నిద్రకు అలారం!
నిద్ర లేవడానికే కాదు... నిద్ర పోవడానికి కూడా అలారం పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. రోజూ విధిగా ఒక నిర్దిష్ట సమయానికి పడుకొని... లేవడంవల్ల సుఖనిద్రకు ఆస్కారం ఉంటుందంటున్నారు. ఫలితంగా ఎన్నో ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చంటున్నారు. మరి సుఖనిద్ర పట్టాలంటే ఏంచేయాలి? రోజూ రాత్రి ఎన్ని గంటలకు నిద్రపోవాలి. ఉదయం ఎన్ని గంటలకు లేవాలనేది ముందుగా నిర్ణయించుకోండి. ప్రతి రోజూ ఆ సమయాలను క్రమం తప్పకుండా పాటించండి. మీరు నిద్రపోవాలనుకున్న సమయానికి ఓ గంట లేదా అరగంట ముందు
అలారమ్ పెట్టుకోండి. లేదా మొబైల్ లో నోటిఫికేషన్ సెట్చే సుకోండి. దైనందిన కార్యక్రమాల షెడ్యూల్ కోసం చాలా రకాల మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. గాడ్జెట్స్ వద్దు రాత్రి భోజనం తరువాత మొబైల్ లోనో, ట్యాబ్లెట్లోనో కాలక్షేపం చేయడం సర్వసాధారణమైపోయింది. లాక్ జోన్ల వల్ల అర్థరాత్రి వరకు వాటిలోనే గడపడం పిల్లలు, పెద్దలకు అలవాటుగా మారిపోయింది. గ్యాడ్జెట్స్ నుంచి వచ్చే నీలి కాంతి (బ్లూ లైట్) మెదడును గందరగోళంలోకి నెట్టేస్తుంది. ఫలితంగా నిద్ర పట్టడంలో కీలకమైన మెలటోనిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. కనుక నిద్రపోయే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను పక్కన పడేయండి.
వేడి నీటితో స్నానం పడుకోవడానికి గంటన్నర ముందు వేడి నీటితో స్నానం చేస్తే త్వరగా నిద్ర పడుతుందని ఓ పరిశోధనలో తేలింది. వేడి నీటి స్నానం శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, సుఖనిద్రకు దోహదపడుతుంది. కావాలనుకొంటే బాత్ సాల్స్, కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ నినీటికి జత చేసుకోవచ్చు. దీనివల్ల కండరాలకు ఉపశమనం కలుగుతుంది. చర్మం హైడ్రేట్ అవుతుంది. మంచి నిద్ర పడుతుంది. ఆలోచనలకు అక్షర రూపం ఎడతెగని ఆలోచనలు మెదడును ప్రశాంతంగా ఉండనివ్వవు.
ఇది ఆలోచనలతో నిద్ర పట్టదు. అలాంటప్పుడు మీ ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వండి. మెదడులో మెదిలే అనేకానేక విషయాలను పడుకొనే ముందు ఒక పుస్తకంలో రాయడం ప్రారంభించండి. ఇది ఆందోళన తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీకు సంతోషం కలిగించిన అంశాలు రాస్తే అది మిమ్మల్ని ఆశావహ దృక్పథంలో నడిపించడానికి, ప్రశాంతమైన నిద్రకు దోహదపడుతుంది.
రోజూ యోగా ప్రతి రోజూ యోగా చేస్తే సరైన నిద్ర పడుతుందనేది పలు పరిశోధనలు తేల్చాయి. అలాగే సాధారణ వ్యాయామాలు కండరాల ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచుతాయి. క్రమం తప్పని ద్యానం, ప్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు శారీరకంగా, మానసికంగా ఉపశమనం కలిగించి, ఉల్లాసంగా ఉంచుతాయి.