-->

కాలేయం పనితీరు తెలుసు కోవచ్చు | liver function | health | prudhviinfo

 


కాలేయం పనితీరు తెలుసు కోవచ్చు

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

ప్రియమైన మనిషికి!

నమస్కారం, 🙏నా పేరు కాలేయం. నన్ను కారజ్యం అని కూడా పిలుస్తుంటారు. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో 'యకృత్' అనీ, ఆధునిక వైద్యశాస్త్రంలో 'హెపాట్' అ అంటుంటారు. ఒక యంత్రం పనిచేయడానికి దానికి 'లివర్'లు ఎంత అవసరమో, మీ శరీరం సక్రమంగా నడవడానికి నేను మీకు అంతే అవసరపడ్తున్నాను... అందుకని నన్ను 'లివర్' అని కూడా వ్యవహరిస్తుంటారు. నిజానికి నేను మీ శరీరానికి ఒక కెమికల్ లేబొరేటరీ నన్నమాట!

మీరు మీ అమ్మ కడుపులో పడినప్పటి నుంచీ నేనూ మీ కడుపులోనే వుంటున్నాను. నా గురించి మీకు తెలియదు. నా ఈ బహిరంగ లేఖను మీరు పూర్తిగా చదవబోయే ముందు నా గురించి మీకు పరిచయం చేసుకొంటున్నాను అందుకే! అవును...! నేనే మీ లివర్నే... మీకీ ఉత్తరం రాస్తున్నాను..

నా జీవితం కొవ్వొత్తిలాంటిది. మీకు వెలుగునిస్తూ కొవ్వొత్తి తాను కరిగిపోవడం లేదూ... నేనూ అంతే! మీ కోసం అహరహం అవిశ్రాంతంగా, అవిరామంగా అలుపెరగ కుండా పనిచేస్తున్నాను. అయినా, మీరు నా కోసం ఏం చేస్తున్నారని ఏనాడూ ఒక్కసారి అడగలేదు. అడగందే అమ్మయినా పెట్టదని మీ మనుషులే సామెతలు -జీర్ణత చెప్తూ వుంటారుగా... అవన్నీ నాకు తెలుసు. అందుకే మీకీ విధంగా బహిరంగ లేఖ రాయడానికి సాహసం చేస్తున్నాను.

మీరు గురించి ఆలోచించడానికి ముందు నేనెక్కడుంటానో మీరు తెలుసు కోవాలి.నేను మీ కడుపులో కుడివైపున పై భాగాన, కుడి ఊపిరితిత్తికి కింద నిశ్చలంగా

వుంటాను. ఇక్కడ కూర్చుని నా విధులు నేను నిర్వర్తిస్తున్నాను. మీరు మెలకువగా వున్నా నిద్రిస్తున్నా. ఏ పనిచేస్తున్నా నా విధులేవీ ఒక్కక్షణం ఆగవు. నేనాగిన క్షణాన మీ జీవితం అతలాకుతలం అయిపోతుంది. అదే నా భయం... మీరు జీవించి వున్నంత కాలం మీ కంటే బలంగా నేను వున్నప్పుడే మీరు ఆరోగ్యవంతులుగా రాణించగలుగుతారు. ఈ రహస్యాన్ని మీరు గుర్తించడం లేదనేదే నా ఆరోపణ!


మీరు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా నేను తట్టుకోగలుగుతున్నాను కాబట్టే మీ శరీరంలో జీవనక్రియలన్నీ యధాతధంగా జరిగిపోతున్నాయి.

1. మీరు అమ్మకడుపులో పసిగుడ్డగా వున్నప్పుడు మీకు ఎర్ర రక్తకణాలను ఏర్పాటుచేసింది నేనే!

2. పాత ఎర్ర రక్తకణాలను తొలగించి కొత్త కణాలను సృష్టించి మీ రక్తాన్ని నిత్య నూతనంగా తాజాగా నిలుపుతోంది నేనే. ఇనుము వంటి రక్తవర్ధకాల్ని నాలోనే నిలవబట్టి ఎర్రరక్తకణాలను తయారు చేస్తాను.

3. మీ రక్తానికి నేనే పుట్టింటిని... అని మీరు ఇప్పటికైనా గ్రహించారనుకుంటాను.

4. అంతేకాదు, సూది గుచ్చుకున్నంత చిన్న గాయం అయితే చాలు ఆ గాయంలోంచి రక్తం ధారాపాతంగా కారిపోతుంది. అలా జరగకూడదని అరనిమిషంలో రక్తం గడ్డ కట్టుకునేలా నేనే ఏర్పాటు చేస్తాను. ఇలా రక్తానికి గడ్డకట్టుకునే లక్షణం. లేకపోతే పార్లమెంట్లో సైతం ముష్టియుద్ధాలకు తలపడే మీ మనుషులు ఏనాడో రక్తహీనులై పోయుండేవారు. విటమిన్ 'కె', ఫైబ్రినోజిన్ అనే పదార్థాల్ని ఉపయో గించి 'ప్రోత్రాంబిన్ అనే రసాయనాన్ని నేనే తయారుచేశాను. ప్రోత్రాంబిన్ వలన బైటకు స్రవించే రక్తాన్ని గడ్డకట్టించి నేను ఆపగలుగుతాను.

5. జీర్ణ ప్రక్రియకు అత్యంత ముఖ్యమైన 'బైల్' అనే పదార్ధాన్ని నేను తయారుచేసి పేగుల్లోకి విడుదల చేస్తాను. 'బైల్' లేకపోతే మీకు తిండిప్రాప్తి వుండదు. కామెర్ల వ్యాధిలో 'బైల్' రసాయనం పేగుల్లోకి విడుదలకాకపోవడం వలనే ఆకలి లేకుండా పోతోంది....

 6. మీరు తీసుకునే పిండి పదార్థాలను గ్లూకోజ్ గా మార్చడం నా విధి. ఈ విధంగా

రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గిపోయి మీరు నిస్సత్తువతో కూలిపోకుండా నేనేకాపాడుతున్నాను. 

7. అన్నట్లు జలోదరం వ్యాధి రావడానికి కారణం కూడా మీ మనుషుల్లో నా "లివర్ సోదరులు" దెబ్బతినడమేనని మీకు మరోసారి గుర్తుచేస్తున్నాను.

నేనే కాదు, మీ శరీరంలోని అవయవాలన్నీ బలసంపన్నంగా వుండేందుకు తీసుకోదగిన జాగ్రత్తల గురించి మీరు తెలుసుకోలేకపోతే మీరు, మీతో పాటు మేమూ.. ఎంత గానో నష్టపోతం

అందుకే, నేనూ మీరూ కూడా బలంగా వుండేందుకు కావలసిన సూచనలిద్దామని మీకు ఉత్తరం రాయడానికి పూనుకొన్నాను.

👉 మొoతికూరని తరచూ వాడుకోవడం, మెంతుల్ని నానబెట్టి మొక్కగట్టి మెత్తని పేస్టులా చేసి 1 చెంచా మోతాదులో రెండుపూటలా తీసుకోవడం... చేస్తే మీ కరువులో బలిపశువుగా మారిపోతున్న నాలో (లివర్) వచ్చే అనారోగ్యకరమార్పులన్నీ నెమ్మదిస్తాయి. ముఖ్యంగా పొగత్రాగేవారు, మద్యపానం చేసేవారు, అతిగా మందులు వాడవలసివచ్చే అనారోగ్యతో బాధపడ్తున్నవారూ ఈ విధంగా నా గురించి శ్రద్ధ తీసుకోవడం అవసరం.

2. వస కొమ్మును అరగదీసి, గంధం (పేస్ట్) తీసి 1/2 చెంచా మోతాదులో తేనె కలిపి రెండు పూటలా తింటే మీ లివర్ పైనన నేను నూరేళ్ళు బలంగా జీవిస్తాను. 

. 3. సోoపు (పెద్ద జీలకర్రలా వుంటుంది)ని దోరగా వేయించి 1 చెంచా మోతాదులో

రోజు తినండి. ఇంక నాకు అనారోగ్యం అనేదేరాదు.

 4. అల్లoని మెత్తగా దంచి, తగినంత ఉప్పు కలిపి, 1 చెంచా పొడిని అన్నం మొదటి మద్దలో నేతితో రోజూ తినండి. మీ కడుపులో వుండే అవయవాలన్నింటికీ మoచిది. ముఖ్యంగా నాలో వచ్చే ఎనలార్ట్మెంట్, కామెర్లు ఔషధంలా పనిచేస్తుంది.

5. నాలో వచ్చే వాపు వ్యాధికి కంద'ని ఆహారపదార్థంగా తీసుకొంటే ఎంతగానో ఉపయోగవస్తుంది.

6 వెల్లుల్లి అల్లం కలిపి దంచి, ఆహారపదార్ధంగా తరచూ తీసుకొంటే నేను బలంగా వుంటాను. ఈ మిశ్రమాన్ని అన్నంలో తినలేని వారు శనగ గింజంత మాత్రలు.. చేసుకొని మూడుపూటలా 1, 2 మాత్రలు తీసుకొంటూ వుంటే నాలో జబ్బలేవీరావు

7. గోంగూరను ఉడకబెట్టి పులుసుకూరగా తింటారు. ఇది నేను బలంగా వుండేందుకు తో డ్పడే మంచి ఆహార పదార్ధం. గోంగూరలో ఇనుము వున్న సంగతి మీకు తెలుగుగదా!

8.జీలకర్ర, ధనియాలు, వాము, శొంఠి, ఈ నాల్గింటిని సమానంగా తీసుకొన్ని నేతిలో వేయించి, మెత్తగా దంచి, ఉప్పుకలుపుకొని 1-2 చెంచాల పొడిని అన్నంలో తింటే జీర్ణాశయ వ్యాధులనేవే రావు. 

9. చింతచెట్టు ఆకుని సేకరించి, నీడన ఎండించి మెత్తగా దంచి ఒక సీసాలోభద్రపరచుకోండి. పావుచెంచా చింతాకుపొడిని తీసుకొని చిన్నముంత (లేక) చిన్నకుండలో వేయండి. ఐదారు ఎండు ద్రాక్ష పండ్లు కూడా వేయండి. కొత్తది 4 అంగుళాల మేకు తుప్పు లేకుండా తెల్లగా వున్నది ఈ కుండలో వేయండి..

ముంతలో 2 గ్లాసుల నీల్బు పోసి పొయ్యి మీద వుంచి 1/2 గ్లాసు మిగిలేల. మరిగించి మేకు తీసేసి, వడగట్టి, వచ్చిన ఆ కషాయంలో పంచదార కలుపుకొని త్రగండి. ఇలా రోజూ కొన్నాళ్ళపాటు చేస్తే మీ లివర్నైన నాకు ఏనుగంత బలం వస్తుంది. మీకు రక్తపుష్టి కలుగుతుంది. జలోదరం, కామెర్లు, లివర్ జబ్బులన్నింటి లోనూ ఈ ప్రయోగం చేయవచ్చు. ఏ వ్యాధిలేని వారు, పిల్లలక్కూడా దీన్ని, రోజూ చేస్తే వారి ఆరోగ్యం మరింత బాగా వుంటుంది. ఇదే మేకుని శుభ్రం చేసి రోజూ వాడుకోవచ్చు. ఈ కషాయం కాయడానికి సత్తుగిన్నెలూ, స్టీలు గిన్నెలూ వాడవద్దు. చిన్నకుండని మాత్రమే వాడండి.

10. కృష్ణ తులసి (నల్లని తులసి) ఆకులు ఎండించి మెత్తగా దంచి ఆ పొడిని సీసాలో భద్రపరచుకోండి. 1-2 చెంచాల పొడిని రెండు పూటలా తేనెతో తీసుకోండి. నాలో వచ్చే వ్యాధులన్నీ తగ్గుతాయి.

ఇలా చెప్పుకొంటూపోతే నా ఆరోగ్యాన్ని తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు లనేకం వున్నాయి. కావలసిందల్లా వాటిని పాటించేందుకు మీకు మనసుకావాలి. మనసున్నవారు కాబట్టే మీకిన్ని విషయాలు చెప్పాలని పూనుకున్నాను పాటిస్తారనే

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT