మహిళలు, అమ్మాయిలు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల కొంచెం దృష్టి సారించాలి. ముఖ్యంగా వెజైనల్ ఇన్ ఫెక్షన్స్ రాకుండా చిన్న చిన్న చిట్కాలు పాటించాలి,
అవి ఏమిటంటే..
లోదుస్తులు ఎంత మృదువుగా ఉన్నా బిగుతైనవి ఎంచుకోవద్దు. వీటి వల్ల ఆ ప్రాంతంలో ఇన్ ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. వర్కవుట్లు, స్విమ్మింగ్ లాంటివి చేశాక, రుతుస్రావం ఎక్కువగా అవుతున్నప్పుడు తడి అధికమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో లోదుస్తులను మార్చుకోవాలి. లేదంటే దుర్వాసన, రాపిడితో ఇబ్బంది పడతారు.
ఆ ప్రాంతం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొబయోటిక్ ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి సమృద్ధిగా ఉండే పెరుగును రోజూ ఆహారంలో చేర్చుకోండి మరి. శరీరం, అంతర్గత అవయవాలను శుభ్రంగా పెట్టుకోవాలి. అందుకోసం పరిమళాలు, గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు, వాట్లను వాడొద్దు.
సాధారణంగా చర్మం సున్నితంగా, మరీ ముఖ్యంగా వెజైనల్ ప్రాంతం అతి సున్నితంగా ఉంటుంది. గాడ రసాయనాలు ఉన్న ఉత్పత్తుల వల్ల పీహెచ్ సాయుల్లో మార్పులు వచ్చి ఆ ప్రాంతమంతా పొడి బారుతుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవడానికి గోరువెచ్చని నీళ్లు వాడితే సరిపోతుంది. దాంతోపాటు గాఢత తక్కువగా ఉండే సబ్బు వాడుకోవచ్చు.
వెజైనా దగ్గర పొడిగా అనిపించినా, దురద, దుర్వాసన ఉన్నా... నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. నీళ్లు సమృద్ధిగా తాగాలి. ఇలా చేస్తే శరీరంలోని వ్యర్థాలను ఇవి బయటకు పంపించేస్తాయి.
- Dr.Pooja