగం అత్యంత ప్రమాదమని అంటున్నాయి సర్వేలు. నూటికి తొంభై శాతం మంది ఇదే లక్షణాలతో ఉన్నారట. ఇది వారికి తెలియకుండా జరుగుతున్న ఇబ్బందికర పరిస్థితేనంటున్నారు. మానసిక నిపుణులు. సెల్‌ఫోన్ అతి వినియోగం సరికొత్త సమస్యలకు కారణమవుతోంది. గంటల తరబడి ఫోన్ వినియోగించే వారిలో కంటి సంబంధిత సమస్యలు కనిపిస్తున్నట్లు ఇప్పటివరకూ వైద్యులు చెబుతూ వచ్చారు. తాజాగా మరో సమస్య ఈ జాబితాలో చేరినట్టు మానసిక  వైద్యులు పేర్కొంటున్నారు. అదే రింగైటీ.

  •   యాంగ్జయిటీ గురించి విని ఉంటాం. కానీ అతికొద్దిమందికి మాత్రమే ఈ రింగైటీ అనే సమస్య గురించి తెలుసు. ఎందుకుంటే రింగైటీతో  బాధపడుతున్న వాళ్లు మనలో చాలామంది ఉంటారు. కానీ అది సమస్యగా ఎవరూ భావించారు. సెల్‌ఫోన్ వినియోగం ఒక పరిధి దాటిపోయిన వారిలో ఈ సమస్య కనిపిస్తున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు.
  •    రింగైటీ సమస్యతో బాధపడేవాళ్లు... ఫోన్ వినియోగిస్తున్నప్పుడే కాదు, పెట్టినప్పుడు కూడా దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఫోన్ రింగ్ అవుతుందేమోనని పదేపదే చూడడం, చిన్నపాటి శబ్దం వచ్చినా  వాట్సాప్ మెసేజ్ వచ్చిందేమోనని చూడడం, మొబైల్ కు అప్డేట్స్వస్తున్నాయేమోనని ఆలోచన చేయడం వంటివన్నీ ఈ సమస్యకు లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.
  •   ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా ఫోన్ అప్ డేట్స్ చూసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడం, పక్కన ఎవరి ఫోన్ మోగినా తన ఫోన్ మోగుతున్నట్టు చూసుకోవడం వంటివి కూడా దీని లక్షణాలేనంటున్నారు. దీనిని ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అని కూడా పేర్కొంటున్నారు. కాలేజీ విద్యార్థులు, సెల్ ఫోన్ తో గడిపే ఉద్యోగులు, మహిళల్లో ఈ సమస్య ఎక్కువ  వున్నట్టు చెబుతున్నారు.
  •   విద్యార్ధులు తరగతిలో వున్నప్పుడు కూడా ఫోన్ పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఎవరు మెసేజ్ చేశారు. ఏమని చేశారో చూసుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఉద్యోగులు కూడా పనిపై దృష్టి పెట్టకుండా ఫోన్ లో నచ్చిన అంశాలను వెతుక్కునేందుకు, మెసేజ్ లు చూసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
  •   ఈ మధ్యకాలంలో విద్యార్ధులు, కొంతమంది ఉద్యోగులు ఈ తరహా లక్షణాలతో తమ వద్దకు వస్తున్నట్టు మానసిక వైద్యులు చెబుతున్నారు.  అయితే దాన్ని ఒక సమస్యగా గుర్తించకపోవడం వల్ల చాలామంది అలానే ముందుకు సాగుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.
  •   సెల్ ఫోన్ అతి వినియోగం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. రాత్రి పడుకునే ముందు ఫోను చూడడం వల్ల కొందరిలో నిద్రలేమి సమస్య పెరుగుతోంది. ఆన్‌లైన్ గేమ్స్ కు అలవాటు పడినవాళ్లు ప్రయాణంలోను సెల్ఫోనను వదలడం లేదు. దీనివల్ల మెదడు, కండు ఒత్తిడికి గురై అలసటగా కనిపిస్తుంటారని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ తరహా ఇబ్బందుల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు చెబుతున్నారు..

 ━━━━━━━✧❂✧━━━━━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

JOB'S related material what's app group link

link 01:-

https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR

link02:-

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

══════════◄••❀••►══════════

FOR JOB UPDATES JOIN OUR WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/FuvzHLCYxZA4ONWH5p8Bwr

https://chat.whatsapp.com/KeJjnJQVSWO2XzDVqa4xIb

══════════◄••❀••►══════════

FOR JOB UPDATES JOIN OUR FACEBOOK GROUP

https://www.facebook.com/groups/287841976124793

══════════◄••❀••►══════════

SCIENCE WHAT'S APP GROUP

https://chat.whatsapp.com/JJMCmtcgCPt25gGVwF2ya2

══════════◄••❀••►══════════

❤️ Share if you Care ❤️

══════════◄••❀••►══════════

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT