మితమే హితం
బయట దొరికే పాస్ట్ ఫుడ్స్ లో పోషకాలు కంటే హానికర కారకాలే అధికంగా ఉంటున్నాయి. నలభై ఏళ్లకు పైబడిన వారు ఈ కింది ఆహారాల జోలికి పోకపోవడమే మంచిది. ముఖ్యంగా...
బర్గర్స్:
చాలామంది బర్గర్స్ ను అమితంగా ఇష్టపడుతుంటారు. వీటిలో ఒమేగా-6ప్యాటీ యాసిడ్స్, సోడియంలు అధికంగా ఉంటాయి. ఇవి రెండూ కూడా శరీరానికి అనారోగ్యానికి హాని కలిగించేవే. వీటిని రోజూ తినడం వల్ల ఇతర రకాల అనారోగ్యాలతోపాటు, హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.
ఎనర్జీ డ్రింక్స్:
బాగా దాహంగా ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకునేటప్పుడు మరింత ఉత్సాహంగా ఉండేందుకు ఎనర్జీ డ్రింక్స్ ను తాగుతుంటాము. అయితే వీటిలో పంచదార, కెఫిన్ అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని దీర్ఘకాలం తీసుకోవడం వల్ల చర్మం, దంతాలపై తీవ్ర చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి.
సోడా డ్రింక్:
సోడాలో వంచదారతోపాటు కెఫిన్, ఫుడ్ కలర్ అధికంగా ఉంటుంది. ఈ మూడు శరీరానికి హాని కలిగించేవే. డైలీ సోడా తాగడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు
ఈ ఆహారాల జోలికి పోకుండా ఉంటే ఆరోగ్యం పదిలంగా ఉన్నట్లే.
🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥
https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep
జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇