హృదయం పదిలం
![]() |
human heart |
ప్రతి ఏడాది సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటుంటారు. ఈ రోజు కార్డియోవాస్క్యులర్ వ్యాధులు (సీవీడీ) పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుండె వ్యాధులు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే నెంబర్ 1 కిల్లర్ గా సీవీడీ నిలుస్తుంది. ఈ సీవీడీ కారణంగానే ప్రతి సంవత్సరం 18.6 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి. భారతదేశంలో కూడా అత్యధిక సంఖ్యలో మరణాలకు ఇదే కారణం. ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ సంక్షోభంకు అనుగుణంగా ప్రపంచ | హృదయ దినోత్సవ నేపథ్యాన్ని 'యూజ్ హార్ట్ టు కనెక్ట్ గా తీసుకున్నారు. ప్రస్తుతం కుటుంబాలు, వ్యక్తులు అనుసరిస్తున్న జీవనశైలి సమీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రమాదకరమైన వ్యాధుల ప్రభావాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గుండె ఆరోగ్యం కోసం ఆరోగ్యవంతమైన జీవనశైలి ఎంపిక చేసుకోవాలి.
రోజువారీ ఆహారంలో గుప్పెడు బాదములను జోడించి దీన్ని ఆరంభించండి. బాదములలో విభిన్నమైన పోషకాలు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఆరోగ్యవంతమైన స్నాక్ గానూ నిలుస్తాయి. సుప్రసిద్ధ బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మాట్లాడుతూ "చక్కటి ఆరోగ్యానికి పౌష్టికాహారం అత్యంత కీలకం. మీతో పాటుగా మీ కుటుంబ ఆరోగ్యం కూడా బాగుండాలంటే తగిన ప్రయత్నం చేయాలి. అయితే దీనికి మీ డైట్, జీవన శైలిలో చేసే మార్పులు అత్యంత కీలకంగా నిలుస్తాయి. భారతదేశవ్యాప్తంగా అనేక కుటుంబాలలో సీవీడీ సమస్యలు పెరుగుతున్నాయి. వీటిని నివారించాలంటే ప్రై. ప్రాసెస్ట్ పదార్థాలకు బదులు ఆరోగ్యవంత మైన డ్రై, సాల్టెడ్, ఫ్లేవర్డ్బాదము లను తీసుకోవడం మంచిది. బాదములలో విటమిన్ ఈ, మెగ్నీషియం, ప్రొటీన్, రిబోఫ్లావిన్, జింక్ మొదలైన పోషకాలు ఉన్నాయి. పరిశోధనలు సూచించే దాని ప్రకారం క్రమం తప్పకుండా బాదములు తీసుకుంటే హానికరమైన ఎల్డీఎల్కొ లెస్ట్రాల్ స్థాయి తగ్గడంతో పాటుగా గుండె ఆరోగ్యం కాపాడే హెడీఎల్కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అంతేకాదు టైప్ 2 మధుమేహంతో బాధపడే వారికి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే వాపులను సైతం తగ్గించడంలో బాదములు సహాయపడతాయి" అని అన్నారు. న్యూట్రిషన్, వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ “భారతదేశంలో అత్యధిక సంఖ్యలో మరణాలకు కారణమవుతున్నవికార్డియో వాస్క్యులర్ వ్యాధులు. దీనికి తోడు మహమ్మారి కారణంగా నిశ్చల జీవనశైలి పెరిగింది. సుదీర్ఘకాలం పాటు కదలకుండా పని చేయడమూ పెరిగింది. వర్చ్యువల్ గా ఎక్కువగా ఆధారపడుతున్నారు. అలాగే అనారోగ్యకరమైన స్నాకింగ్, అస్సలు వ్యాయామాలు చేయకపోవడం లేదా తక్కువగా దోహదపడుతున్నాయి. ఈ వ్యాయామాలు చేయడం వంటివి మనవాళ్ళు సీవీడీ బారిన నేపథ్యంలో తమ జీవనశైలి ప్రాధాన్యతలను పునః సమీక్షించుకోవడంతో పాటుగా తగిన మార్పులను చేసుకోవాలి.
ఆరోగ్యవంతమైన డైట్ లో బాదములను భాగం చేసుకోవాలి. ఇది సీవీడీ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బాదములతో డిస్లిపిడిమియా నియంత్రణలో ఉంచుకోవడమూ సాధ్యమవుతుంది. అత్యధిక ఎల్డీఎల్ కొలెస్ట్రాల్, ట్రై గ్లిసరైడ్ స్థాయిలు, అతి తక్కువ హెడీఎల్కొ లెస్ట్రాల్ స్థాయికి ప్రతీకగా డిస్లిపిడిమియా నిలుస్తుంది" అని అన్నారు. అందువల్ల ఈ ప్రపంచ హృదయ దినోత్సవ వేళ ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవనశైలిని అనుసరించడానికి ప్రతిజ్ఞ చేయండి. అదే సమయంలో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీ ప్రియమైన వారు కూడా అనుసరించేలా ప్రోత్సహించండి.