-->

నెలసరిలో | periods time | Girls | prudhviinfo



నెలసరిలో....

కడుపునొప్పి, తలనొప్పితో తీవ్రంగ ఇబ్బంది పడుతుంది. ఇంటిపని చేయాలంటే శరీరం సహకరించదు. ఆఫీసు వెళ్లాలనిపించదు. అయితే నాసియా, డయేరియా, మూడి స్వింగ్స్ వంటివి కూడా నెలసరిలో కొందరిని బాధిస్తాయంటున్నారు వైద్యులు. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం. 



ఆకు కూరలు... 

ఐరన్ పుష్కలంగా ఉండే ఆకు కూరలను నెలసరి సమయంలో ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వంటల్లోనే కాకుండా సలాడ్లు, స్మూతీల రూపంలో కూడా వీటిని తీసుకుంటే శరీరానికి తగినంత ఐరన్ అందుతుంది.

అరటిపండ్లు... 

పొటాషియం, విటమిన్ ఉండే అరటి పండును నెలసరిలో తప్పని సరిగా తీసుకోవాలి. ఇది కడుపు నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. నిస్సత్తువగా మారిన శరీరానికి తక్షణశక్తినిస్తుంది. ఈ సమయంలో చక్కెర స్థాయులు తగ్గినప్పుడు డార్క్ చాక్లోటు 

నాని అదుపులో పార్టీ సియం. మెగ్నీషియం, శక్తిని ఇస్తుంది. ఇందులోని ఎండార్ఫిన్స్ తో హ్యాపీ హార్మోన్లు విడుదలై మెదడును ఉల్లాసంగా మారుస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడొచ్చు.



పెరుగు...

 సూపప్పు గా పిలిచే పెరుగులో కాల్షియం ఉంటుంది. పొత్తికడుపు నొప్పిని తగ్గిస్తుంది. మూడిస్వెంగ్స్ ను దూరంగా ఉంచుతుంది. ఇ విటమిన్ ఎక్కువగా ఉండే గింజలు, ఎండు ఫలాలు నెలసరి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.

సాల్మన్... 

ఒమేగా 3 యాసిడ్స్ పుష్కలంగా ఉండే సాల్మన్  చేపను ఆసమయంలో ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. కనీసం వారంలో రెండుమూడు సార్లు ఈ చేపను భోజనంలోచేర్చుకోవాలని చెబుతున్నారు. ఆహార నిపుణులు,  మాంసాహారం తిననివారు దీనికి బదులుగా పాక్స్సే డ్స్ వేరుసెనగ, సోయాబీన్స్ ను తీసుకుంటే మంచిది.



PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT