-->

గంపా నాగేశ్వర్ రావు గారి స్వానుభవం | Self experience of Gampa Nageshwar Rao | prudhviinfo

Self-experience of Gampa Nageshwar Rao


 గంపా నాగేశ్వర్ రావు గారి స్వానుభవం

Self-experience of Gampa Nageshwar Rao

                (An Inspirational Story)

***************************************


                      ఇదీ నా కథ

               (This is My Story)

                ****************


నమస్తే !


నా పేరు గంపా నాగేశ్వర్ రావు, నేను పుట్టింది ఓ చిన్న గ్రామంలో… కేశవరం అనే గ్రామం శామీర్ పేట్ దగ్గరలో ఉంటుంది. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా. అక్కడే చదువుకున్నాను 7th వరకు. మాది రైతు కుటుంభం. మా నాన్న గారు ఒక రైతు. మా నాన్న గారు రైతుగా ఉంటూ… అతను వ్యవసాయం చేయలేక హైదరాబాద్ కు పొట్టచేత పట్టుకొని వచ్చాడు. ఎందుకంటే… ఒకప్పుడు వ్యవసాయం చేయడం చాలా కష్టం. 23 గజాల్లోతు బావి ఉండేది. నీళ్లు ఉండేది కాదు. ఓన్లీ వర్షా కాలపు ఆధారిత పంట. 


ఆ రకంగా… 

మా నాన్న హైదరాబాద్ కు రావడంతో, నేను 7th వరకు మా ఊర్లో చదువుకున్నాను. ఎందుకంటే, మా ఊర్లో 7th వరకే ఉంది కాబట్టి. 8th, 9th, 10th - 6 కిలోమీటర్ల దూరంలో ఆలియాబాద్ అనే ఊర్లో ZPHS, అక్కడికి వెళ్లి చదువుకున్నాను. అక్కడ 10th క్లాస్ లో మేం ఒక 50 మంది వరకు Exam రాస్తే, నలుగురం మాత్రమే పాస్ అయ్యాం. ఇప్పటితోని పోలిస్తే… ఒకప్పుడు10th పాస్ కావడం కష్టం. అదే… ఇప్పుడు 10th ఫెయిల్ కావడం కష్టం. కాబట్టి ఆ రకంగా నా 10th పాస్ కంప్లీట్ చెసాను. మా నాన్నగారు, అప్పుడు 1978 లో మొత్తం హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయారు. ఏదో చిన్న - చిన్న వ్యాపారం ఏదైనా చేసుకుంటూ బ్రతుకుదామని ఇక్కడికి రావడంతో… నేను కూడా రావడం జరిగింది. 


ఇంటర్మీడియట్ ఇక్కడే, బడీ చావిడి అని ఉంది సుల్తాన్ బజార్ లో… చైతన్య కళాశాల అనే ఓ కళాశాలలో. ఎందుకంటే… అప్పుడు మార్కులు ఎక్కువ వస్తే, గవర్నమెంట్ కాలేజీలో సీట్ దొరికేది. తక్కువొస్తే… ప్రైవేటు కాలేజీలో సీట్ దొరికేది. నాకు మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి, ప్రైవేటు కాలేజీలో సీట్ దొరికింది. 


సో… 

ఆ రకంగా నేను 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, నాకు ఇంజినీర్ కావాలని ఎంతో కోరిక. చిన్నప్పటి నుండి కూడా, నాకు అన్ని కొత్త, కొత్త ఇన్వెన్షన్స్, కొత్త, కొత్త విషయాలు, అన్నీ ఓపెన్ చేయడం, ఫిట్ చేయడం చేసేవాణ్ణి. 


అయితే… 

ఎంపీసీ తీసుకున్నాను, దాని తర్వాత ఇంజినీర్ ఔదామనుకుంటే, బికాజ్ ఆఫ్ మై రిజర్వేషన్ ప్రాబ్లమ్ తో నాకు సీట్ రాలేదు. సీట్ రాకుంటే… అప్పుడు బికాం తీసుకున్నాను. నేను సర్దార్ పటేల్ కళాశాల, పద్మారావ్ నగర్, సికందరాబాద్ లో 3 సంవత్సరాలు అక్కడ చదువుకున్నాను. అప్పటి నుండే నాకు స్టూడెంట్స్ యూనియన్ లతో పాటు, దేశం గురించి ఆలోచించడం, రకరకాల విషయాల గురించి ఆలోచించడం, అసలు ప్రజల గురించి ఆలోచించడం, గ్రామాలకు వెళ్లి, అక్కడి పరిస్థితులు చూడడం… అన్నీ రకరకాలుగా విద్యార్థి సంఘం లో ఉన్నపుడు అన్నీ తిరుగుతూ ఉండేవాణ్ణి. అక్కడ ఎలక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసేవాణ్ణి. అప్పుడు ఎలక్షన్స్ ఉండేవి కాలేజీల్లో. 1984 వరకు ఎలక్షన్స్ ఉండేవి కాలేజీల్లో. ఆ రకంగా… జాయింట్ సెక్రటరీ గా, వైస్ ప్రెసిడెంట్ గా అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ కంప్లీట్ అయి పోయింది. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యింది. కానీ… ఒక్కటి మాత్రం ఆ గ్రాడ్యుయేషన్ లో నేర్చున్నాను. ఎలా ధైర్యంగా ఉండాలి అని. 

ఎందుకంటే… ఈ ప్రపంచంలో పిరికివాళ్లు పారిపోతా ఉంటారు. ధైర్యవంతుల దగ్గర ఏమీ లేకున్నా…. ముందుకు వెళ్తా ఉంటారు. ఆ రకంగా ధైర్యం కూడా నేర్చుకున్నాను. నాకు చిన్నప్పటి నుండి కూడా, కొత్త, కొత్త విషయాల గురించి ఆలోచించడం, కొత్త, కొత్త పద్ధతులు ఆలోచించడం, ఉన్న పద్ధతికి కాస్త డిఫరెంట్ గా చేస్తే ఎలా ఉంటుంది అని చూడడం, దాంతోపాటు గా నా వీక్నెస్… ఫ్రెండ్స్ అంటే నాకు చాలా వీక్నెస్. నా ఫ్రెండ్సే నా స్ట్రెంత్ కూడా. ఫ్రెండ్షిప్ చేయడం, వాళ్లతో పాటు తిరగడం, కొత్త, కొత్త విషయాలు చేయడం, ప్రయాణాలు చేయడం, దూర-దూర ప్రయాణాలు చేయడం ఇవ్వన్నీ కూడా చిన్నప్పటి నుండి నాకు అలవాటే. కానీ… పేదరికం తో ఏది చేయాలన్నా కష్టంగా ఉండేది. 


మరి ఏం చెయ్యాలి…? 

డిగ్రీలో ఉన్నప్పటి నుండే… నేను సర్దార్ పటేల్ కాలేజీ నుండి సికింద్రాబాద్ స్టేషన్ లో దిగి, అక్కడి నుండి మళ్లీ మెహదీ పట్నం వెళ్లే వాణ్ని. అక్కడ ఉండేటప్పుడు ఫ్రెండ్స్ అందరం కలుస్తుంటిమి. అక్కడ మాకు సుదర్శన్ రాజ్ అని, ఆప్టికల్ షాప్ అతను ఒక చక్కని ఫ్రెండ్ అయ్యారు. మేము కాలేజీ నుండి అక్కడికి వచ్చి, గంటా, గంటన్నర అక్కడ కూర్చుని వెళ్లిపోయే వాళ్లం. అయితే… డబ్బులు ఉండేవి కావు ఎవరి దగ్గర. ఎవరి దగ్గర డబ్బులు ఉండేవి కావు… ఎలా… ఎలా… అనుకున్నప్పుడు, ఆకలి బాగా వేసేది. అప్పుడన్ని హాస్టల్స్ అలాంటివన్నీ ఉండేది కాదు. అప్పుడు అందరం కలెక్ట్ చేసి, ఒకరోజు నన్ను దోశలు తీసుకు రమ్మన్నారు, ఒక్కో రోజు ఒకరి వంతు. నేను దోశలు తీసుకు రావడానికి, 'పద్మజ' అని ఒక హోటల్ ఉండేది, ఇప్పుడుందో లేదో నాకు తెలియదు, అక్కడికి వెళ్లి… 100 రూపాయల నోటు ఇస్తే… కొన్ని దోశలు ఇచ్చేసి, మిగతాది చేంజ్ లేదు అని చిన్న స్లిప్ మీద రాసిచ్చారు అతను, ఎందుకంటే… మిగతావి తర్వాత తీసుకోవాలని. నాకు చేంజ్ కావాలంటే… నేను మళ్లీ ఎప్పుడొస్తానో తెలియదు, నాకు చేంజ్ కావాలండి… అన్నాను. సార్ చేంజ్ లేదు, తర్వాత తీసుకో అన్నాడు అతను, నాకు చేంజ్ కావాలండి అన్నాను అతనితో. అప్పుడంత ప్రాబ్లం ఉండేది చిల్లర గురించి, ఆ ఇయర్ లో 1977, 78, 79 లో విపరీతమైన ప్రాబ్లం ఉండేది. చేంజ్ గురించి అతని దగ్గర గట్టిగా కొట్లాడిన… ఎందుకంటే, ప్రశ్నించే తత్వం నాకు మొదటి నుండీ ఉండేది. ఎందుకివ్వరండి చేంజ్, మళ్లీ వస్తామో, రామో చేంజ్ ఇవ్వండి అన్నాను. 

ఎప్పుడైనా రండి సార్ అని ఒక కాగితం ముక్క మీద రాసిచ్చారు… డబ్బు ఎంతో అని. సార్ చేంజ్ తెస్తే… ఏం చేస్తారు? అన్నాను. 

మీరు చేంజ్ తీసుకొస్తే… దోశలు ఇస్తాను, ఇడ్లీలు ఇస్తాను, మీకు డబ్బులు కూడా ఇస్తాను అన్నాడు. 

ఓహో… ఇడ్లి, దోశలు ఇస్తారా… డబ్బులు కూడా ఇస్తారా… అయితే, ఒక పని చేస్తాను అని, ఎక్కడ చేంజ్ దొరుకుందంటే… నేను రోజూ మెహదీ పట్నం వెళ్తున్నపుడు వయా రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా మీదుగా… అలా సికింద్రాబాద్ వచ్చే వాణ్ని, రిజర్వ్ బాంక్ దగ్గర పెద్ద లైన్ ఉండేది… ఏం లైన్ అని వెరిఫై చేస్తే… చేంజ్ కోసం అలా నిలబడే వాళ్లు. 2, 3 గంటలు నిలబడితే… చేంజ్ ఇచ్చేది. ఆ రకంగా, నేను మార్నింగే వెళ్లి అక్కడ నిలబడి, చేంజ్ తీసుకొని హోటల్ లో మారుస్తూ… ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆ రకంగా నా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయడం జరిగింది. 


అదే రకంగా ఇంకో కొత్త ఇన్వెన్షన్ చేసాను… అదెవరికీ చెప్పే విషయం కాదు… అక్కడ గణేష్ టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ ముందు బోలెడు మంది బిక్షగాళ్లు ఉండేవాళ్లు. వాళ్ల దగ్గర బోల్డంత చేంజ్ ఉండేది. కానీ, వాళ్లకు ఏం చెయ్యాలో తెలియదు. నేను వాళ్లకు డబ్బులు ఇచ్చి చేంజ్ తీసుకునే వాణ్ని. 

ఇప్పుడేం చెయ్యాలి…?

నేను ఆంధ్రా ఏరియా కు రిప్రజెంటేటివ్ ను, నా స్నేహితుడు ఒకరు రవిగారు అని, హీ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ రిప్రజెంటేటివ్, ఇంకో అతను రాయలసీమ రిప్రజెంటేటివ్ ఉండేది. ముగ్గురం కలిసి ఏం చేద్దాం… అని, వై కాంట్ వి స్టార్ట్ అవర్ ఓన్ ఇండస్ట్రీ…? డబ్బులు లేవు, కానీ… స్టార్ట్ చెయ్యాలి? ఏం చేసాము… అప్పుడు, రాజీవ్ కాలనీ దగ్గర బాలా నగర్ లో వెళ్లి, ఫ్యాన్స్ అన్నీ కొనుక్కుని, చక్కగా బ్రాండ్ వేయించెసి అమ్మడం. మేం తయారు చేయించేస్తే… 

చాలా కష్టం అండీ, తయారు చేయడం. 

అమ్మడం… 

అమ్మడంలో మేం నెంబర్ వన్, తయారు చేయడం అంటే కష్టం కానీ… ఆ రకంగా చేసాం. కమాండర్ బ్రాండ్ పెట్టి, ఫ్యాన్స్, కూలర్స్, స్టాబిలైజర్స్ బాగా అమ్మామండి. అమ్ముతుంటే… అమ్ముతుంటే… మాకు అయిపోయింది, ఇది కష్టం గదా అని చెప్పేసి, ఏమీ లేకుండా వేరే వాళ్ల బ్రాండ్ కొనుక్కోవడం, మా బ్రాండ్ వేయడం… అమ్మేయడం, అది కూడా మంచి క్వాలిటీ… ఎందుకంటే, తయారు చేసి అమ్మేవాళ్లు ఉంటారు. 

అంటే… స్మార్ట్ వర్క్, 

హార్డ్ వర్క్ కాదు. హార్డ్ వర్క్ అంటే… చెయ్యాలి, స్మార్ట్ వర్క్ అంటే… అమ్మాలి. ఆ రకంగా మేము… వి ఎర్నెడ్ ఏ గుడ్ మనీ. ఆ టైంలో నేను డబ్బు సంపాదించడం, మా వాళ్లు… మ్యారేజ్ సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. మరి ప్రైవేట్ ఎంప్లాయ్ కి పిల్లను ఇవ్వరు గదా… అప్పుడు అలాగే ఉండేది. 


మరి, అప్పుడు ఏం చెయ్యాలి… మళ్లీ కొత్త ఇన్నోవేషన్, కొత్త ఇన్వెన్షన్… ఏం చెయ్యాలి, మ్యారేజ్ కావాలి మరి. అప్పుడు, అన్ని పేపర్లలో… కాంపిటేటివ్ ఎక్జామ్స్ గురించి చూసేది. అంత వరకు నాకు ఉద్యోగం చేయాలని లేకుండే. ఎందుకంటే… వ్యాపారం ద్వారానే, ఆంత్ర ప్రినర్ షిప్ ద్వారానే మనిషి పైకి వస్తాడు, ఉద్యోగం చేస్తే… పైకి రాడు అని నాకు ఓ నమ్మకం. అప్పుడూ… ఇప్పుడూ… అంతే నాకు. ఎందుకోసం అంటే… ఫర్ ఎక్జాంఫుల్, ఉద్యోగం చేస్తే… నెలకు లక్ష రూపాయలు సాలరీ తీసావ్ అనుకో… లక్ష… పెద్దగా… ఫర్ ఎక్జాంఫుల్ తీసావ్ అనుకుందాం… సంవత్సరానికి ఎంత? 12 లక్షలు అనుకో… ఎన్ని ఏళ్లు పని చేస్తావ్? ఓ 30 ఏళ్లు అంటే… ఓ 3 కోట్లు… అంటే… నీ లైఫ్ మొత్తం… 3 కోట్లేనా? నీ బ్రతుకు మొత్తం 3 కోట్లేనా? నేను లక్ష జీతం అని చాలా ఎక్కువ చెప్పాను. ఓకే. 50 వేలు, 30 వేలు, 20 వేలు, 10 వేలకి పని చేసే వాళ్లున్నారు. 

Self-experience of Gampa Nageshwar Rao


నేను ఏమనుకుంటానో తెలుసా? 

మన మైండ్ మనం వాడుకుంటే… నువ్వు అనుకున్నది సాధిస్తావ్… నీ మైండ్ నువ్వు వాడుకోకుంటే… మైండ్ ఉన్నోడు నిన్ను వాడుకుంటారు. మైండ్ ఉన్నోడు నిన్ను వాడుకుంటాడు కాబట్టి… నువ్వు లేబర్ వి అవుతావు, మైండ్ ఉన్నోడు నీకు లీడర్ అవుతాడు. 

ఎప్పుడు కూడా… ఆంత్ర ప్రినర్స్ గా, తన కాళ్ల మీద తను నిలబడి, చిన్న బజ్జీల బండి పెట్టినా… చిన్న సమోసాల బండి పెట్టినా… చిన్న ఇడ్లీ బండి పెట్టినా… న్యాయంగా, ధర్మంగా మనం ఏ పని చేసినా మనం హ్యాపీగా బ్రతుకవచ్చు. 


కానీ… ఎవడి దగ్గరనో, బానిస లాగా పని చేయడం నాకు ఇష్టం లేకుండే. అందుకోసం ఏం చెయ్యాలి… తప్పదు కాబట్టి, పెళ్లి కోసం… అన్ని కాంపిటేటివ్ ఎక్జామ్స్ రాసేసి, అప్పుడు… LIC ఆఫ్ ఇండియా, గొప్ప సంస్థ అండీ, నాకు దాంట్లో… డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉద్యోగం దొరికిందండీ. 

అదేంటో… మీకు చెప్తుంటాను గదా… ఆకాశం వైపు నీకు ఏం కావాలని అడిగితే… భగవంతుడు నీకు అదే ఇస్తాడు, కానీ… అడగడం లో నీకు డౌట్ ఉండొద్దు. అడగడం లో సందేహం ఉండొద్దు. ఎటువంటి జాబ్ తెలుసా? నువ్వు 10 నుండి 5 వరకు కూర్చునే జాబ్ కాదు, నువ్వు తిరుగు… ఎంత తిరిగితే… అంత డబ్బు వస్తుంది. ఎంత తిరిగితే...అన్ని డబ్బులు వస్తాయి. ఎంత తిరిగితే… అంత హ్యాపీగా ఉంటది. తిరుగుట్ల నేను నెంబర్ వన్. అప్పుడు నెంబర్ వన్ అండీ… బిజినెస్ బాగా చేసేవాణ్ణి. ఒక కంపల్సరీ గా 10 నుండి 5 కూర్చునేది ఏమీ లేదు కాబట్టి… పఠాన్ చెరువు నుండి మొదలుపెట్టి, దిల్ సుఖ్ నగర్ వరకు తిరిగేవాణ్ణి ప్రతీ రోజు. స్కూటర్ నెంబర్ ప్లేట్ కూడా కనిపించేది కాదు, అంటే ఊడిపోయేది కాదండీ… నెంబర్ ప్లేట్ అంత దుమ్ము పడేది తిరగడం వల్ల… అలా కష్ట పడ్డాను. నేను నెంబర్ వన్ అండీ… ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేనే నెంబర్ వన్ అండీ ఇన్ ది బ్రాంచ్. అద్భుతంగా వ్యాపారం చేస్తూ… ఎంతో మందికి, ఏజెన్సీలు ఇప్పిస్తూ… ఎంతో మంచి, మంచి లాభాలు ఆర్జిస్తూ… ఏజెన్సీల ద్వారా వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి వ్యాపారం చేస్తూ… చేస్తూ… అద్భుతంగా సంపాదించుకున్నాను నేను. LIC ఆఫ్ ఇండియా… అమ్మ నాకు. LIC అంటే అంత పెద్ద సంస్థ. కారు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి. పెళ్లి కూడా అయిపోయింది. ఎందుకు? దాని కోసమే ఇదంతా… చేసుకున్నాను కాబట్టి, 1987 డిసెంబర్ లో మ్యారేజ్ కూడా అయిపోయింది. దాని తర్వాత అందరం కలిసి పని చేయడం, రకరకాల వృత్తులు… దీంట్లోనే, అలిచించుకోవడం. ఒకటే కాన్సెంట్రేషన్. ఎందుకంటే… ఏదయినా పని చేస్తే… దాని మీదనే ఉండాలి కాన్సెంట్రేషన్ అంతా… అలా చేసేవాణ్ణి.


1991 లో నాకు ఒక ఆర్గనైజేషన్ పరిచయం అయింది. పరిచేయం అయిన ఆర్గనైజేషన్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. దాంట్లో నేను ఒక మెంబర్ గా చేరాను. దానితో నాకు ఇంకో ఆర్గనైజేషన్ పరిచయం అయిందండీ. జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్… JCI. అక్కడ ఏముంటుంది తెలుసా? పబ్లిక్ స్పీకింగ్ ఎలా నేర్చుకోవాలి? ఎక్కడ ఏ సంస్థలు అయినా… 8 వేలు, 9 వేలు, 10 వేలు, 15 వేలు తీసుకుంటారండి. కానీ… అక్కడ ఉచితంగా నేర్పిస్తారు. టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 


మే - 1, 2, 3 - 1995, ఐ కాంట్ ఫార్గెట్ ద డేట్, అక్కడ ట్రేన్ ద డే వర్క్ షాప్ లో నేను నేర్చుకున్నపుడు, అక్కడ మాకు ఫ్రెడ్రిక్ డెకర్ అని గోవా నుండి ఒక కోచ్ వచ్చాడండి… బికాజ్ దిస్ ఈజ్ టర్నింగ్ పాయింట్ కాబట్టి, చెప్తున్నాను… 

ఆయన ఏం అన్నాడంటే… ఆప్ కో భాషా చాహీయే? భావనా చాహీయే? అన్నాడు. 

చెప్పండి సార్ అని అడిగాను. 

భాషా కో... న దేఖో, భావనా కో… దేఖో, యూ మస్ట్ షో యువర్ ఫీలింగ్స్ అండ్ ద నాలెడ్జ్ విత్ ద స్పీచ్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాడండి. DONE.

నేను తెలుగులో మాట్లాడడం మొదలు పెట్టాను. అందరూ… తేరే కో యే నహీ ఆతా రే, వో నహీ ఆతా రే, ఇంగ్లీష్ లో కూడా అన్నారు. అలా అన్న వాళ్లంతా వెనకబడ్డారు. ఆయామ్ ద నెంబర్ వన్ స్పీకర్… నెంబర్ వన్. 

నా ప్రెసిడెంట్ షిప్ అయిపోయాక, 1996 లో, చొక్కా వెంకటరమణ సార్ పరిచయం కావడంతో… సార్ ఏం చేద్దాం సార్, అని అడిగాను. అప్పుడు పేపర్ వాళ్లకు యాడ్ ఇచ్చాము, మేము ఉచితంగా వ్యక్తిత్వ వికాసం నేర్పిస్తాం, ఉద్యోగం కూడా చూపిస్తాం అని ధైర్యంతో… అప్పుడు 40 మంది వచారండి మా దగ్గరకు. 40 మందికి, రోజూ… 1 గంట, 2 గంటలు, 3 గంటలు ట్రేనింగ్ ఇచ్చాము. 3 మంత్స్ తర్వాత 40 మందిలో 32 మందికి ఉద్యోగాలు వచ్చాయండి… అప్పుడు ఆంప్రో బిస్కట్, ఆస్వా బిస్కట్ సమ్ థింగ్ కంపెనీలు ఏవో ఉండేవి. వాళ్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా 8 మంది సార్ వి వాంట్ టు కంటిన్యూ అవర్ ఎడ్యుకేషన్, బట్ వి హ్యావ్ బెనిఫిటెడ్ అని ఒక అబ్బాయి మాట్లాడుతూ చెప్పాడు. 


వాలిడిక్టరీ సెరెమనీకి ఆ రోజు రమణాచారి గారు వచ్చారు. రమణాచారి సార్ గారు, మాట్లాడుతూ… సార్, 30 రోజుల్లో… హ్యావ్ బీన్ ఇంపాక్టెడ్ (IMPACTED) లైక్ ఎనీ థింగ్ అన్నారు. IMPACTED LIKE ANYTHING… అప్పుడు ఏమైంది… "IMPACT"… అని, ఒక "IMPACT" అనే సంస్థ అక్కడ అప్పుడు పెట్టడం జరిగింది. 

టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా స్టార్ట్ చేసి, అదే… సిటీ సెంట్రల్ లైబ్రరీ లో అలా… అలా… చేస్తూ… చేస్తూ… 


ఇప్పుడు నేను, ధైర్యంగా, ఓపెన్ గా, ఆనందంగా చెప్పగలను… 


మా IMPACT కి అటెండ్ అయిన స్టూడెంట్స్… 24 మంది IAS లు ఉన్నారు, 18 మంది IPS లు ఉన్నారు. మాములుగా కాదండీ… ఓ 200 మంది జడ్జీలు ఉన్నారు. ఆంత్ర ప్రీనర్స్… అంటే తన కాళ్ల మీద తాను నిలబడ్డ వాళ్లు వందలాది మంది ఉన్నారు. ఇండస్ట్రీలు పెట్టుకున్న వాళ్లున్నారు… అక్కడ అమెరికా లో ఉన్నారు, ఎక్కడెక్కడో… ఉన్నారు. 


డోంట్ కమ్ బ్యాక్… మాకు కావాల్సింది ఏంటంటే… సెర్వ్ ద నేషన్… గో అండ్ సెర్వ్ ద నేషన్… 10 మందికి సెర్వ్ చేస్తా ఉండు. అందుకోసం, ఒక పాలసీ తయారు చేసుకున్నా… నా లైఫ్ లో 8+8+8… మరిచి పోకండి. 8 గంటలు పడుకోవాలి. 8 గంటలు నీ వృత్తి కోసం పని చెయ్యు. మిగతా 8 గంటలు, నువ్వు తింటావా… ఏం చేస్తావో కానీ… సమాజం కోసం మాత్రం ఒక 4 గంటలు పని చెయ్యు బాస్… ఒక 3 గంటలు పని చెయ్యు, ఒక 2 గంటలు పని చెయ్యు, ఎట్ లీస్ట్... ఒక, వన్ అవర్ గివ్ బ్యాక్ టు సొసైటీ. 


అప్పుడు ఏం అయింది తెలుసా?...

ఏం వచ్చినా, మనకు సొసైటీ నుండే వస్తది కదా ! యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ. ఆ రకంగా… నడిపిస్తూ… ఈ రోజు వరకు, ఒక కోటి మంది కంటే ఎక్కువగా డైరెక్ట్ గా చెప్పడం జరిగింది, IMPACT ద్వారా ఉచితంగా. దె విల్ నాట్ చార్జ్ … టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.


భగవంతుడు మనల్ని ఎలా పుట్టించాడు తెలుసా? 


ఒక పెద్ద పోటీలో పుట్టించాడు బాస్… సార్… కాంపిటేటివ్ ఎక్జాం సార్… 10 లక్షల మంది రాస్తారు, 7 లక్షల మంది రాస్తారు, 5 లక్షల మంది రాస్తారు… ఏం రాస్తారండి? అదే పెద్ద కాంపిటీషన్ అనుకుంటున్నారా? కాంపిటీషన్ కాదు… ఎందుకో తెలుసా? 

భగవంతుడు మనల్ని పుట్టించేటప్పుడే… స్పెర్మ్ సెల్స్ రూపంలో… అమ్మ కడుపులోకి వచ్చాము. కొన్ని కోట్లాది కణాలుగా… వచ్చాము. ఒక్కటే గెలిచింది… అన్నీ చనిపోయాయి. అంటే… మనం పుడుతున్నపుడే… గెలిచాం. 


ఒక కన్ను చూసుకోండి… ఎంత పవర్ ఫుల్. 523 మెగా పిక్సల్స్ కన్నా ఎక్కువ ఉంటదంట. ఇంకా… వన్ ప్లస్ వన ఆఫర్… రికార్డింగ్, జూమింగ్, కలర్ రికార్డింగ్, వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్, టోటల్ స్టోరేజ్… ఎన్ని గిగా బైట్స్ కావాలండి? ఎన్ని టీ బీ లు కావాలండి? 


ఎంత పవర్ ఫుల్ బాడీ ఇస్తే… నాకు ఏం లేదు అని ఎందుకు అంటావ్ బాస్? ఉన్నది. నువ్వు అనుకుంటే… ఏమైనా సాధించగలవ్. దానికోసమే… నేను "నా కథ" లాగా ఏం చెప్తున్నాను అంటే… యూ కెన్ డూ బెటర్ దెన్ మీ… యూ కెన్ డూ బెటర్ దెన్ ఎవరీబడీ.


ఫ్రెండ్స్…

ఈ ప్రయాణంలో నా మనసుకు తగిలిన గాయాలు కూడా ఉన్నాయి బాస్… 


ఒకటవది... 

నన్ను కలచివేసిన సంఘటన… మా అమ్మ-నాన్నలను ఫ్లయిట్ ఎక్కించలేక పోయాను. వాళ్లను యాత్రలకు పంపాలనుకున్నాను, కానీ… అప్పుడు నా ఫైనాన్సియల్ పొజిషన్… స్టార్టింగ్ లో కాబట్టి సరిపోలేదు. ఇప్పుడు మాత్రం… ఎక్కడో పంపించే వాణ్ని. సో… మిత్రులారా… అమ్మా నాన్నల్ని పూజించండి. పూజించిన వాళ్లు ఈ ప్రపంచంలో… ఎవరు కూడా చెడిపోరు. దయచేసి నాలాంటి తప్పు చేయకండి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకోండి. ఎక్కడి నుండో… ఇక్కడికి వచ్చినవాళ్లు… వాళ్లు మనకంటే ముందుగా డెవలప్ అవుతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్లు ప్రతీ రోజు ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు… అమ్మా, నాన్నల కాళ్లకు నమస్కారం పెట్టి వెళ్తా ఉంటారు. అటువంటి వాళ్లు, గొప్పవాళ్లు అవుతారు. 


ఐ లాస్ట్ మై పేరెంట్స్… ఐ కుడెంట్ రిపేర్ ఇట్. కాబట్టి, ఆ తప్పు మీరు చేయకండి…!


రెండవది… 

నేను ఎప్పుడైతే… వ్యక్తిత్వ వికాసాన్ని ఉచితంగా పంచిపెట్టడం మొదలు పెట్టానో… నాకు శత్రువులు మొదలయ్యారండి. ఎంత శత్రువులు తెలుసా? 


గంపా… 

నువ్వు ఉచితంగా చెబితే… మమ్మల్ని ఇంకా ఫ్యూచర్ లో ఎవరు పిలుస్తారు? మమ్మల్ని ఏం చేయమంటావ్? అని నామీద ఫేస్ బుక్ లో రకరాలుగా కామెంట్స్, రకరకాలుగా మనసుకు బాధ పెట్టే… ఎన్నో కామెంట్స్ చేసారండి. అయితే… నేను ఏం చేసానో తెలుసా? ఆ కామెంట్స్ ని కూడా లైక్ చేసేవాణ్ణి. ఆ కామెంట్స్ క్రింద నేను కూడా కామెంట్ చేసేది. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ క్రిటిసిజమ్ అని పెట్టేవాణ్ణి. 


కాబట్టి, మిత్రులారా… ఇలా ముందుకు వెళ్లలేక, ఎంతో మందిని ఆపుతూ ఉంటారు. వాళ్లు ఆపారు కానీ… నన్ను ఆపిన వాళ్లే, తర్వాత మళ్లీ వాళ్లు నా సపోర్ట్ తీసుకొని, వాళ్ల లైఫ్ లో తిరిగి వచ్చారు. 


ఇంకొక్కటి నా సంఘటన… 


మూడవది… నాకు లైఫ్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నప్పుడు, అక్కడ మేన్ అప్ అండ్ డౌన్ జరిగింది. నా లైఫ్ లో… మా అబ్బాయి, వారు పుడుతున్నపుడు కొద్దిగా ప్రాబ్లమ్ తో పుట్టడం జరిగింది… చాలా బాధ పడ్డాను… ఎందుకిలా జరుగుతుందని… అప్పుడు అనుకోకుండా, ఒక మహానుభావుడు నాకు చెప్పాడు… 


గంపా…! 

నీకు ఇలాంటి వాడు, ఇలాంటి అబ్బాయి ఎందుకు పుట్టాడో… తెలుసా? ఆ భగవంతుడు ఇటువంటి అబ్బాయిని బాగా చూసుకుంటావని నీకు ఇచ్చాడు. కాబట్టి, ఆ భగవంతుడికి థాంక్స్ చెప్పమని చెప్పారు. 


కాబట్టి, ఫ్రెండ్స్… 

ఏదైనా నిరాశ పడకండి. ఆవేదన పడకండి. ఏది వచ్చినా… మంచే ఉంటుంది. ఎటువంటి పరిస్థితిని అయినా… స్థితప్రజ్ఞతతో తీసుకుంటే… సక్సెస్ గ్యారంటీ బాస్. సక్సెస్ 100% గ్యారంటీ. 


సో… 

"ఇదీ నా చిన్న కథ" థాంక్ యూ వెరీ మచ్…!!!

జై హింద్… జై భారత్… వందేమాతరం… !!! 


-గంపా నాగేశ్వర్ రావు

(మాస్టర్ మోటివేటర్ - సైకాలజిస్ట్)

(IMPACT FOUNDATION) వారి సౌజన్యంతో… 


మూలం : - 

hmtv self help యూ ట్యూబ్ ఛానల్

Watch video on hmtv self help


Self-experience of Gampa Nageshwar Rao
Also read:-

General knowledge:-


Every day science:-


Do you know:-


Gk trick:-


Health:-


Life skills:-


Personal development:-

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT