-->

ఎక్కువ సేపు మాస్క్ వాడుతున్నారా | Have been using the mask for a long time | prudhviinfo

Have been using the mask for a long time

  

ఎక్కువ సేపు మాస్క్ వాడుతున్నారా


వ్యాక్సినేషన్, కొవిడ్ గైడ్ లైన్స్ పాటించడం కరీనా నుంచి రక్షించుకునే మార్గాలు. అన్నీ బాగానే  ఉన్నా.. ఎక్కువ కాలం మాస్కులు తొడగడం వల్ల  ఇబ్బందులు వస్తున్నాయనే కంప్లయింట్స్ ఈ మధ్య  పెరుగుతున్నట్టు డాక్టర్ల రిపోర్టులు చెబుతున్నాయి. అయితే మాస్క్ తప్పకుండా వాడాలి. కానీ, కొన్ని జాగ్రత్తలతో వాడితే ఈ సమస్యలను తప్పించుకోవచ్చంటున్నారు ఎక్స్పర్ట్స్, మాస్క్ ఎక్కువ సేపు వాడటం వల్ల తలనొప్పి, డీహైడ్రేషన్, అసౌకర్యం, అలర్జీవంటి వాటి బారిన  పడుతున్నామని చాలామంది చెబుతున్నారు. వాటికి  కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలంటున్నారు డాక్టర్లు. టైట్ గా ఉన్న మాస్క్ పెట్టుకోవద్దు. టైట్  మాస్కులు చెవిదగ్గర నరాలను ఇబ్బంది  పెడతాయి. దాని వల్ల తలనొప్పి వచ్చే అవకాశముంది.

  •  ఎక్కువకాలం మాస్క్ ధరించడం వల్ల టెంపోరోమ్యాండిబ్యులర్ జాయింట్ (టీఎంజేతలలో రెండు చెవుల మధ్య ఉండే జాయింట్) లో నొప్పి పుడుతుంది. ఈ జాయింట్ తోనే దవడ కదులుతుంది. చెవుల దగ్గర నరాలు టైట్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఈ జాయింటే. దాంతో తలనొప్పి వస్తుంది.
  •  మాస్క్ పెట్టుకొని గంటలు గంటలు ఉంచుకోవద్దు. అప్పుడప్పుడు నోరు తెరుస్తుండాలి. నెమ్మదిగా నోటిని తెరుస్తూ, మూస్తూ చిన్నపాటి మౌత్ ఎక్సర్ సైజ్ లా చేయాలి. .మాస్క్ వాడుతున్నరా 
  •  జలుబు, దగ్గు, ఆస్తమా, అలర్జీలు, స్కిన్ అలర్జీలు ఉన్న వాళ్లకి మాస్క్ పెట్టుకోవడం కొంత కష్టంగా ఉంటుంది. వాళ్లు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ పెట్టుకున్నా దవడలు, నోటికి పని చెప్పాలి. అప్పుడప్పుడు దవడల్ని  కదిలిస్తుండాలి. సర్జికల్ మాస్క్లు  పెట్టుకొని బయటకు వెళ్తే ఇంటికొచ్చాక వాటిని పారేయాలి. మళ్లీ మళ్లీ వాడొద్దు. వాటి మీద ఎక్కువ దుమ్ము, ధూళి పేరుకు పోయే ప్రమాదం ఉంది.


Also read:-

General knowledge:-


Every day science:-


Do you know:-


Gk trick:-


Health:-


Life skills:-


Personal development:-

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT