ఆందోళన ఆమడ దూరం
ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో కొంత ఆందోళన, ఆదురా సహజం. అయితే అవి రక్తపోటును పెంచేటంత స్థాయికి చేరుకోకుండా జాగ్రత్త పడాలి. ధ్యానం, యోగా, వ్యాయామాలతో పాటు యాంటీ యాంగ్జయిటీ ఆహారంతో కూడా ఆందోళనను అదుపులో ఉంచుకోగలిగే వీలుంది.
బ్రౌన్ రైస్:
మాంగనీసు, సెలీనియం, మెగ్నీషియం, బి విటమిన్లు... ఇలా నాడీ వ్యవస్థకూ, మానసిక ఆరోగ్యానికి కీలకమైన పోషకాలు బ్రౌన్ రైలో ఉంటాయి. కాబట్టి తెల్ల అన్నం మానేసి, బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోవాలి. ఆకుపచ్చ అరటి: నాడుల్లో సంకేతాల ప్రసారానికి, కండరాల పనితీరుకు, కణాల్లో ద్రవ పరిమాణానికి తోడ్పడే ఖనిజలవణం పొటాషియం ఆకుపచ్చని అరటిలో ఎక్కువ. అలాగే ఈ అరటితో ఆందోళన అదుపు తప్పేలా చేసే రక్తంలోని స్ట్రెస్ ఫ్రీ చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరిగిపోకుండా ఉంటాయి.
బాదం:
బాదంలో మెదడుకు మేలు చేసే విటమిన్ ఇ, మెగ్నీషియం ఉంటాయి. విటమిన్ ఇ ఫ్రీ ర్యాడికల్ డ్యామేజీ నుంచి కణాల పైపొరలకు రక్షణనిస్తుంది. ఫలితంగా మెదడు ఆరోగ్యం సురక్షితంగా