-->

అర్ధరాత్రి ఆకలైతే | If hungry at midnight | prudhviinfo



 అర్ధరాత్రి ఆకలైతే

  రాత్రి ఎనిమిది గంటలకే భోంచేసి, తొమ్మిదింటికంతా నిద్రపోవడం దాదాపుగా అసాధ్యమైపోయింది. ఈ రోజుల్లో. అర్ధరాత్రి వరకూ టీవీలు, స్మార్ట్ ఫోన్లలో మునిగిపోతున్నారు. మధ్యలో ఆకలేస్తే ఏదిపడితే అది తింటున్నారు. ఫలితంగా, ఊబకాయం బారినపడుతున్నారు. ఆ తినేదేదో ఆరోగ్యవంతమైనదే తినమని సలహా ఇస్తున్నారు నిపుణులు.

• బెర్రీ పండ్లు : 

 ఇందులో పీచుపదార్థం ఎక్కువ. బెర్రీలోని మెగ్నీషియం నరాలు, కండరాలను త్వరగా విశ్రాంతపరుస్తుంది.

  చిరు' రుచులు :

 గోధుమలు, చిరుధాన్యాలతో (తక్కువ ఉప్పుతో) చేసిన అప్పాలు, మురుకులు.

  క్యారెట్ : 

    కరకరమనే క్యారెట్ తింటూ టైమ్ పాస్ చేయడంవల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తాజా క్యారెట్లలో తక్కువ క్యాలరీలు ఉంటాయి.

  పాప్ కార్న్ :

  రాత్రిళ్లు (ఉప్పు లేకుండా) ఆలివ్ ఆయిల్ లో వేయించిన పాప్ కార్న్ తినడంవల్ల నష్టం లేదు.

 పుట్నాలు : 

  క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే పుట్నాలను స్నాక్స్ గా ఎంచుకోవచ్చు. వీటిలో ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలం.

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT