పొగ మానటానికి సంయుక్త చికిత్స మేలు
పొగతాగే అలవాటు మాన్పించటానికి ఒకట్రెండు చికిత్సలు కలిపి ఇవ్వటం మేలని యూనివర్సిటీ ఆఫ్బ్రి స్టల్ అధ్యయనం సూచిస్తోంది. ముఖ్యంగా వారెనెక్లైన్, నికొటిన్ రిప్లేస్మెంట్ థెరపీ (ఎస్ఆర్ టీ) కలిపి ఇస్తే మంచి ఫలితం కనిపిస్తున్నట్టు తేలింది. పొగ అలవాటు మాన్పించే చికిత్సలో వారెనె క్లైన్, బుప్రోపియాన్, ఎ దీని ప్రధానంగా వాడుతుంటారు.
ఇ-సిగరెట్లు కూడా కొంతవరకు తోడ్పడతాయి. కానీ ప్రస్తుతం వైద్యపరంగా వాడుకోవటానికి వీటికి అనుమతి లేదు. ప్రపంచవ్యాప్తంగా అకాల మరణాలకు, జబ్బులకు పొగ అలవాటు పెద్ద కారణంగా నిలుస్తున్న నేపథ్యంలో తాజా అధ్యయనం నిర్వహించారు.
వారెనెక్లైన్, బుప్రొపియాన్, ఎ టీ, ఇ-సిగరెట్ల లాభనష్టాలను బేరీజు వేశారు. వారెనెక్లైన్, ఎస్ఆర్టీతో కూడిన సంయుక్త చికిత్స బాగా సమర్ధంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. బుప్రొపియాన్కూ డా సమర్ధంగా పనిచేస్తున్నట్టు తేలినప్పటికీ కొన్ని తీవ్ర దుష్ప్రభావాలు పొడసూపుతున్నాయి.
ఇ-సిగరెట్లు కొంతవరకు మేలు చేస్తున్నా ఇవి ఎంతవరకు సురక్షితమనే దాని మీద ఇంకొంత పరిశోధన చేయాల్సి ఉందని పరిశోధకులు భావిస్తున్నారు.