చిన్ని కోపాలకు పరిష్కారమిదీ!
చిన్న చిన్న వాటికే అలకలు, ఒక్కోసారి విపరీతమైన కోపం.. కొవిడ్ తర్వాత పిల్లల్లో ఇలాంటి మార్పులెన్నో. వీళ్ల ధోరణి అమ్మానాన్నలనూ కంగారు పెడుతోంది. ఇందుకు ప్రకృతే పరిష్కారమంటున్నారు నిపుణులు. లాడొ లో పెద్దవాళ్లే కాదు.. పిల్లలూ ఎలక్ట్రానిక్ప రికరాలకు అంకితమయ్యారు, బయటికి వెళతారనే భయం, పెరిగిన వీళ్ల గోలని భరించలేకా ఎంతో మంది మొబైళ్ల సాయం తీసుకున్నారు.
తర్వాత ఆన్లైన్ చదువూ వీటికి మరింత దగ్గరయ్యేలా చేసింది. ఫలితమే ఈ మానసిక పరమైన మార్పులని ఓ అధ్యయనం చెబుతోంది. పల్లెలతో పోలిస్తే సిటీ పిల్లల్లో కోపం, విసుగు వగైరా ఎక్కువగా కనిపించాయి. లోతుగా పరిశోధిస్తే.. నగరాల్లో వాళ్లు ఇంటికే పరిమితమైతే వీళ్లు ప్రకృతిలో తిరిగే అవకాశముండటమే కారణమని తేలింది. కాబట్టి.. పిల్లల్ని ఎక్కువగా బయట ఆడుకునేలా చూడమంటున్నారు నిపుణులు. అలా వీలు కాకపోతే వారితో మొక్కల పెంపకం వంటివి చేయించినా మంచి ఫలితం ఉంటుందట.