గుప్త దానం అంటే ఏమిటో తెలుసా ?
అజ్ఞాతదాత ఔదార్యం
- శ్రీమతి సుధామూర్తి, చైర్మన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్
ఈ రోజుల్లో సమాజంలో ఏదైనా స్వచ్ఛంద సేవాసంస్థకో,
ఆశ్రమాలకో విరాళాలు ఇవ్వడం ఆనవాయితీగా మారుతోంది;
ఇది మంచి సంప్రదాయమే! అయితే గోరంత సాయం చేసి
కొండంత చెప్పుకునే వారే చాలా మంది. ఓ స్వచ్ఛంద సంస్థను
నడుపుతున్న నేను విరాళాలకు సంబంధించిన రెండు విభిన్నమైన
ఉదంతాలను జీవితాంతం మరచిపోలేను. నా స్నేహితురాలు
మైథిలి ఓ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ (ఎన్.జి.ఒ.)లో
పనిచేస్తోంది. ప్రజాసేవా కార్యక్రమాల కోసం ఆమె నిధులు
సేకరిస్తూ ఉంటుంది. మంచి మాటకారి, చురుకైంది. ఒకరోజు
మైథిలితో కలసి బెంగుళూరులోనే అత్యంత ధనవంతురాలిగా
పేరున్న ఓ వ్యక్తిని కలవడానికి వెళ్ళాం. మైథిలి ఆమెను చాలా
కాలంగా, తరచూ కలుస్తూ ఎంతో కొంత విరాళం ఇవ్వాలని
కోరుతూనే ఉంది. అయితే నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న
ఆమె ఉద్యానగృహానికి (ఫామ్ హౌస్) వస్తే, ఆలోచిస్తానంది.
మైథిలి నన్ను కూడా తోడుగా రమ్మంది. రాజప్రాసాదం లాంటి
ఆ సంపన్నురాలి ఇంటికి వెళ్ళాం. ఇరవై అయిదెకరాల పెద్ద
తోట మధ్యలో విలాసవంతమైన భవనమది.
ఎక్కడ చూసినా సంపదే! ఇంటామె తళతళలాడుతున్న
గొలుసులకు వేలాడదీసిన ఉయ్యాలలో కూర్చొని ఉంది. ఆమె
వయస్సు యాభై, అరవై ఏళ్ళ మధ్య ఉంటుంది. అన్నీ ఉన్నా
ఆమె ముఖంలో సహజమైన చిరునవ్వు, ఆదరణే లోపించాయి.
అందుకే అన్ని అలంకరణలు కూడా వెలవెలబోయాయి.
అతిథేయులు పెట్టే ఆహారం, వాళ్ళ ఆభరణాలు, ఇంటి
అందచందాలు ఏవీ అతిథుల్ని ఆనందింపచేయలేవు; వారి
హృదయపూర్వకమైన చిరునవ్వే హాయి గొల్పుతుంది. కానీ అవే
అక్కడ కరవయ్యాయి. నా స్నేహితురాలు తమ సంస్థ గురించి
ఎంతో వివరించింది. కానీ ఆ శ్రీమంతురాలు కొంచెం కూడా
స్పందించలేదు. చాలా సేపటి తరువాత 'మీ విజ్ఞాపన పత్రం,
ఇతర పత్రాలు నా కార్యదర్శికి ఇచ్చి వెళ్ళండి. వాటిని చూసి
తర్వాత మీకు తెలియజేస్తాను' అని ముక్తసరిగా మాట్లాడి
పంపించింది. మా ఉత్సాహం నీరుగారిపోయింది. తరువాత
నెల రోజులు వెంటపడితే ఆఖరుకు పదివేలు ఇవ్వడానికి
అంగీకరించిందట; అదీ ఓ స్కూలు ప్రారంభోత్సవానికి ముఖ్య
అతిథిగా ఆహ్వానించి, ఆమె ఫోటో పత్రికల్లో వేయించి, ఆమె
గొప్పతనాన్ని చాటుతూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేయాలన్న
షరతులతో! అంతటి కోటీశ్వరురాలికి పదివేలు పది పైసల కన్నా
తక్కువే! అయినా ఆమెచేత ఆ కొంత విదిల్చేలా చేయడానికి
కూడా ఎన్నో ప్రయాసలు పడాల్సి వచ్చింది.
కొన్నాళ్ళకు మా సంస్థ కార్యాలయానికి వారం
రోజుల సెలవు తరువాత వెళ్ళాను. ఉత్తరాలు సర్దుతుంటే
నా కార్యదర్శి ఓ చిన్న కవరు నా చేతిలో పెట్టింది. అందులో
ఓ చిన్న లేఖ “అమ్మా! నేనెవరో మీకు తెలియదు. కానీ మీరు
చేస్తున్న మంచి పనుల గురించి వార్తాపత్రికల్లో చదివాను. మీ
ఎన్నో విషయాలు అందులో ఉన్నాయి. మీ అనుభవాల గురించి
రచనలతో కూడా పరిచయముంది; జీవితాన్ని కాచి వడపోసిన
చదివి మీరెలాంటి కృషి చేస్తున్నారో, ఎంత ఉత్సాహంతో
పనిచేస్తున్నారో....' అంటూ సాగిపోతున్న ఉత్తరాన్ని బిజీగా ఉండి
చదవలేక, 'అతిగా పొగుడుతూ రాస్తుంటారు. కొంతమంది.
అలాంటి ఉత్తరమే ఇది. ఫైల్ చేస్తే చాలు. ఇలాంటివన్నీ నాకు
చూపించాల్సిన అవసరం లేదులే' అంటూ వేరే పనుల్లో
మునిగిపోబోయాను.
'మేడమ్! మీరు పూర్తిగా చదవలేదు. ఇది అలాంటి ఉత్తరం
కాదు' అంటూ మరోసారి ఆ అమ్మాయి నాకిచ్చింది. సరే
చూద్దామని చదివాను. .... నేను పెద్దవాడిని. మీలాగా ప్రయాణం
చేయలేను. నేను నా ఆదాయంలో నుంచి కొంత, కొంత పొదుపు
చేశాను. దాన్ని ఏదైనా మంచిపనికి వినియోగిద్దామని
భావించాను. ఇంతలో మీరు గుర్తొచ్చారు. మీకు చాలా సంపద
ఉండొచ్చు. కానీ నేను కూడా ఎంతో కొంత సాయపడాలని,
మీరు చేస్తున్న మంచిపనుల కోసం ఇస్తున్నాను. దీన్ని మీరు
ఎవరికిస్తారు, ఎలా ఖర్చు పెడతారని అడగను. మీ మీద నాకు
నమ్మకముంది' అంటూ డి.డి. జతచేసి పంపారాయన.
ఆ డి.డి. చూసి ఆశ్చర్యపోయాను. అక్షరాలా నాలుగు లక్షల
రూపాయల బ్యాంకు డ్రాఫ్టు అది. అజ్ఞాతంగా అంత పెద్ద మొత్తాన్ని
అందుకోవడం అదే మొదటి సారి." ప్రత్యుపకారమేదీ ఆయన
కోరలేదు. తన గురించి ఒక్కముక్క కూడా రాసుకోలేదు.
చిరునామా కూడా లేదు. ఆ అజ్ఞాతదాత ఔదార్యానికి నా కళ్ళు
చెమ్మగిల్లాయి. తెలియకుండానే రెండు హస్తాలు ఒక్కచోటికి చేరి
కోటీశ్వరురాలు మనస్సులో స్ఫురించింది. ఎవరు నిజమైన
నమస్కరించాయి. పదివేల కోసం పదిసార్లు తిప్పించుకున్న
ధనవంతులో, పెద్దమనుషులో తెలిసివచ్చింది.