-->

జలుబు వేధిస్తుందా | Does the cold bother | health | prudhviinfoజలుబు వేధిస్తుందా 

సాధారణంగా సీజన్ మారినప్పుడు చాలామందిని జలుబు సమస్య వేధిస్తుంది. కొన్ని ఇంటి చిట్కాలతో దాని నుంచి ఉపశమనం పొందడమెలాగో తెలుసుకుందాం.

 జలుబు చేసినప్పుడు నీటిని చల్లగా కాకుండా వేడి చేసి తాగాలి. ఆ వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తరచూ తాగుతుంటే త్వరగా ఉపశమనం వస్తుంది. జలుబు చేసినప్పుడు ఆవిరిపట్టడం వల్ల మూసుకుపోయిన ముక్కురంధ్రాలు తెరుచుకుంటాయి. ఆ వేడినీటిలో పసుపు, బామ్ వంటి వాటితోపాటు యూకలిప్టస్ ఆయిల్ కూడా వేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

    వేడి పాలల్లో కాసింత పసుపు కలుపుకుని తాగాలి. ఈ చిట్కా రాత్రి వేళల్లో బాగా పనిచేస్తుంది. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. జలుబుతో బాధపడేవారు.. అల్లం టీ తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు, జలుబు వల్ల వచ్చే దగ్గుని తగ్గిస్తాయి.

    జలుబు ఉన్నవారు తులసి ఆకులు, రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. ఓ కప్పు నీటిలో స్పూన్ బార్లీ గింజలను వేసి మరిగించి వడకట్టి అందులో నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేస్తుండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. దీనితో పాటు వామాకు దంచి దానిలో కాస్తా కర్పూరాన్ని కలిపి ఆ వాసన చూడాలి. నీటిలో కర్పూరం వేసి ఆవిరిపట్టినా మంచి ఫలితం ఉంటుంది.

PRUDHVIINFO

@PRUDHVIINFO

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే prudhvi info

GET NOTIFIED OUR CONTENT