-->

కంటి చూపు మెరుగుపరుచుకుందాం | Let's improve eyesight | health | prudhviinfo కంటి చూపు మెరుగుపరుచుకుందాం

శరీరంలోని అవయవాల్లో కన్ను ప్రధానం. ఈ రోజుల్లో పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది దృష్టి సమస్యలతో బాధపడుతున్నారు. వృద్ధాప్యం కారణంగా కంటిచూపు మందగించవచ్చు. కానీ ఆధునిక యుగంలో టెలివిజన్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్లు, కంప్యూటర్లు ఇతర అధునాత సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం అధికమై పిల్లలు, యువకుల్లో కంటి సమస్యలకు దారితీస్తుంది. కంటి సంరక్షణలో కొన్ని ప్రత్యేక ఆహారాలను రోజు వారి ఆహారంలో చేర్చితే వివిధ కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

చేపలు : 

చేపల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో గొప్పగా సహాయపడుతాయి. ఇది రెటీనాను కళ్ల వెనుక దృఢంగా ఉంచడంలో, పొడి కంటి సమస్యలను నివారించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ట్యూనా, సాల్మన్, మాకేరెల్, సార్డినెస్, ట్రేలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.

గుడ్లు :

 గుడ్లు ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లతో నిండి ఉంటాయి. ఇవన్నీ కళ్లకు ఆరోగ్యకరమైనవి. గుడ్డు సొనలో కంటి చూపును మెరుగుపరిచే విటమిన్ ఎ, లుటిన్, జియాక్సంతిన్, జింక్ ఉంటాయి.

పాల ఉత్పత్తులు :

 పాలు, పెరుగు వంటి పాల ఆహార పదార్థాలు విటమిన్ ఎ, ఖనిజజింకకు మూలాలు, విటమిన్ ఎ కార్నియాను రక్షించడంలో సహాయ పడుతుంది. కాలేయం నుండి కళ్లకు విటమిన్లను అందించడంలోనూ, కంటి శుక్లాలను నివారించడంతోనూ జింక్ సహాయపడుతుంది. బాదం, విత్తనాలు : బాదం, గింజల్లో కళ్లకు మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఉంటాయి. రోజువారీ ఆహారంలో పెస్టో, బాదం, వాల్‌నట్, చియా గింజలు, నువ్వు గింజలు, వేరుశెనగలను చేర్చుకోవడం మంచిది.

సిట్రస్ ఫలాలు :

 నారింజ, బెర్రీ, ఢ, నిమ్మ, పనస వంటి పండ్లు విటమిన్ సితో నిండి ఉంటాయి. ఇవి కంటి సమస్యలను తగ్గిస్తాయి. సిట్రస్ పండ్లలో ఇతర విటమిన్లు, అవసరమైన ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

క్యారెట్లు :

 క్యారెట్లలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడాలంటే క్యారెట్లను ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలి. ఆకు కూరలు : ఆకుపచ్చ కూరగాయలు, ఆకుకూరల్లో ఆహార ఫైబర్, విటమిన్ సితో పాటు లుటీస్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT