హాయిగా నిదురపో...
![]() |
sleep well |
చాలామంది రాత్రిళ్లు నిద్రరాక ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా మంచిగ నిద్రపట్టాలంటే చిన్న టిప్స్ ఫాలో కావాలి... నిద్రపోయేముందు చాలామంది ఫోన్, ల్యాప్టాప్ పట్టుకు కూర్చుంటారు. రాత్రి టైంలో స్క్రీన్ముందు ఉండటం వల్ల దాన్నుంచి వచ్చే బ్లూలైట్ ఫెక్ట్ బ్రెయిన్ మీద పడుతుంది. దీని వల్ల నైట్ అయ్యిందనే సంగతి బ్రెయిన్ గుర్తించదు. కాబట్టి నిద్రపోవాలనుకునే ముందు స్క్రీన్ కి దూరంగా ఉండాలి. అరికాళ్లను మెల్లగా మసాజ్ చేయాలి. మ్యూజిక్ పెట్టుకొని, కళ్లు మూసుకుని ఊపిరి మీద ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది. స్లీపింగ్ మ్యూజిక్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అనేక రకాల స్లీపింగ్ మ్యూజిక్స్ వస్తాయి. వాటిని వింటే తెలియకుండానే నిద్రలోకి జారుకోవచ్చు.
• కెఫిన్ ఉన్న కాఫీ, చాలు సాయంత్రాలు తాగొద్దు. కావాలంటే నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగొచ్చు
• రోజూవారి స్లీప్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. రోజూ ఒకే టైంకి పడుకోవాలి. నిద్రలేవాలి. ఈ అలవాటు వల్ల మంచి నిద్ర పడుతుంది.