-->

ఒక కోటీశ్వరుడు | story | prudhviinfo



 ఒక కోటీశ్వరుడు చలికాలంలో ఒక రోజు రాత్రి తన ఇంటికి ఎదురుగా కూర్చొనివున్న ఒక వృద్ధుడిని చూసాడు. 

         అతని వద్దకు వెళ్లి చలికోటు లేకుండా చలిలో ఉన్న ఆ పేద వృధ్దిడితో..... "మీకు చలిగా లేదా? 

కోటు ధరించలేదేమిటి? "అని అడిగాడు. 

         అప్పుడు ఆ వృద్దుడు బాధతత్వ స్వరంతో నాకు చలికోటు ధరించే స్థోమత లేదు. కనుక ఈ చలికి అలవాటు పడిపోయా...."చలి కోటు ధరించాల్సినంత అవసరం లేకుండా పోయింది" అన్నాడు.      

        అప్పుడు ఆ కోటీశ్వరుడు అతని పరిస్థితి చూసి జాలిపడి "నా కోసం ఎదురు చూస్తూ ఉండు.ఇప్పుడే నీ కోసం నేను నా ఇంటికి వెళ్ళి ఒక చలికోటు వెంటనే తీసుకొస్తాను". అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. అక్కడ తను ఏదో పనిలోపడి బిజీగా ఉండటం వలన ఆ వృద్ధుడికి చలికోటు ఇచ్చే విషయం మరచిపోవడం జరిగింది.                 

              ఆ షావుకారుకు ఉదయాన్నే ఆ వృద్దుడికి కోటు ఇస్తాన్నన విషయం గుర్తుకు వచ్చి, వెంటనే ఆ వృద్ధుడి వద్దకు చలికోటు పట్టుకొని వెళ్ళాడు. అప్పటికే ఆ వృద్దుడు అక్కడ చావు బ్రతుకుల్లో కొట్టు మిట్టుతుండగా...... ఆ వృద్ధుడు కోటీశ్వరుడు వైపు బాధగా చూస్తూ.........!

        "నాకు వెచ్చని బట్టలు లేవు అయినా నా శరీరం చలితో పోరాడి చలిని భరించే శక్తి ని తయారు చేయగలిగింది. కానీ.....మీరు ఎప్పుడైతే నాకు చలికోటు తెచ్చి ఇస్తానని వాగ్దానం చేసారో...ఆ వాగ్దానాన్ని నమ్మి ఉండటం వలన నా శరీరం చలిని ప్రతిఘటించే శక్తిని కోల్పోయింది. ఇప్పుడు నా చావుని నేనే వెతుకున్నాటైంది". అని చెప్పి కోటీశ్వరుడి చేతుల్లో ఆ వృద్ధుడు కన్ను మూయడం జరిగింది. 😢😢

                          *********************

ఇందులో నీతి ఏంటంటే.......

        " మీరు ఏదైనా వాగ్దానం చేస్తే దానిని మరిచిపోకుండా సరియైన సమయానికి నెరవేర్చాలి. అలా అయితేనే వాగ్దానం చేయాలి. లేని పక్షంలో వాళ్ళకు ఎంతో నష్టం చేసిన వాళ్ళు కాగలరు జాగ్రత్త"....!. 🙏🏻🙏🏻

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT