ఒక్క నిమిషం...
సమయం చాలా విలువైనది....
ఒక్క నిమిషం మనిషి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది, ఎన్నో మార్పులను తీసుకొని వస్తుంది.
ఒక్క నిమిషం ఆలస్యం అయితే జీవితంలో ఎంతో కోల్పోతాము కూడా.
ఒక్క నిమిషమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఆ ఒక్క నిమిషమే మనల్ని చాలా వాటికి దూరం చేస్తుంది.
విజయానికైనా, పరాజయానికైనా...
పొందాలన్నా, కోల్పోవాలన్నా...
ఉన్నతికైనా, పతనానికైనా...
ఒక్క నిమిషం చాలు...
ఒక్క నిమిషానికి మనం ఇచ్చే విలువ, ఆ ఒక్క నిమిషాన్ని మనం ఉపయోగించే తీరు మన జీవితాన్నే మార్చేస్తుంది..
జీవితంలో ఏదైనా నిమిషాల్లో జరిగిపోతుంది..
ఆశను కోల్పోకండి.... ప్రయత్నిస్తూనే ఉండండి..
సమయానికి విలువనిస్తూ ప్రతీ క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి...
మీరు కోరుకున్న జీవితం మీకు లభించడానికి ఒక్క నిమిషం చాలు...
థాంక్ యు....