-->

పవర్ ఫుడ్స్ అవసరానికి | Healthy food | health | prudhviinfoపవర్ ఫుడ్స్  అవసరానికి

ఆహారం శరీర అవసరాలకు తగిన ఆహారం ఎంచుకోవాలి. తక్షణ శక్తి, కండర నిర్మాణం, మెటబాలిజం, కొవ్వును కరిగించడం.. ఇలా ఆ సమయాల్లో ఎంచుకోదగిన పవర్

ఫుడ్స్ ఇవే!

శక్తి కోసం: 

శక్తి నిల్వలు తరగకుండా ఉండాలంటే ఓట్లు తినాలి. దీర్ఘ సమయం పాటు వ్యాయామం చేయాలనుకుంటే సహజసిద్ధంగా శక్తిని పెంచే గుప్పెడు ఎండుద్రాక్ష నోట్లో వేసుకోవాలి. వ్యాయామంతో నీరసించిపోకుండా ఉండాలంటే శరీరంలో ఎలక్ట్రోలైట్లను భర్తీ చేసే అరటి పండు తినాలి. నొప్పి వదిలేలా: కండరాల నొప్పులను 20 శాతానికి తగ్గించే గుణం అల్లానికి ఉంటుంది. తల తిరుగుడును కూడా తగ్గించే అల్లంతో టీ తయారుచేసుకుని తాగాలి. చెర్రీ పళ్లకు ఫ్రీ ర్యాడికలను స్థిరీకరించి త్వరగా కోలుకునేలా చేసే గుణాలుంటాయి. కీళ్ల నొప్పులకు ఇబ్యుప్రొఫె పని చేసే పసుపును ఆహారంలో చేర్చుకుంటే నొప్పులు తగ్గుతాయి.

 కండర నిర్మాణం: 

గుడ్లలోని అమినో యాసిడ్లు, ల్యూసిన్ కండరాలను చురుగ్గా మరమ్మతు చేస్తాయి. బిగుతైన యాబ్స్ నిర్మాణంలో ప్రధానమైన పాత్ర పోషించే వే ప్రొటీన్ తీసుకోవచ్చు. చేపల్లోని మాంసకృత్తులు కండరాలు బలపడే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

 మెటబాలిజం:

 పిస్తా.. వ్యాయామం తర్వాత అనవసరపు క్యాలరీలు దరి చేరకుండా ఆకలిని తీర్చే పవర్ ఫడ్, వ్యాయామం చేసే సమయంలో తక్కువ శక్తితో ఎక్కువ ప్రయోజనం దక్కేలా చేయగలిగే కూరగాయ బీట్ రూట్. సోయాబీన్స్ కొవ్వును వేగంగాకరిగిస్తాయి. కాబట్టి లావు తగ్గాలనుకునేవాళ్లు పిస్తా,  బీట్ రూట్, సోయాలను ఆహారంలో చేర్చుకోవాలి.


PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT