-->

అంగన్ వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంగన్ వాడీ పోస్టుల | Anganwadi


అంగన్ వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంగన్ వాడీ పోస్టుల 

  • 16 ప్రాజెక్టులు... 340 పోస్టులు
  • 16 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • 'పది' పాస్ తప్పనిసరి.. స్థానికులకు ప్రాధాన్యత 
  • ఐసీడీఎస్ పీడీ సుజన

అనంతపురం వైద్యం, డిసెంబరు 6: అంగన్ వాడీ పోస్టుల భర్తీకి ఎట్టకేలకు  యంత్రాంగం శ్రీకారం చుట్టింది. రెండు నెలలుగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నా.. వివిధ ఎన్నికల కోడ్ కారణంగా సాధ్యపడలేదు. ఎట్టకేలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఐసీడీఎస్ పీడీ సుజన నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 17 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 365 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో వివిధ కారణాలతో కదిరి వెస్ట్ ప్రాజెక్టు పరిధిలోని 25 పోస్టులను చూపించలేదు. మిగిలిన 340 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో అంగన్ వాడీ ప్రధాన కార్యకర్త 39, మినీ కార్యకర్త 8, ఆయా పోస్టులు 298 భర్తీ చేస్తున్నారు. ఇందులో అనంతపురం ప్రాజెక్టు పరిధిలో 29, సీకేపల్లి 11, ధర్మవరం 22, గుత్తి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 17, హిందూపురం 42, కణేకల్లు 11, కళ్యాణదుర్గం 20, కంబదూరు 16, కదిరి ఈస్ట్ 16, కూడేరు 17, మడకశిర 40, పెనుకొండ 38, రాయదుర్గం 14, శింగనమల 21, తాడిపత్రి 9, ఉరవకొండ 28 పోస్టులు చొప్పున ఖాళీలు చూపించారు. వీటికి మంగళవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీక రించనున్నట్లు పీడీ తెలిపారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. దరఖాస్తుతోపాటు గెజిటెడ్ అధికారి దృవీకరణతో సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టులో దరఖాస్తు ఇవ్వాలన్నారు. ఆ తర్వాత రషీద్ తప్పనిసరిగా పొందాలని పీడీ కోరారు. 

టెన్ ఉత్తీర్ణత తప్పనిసరి.. 

స్థానికులకే ప్రాధాన్యం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పాసై ఉండాలి. స్థానికంగా నివాసం ఉన్నవారికి ఇందులో ప్రాధాన్యత ఇస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01-07-2021 నాటికి 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ పోస్టులకు ఆయా అభ్యర్థులు మాత్రమే అర్హులు. వితంతువులకు ప్రత్యేక మార్కులు కేటాయిస్తారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు వెబ్ సైట్ తోపాటు సీడీపీఓ కార్యాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించనున్నారు.


              ━━━━━ • ஜ • ❈ • ஜ • ━━━━━

 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా నిరుద్యోగుల కోసమే ఈ అజారుద్దీన్ జీకే గ్రూప్స్. మీకు తెలిసిన నిరుద్యోగులు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికీ నోటిఫికేషన్ లు ఫార్వర్డ్ చేస్తూ ఉండండి. మేము ప్రతి రోజూ గంటల గంటల సమయం కేటాయిస్తున్నది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసమే. మీకు ఉపయోగపడేన ఉపయోగపడక పోయినా మీ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికీ అందేలా షేర్ చేయండి. దానితోపాటు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ మా వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి రోజు మెటీరియల్స్ జాబ్ నోటిఫికేషన్స్ జాబ్ కు సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్ క్విజ్ నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉన్న నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రతి ఒక్కరు ఉచితంగా మా గ్రూపులో జాయిన్ కావచ్చు.

👇👇👇👇👇👇👇👇👇👇👇👇

A.APPSC, GROUP-2, TSPSC, RRB ,BANK, SI, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన 📗📘📚📖మెటీరియల్ కోసం ఈ కింద ఇచ్చిన మా వాట్సాప్ గ్రూపుల లో  ఏదో ఒక వాట్సాప్ గ్రూపు లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/EFmx1p3kmGBKwnCvii9IsR

లింక్:2👇

https://chat.whatsapp.com/Dg2YLBs9Jgk0AmaqKXF2Bm

                   ∴ ════ ∴ ❈ ∴ ════ ∴ 

B. ఉద్యోగాలకు సంబంధించిన 📋🗞️ అప్డేట్ గురించి తెలుసుకోవడానికి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/FuvzHLCYxZA4ONWH5p8Bwr

              ━━━━━━━༺༻━━━━━━━ 

C. దేశంలో విడుదలవుతున్న గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్ గురించి తెలుసుకోవడానికి ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

లింక్:1👇

https://www.facebook.com/groups/287841976124793

                  ⊰᯽⊱┈──╌❊╌──┈⊰᯽⊱ 

D. సైన్సుకు సంబంధించిన మెటీరియల్ గురించి ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

లింక్:1👇

https://chat.whatsapp.com/JJMCmtcgCPt25gGVwF2ya2

         ══════◄••❀••►══════ 

మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉద్యోగాల కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగులకు మా అజారుద్దీన్ జి కే గ్రూప్స్ ఉపయోగపడాలి.

          ══════◄••❀••►══════
PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT