-->

బరువు తగ్గాలా ఇవి తినండి || Eat these to lose weight || || prudhviinfo

Eat these to lose weight


బరువు తగ్గాలా. ఇవి తినండి!

బరువు తగ్గాలంటే నోరు కట్టేసుకోవడం ఒకటే మార్గం అనుకుంటారు చాలామంది. కానీ ఈ పదార్థాలు తింటే కూడా అది సాధ్యమే అంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటంటే.... 

 బ్లాక్ బీన్స్... 

వీటిలో బోలెడు పీచు ఉంటుంది. వీటిని తింటే పొట్ట నిండిన భావన కలిగి చాలా సేపటి వరకు ఆకలి వేయదు. ఈ బీన్స్ హానికారక ఎల్‌డీఎల్కొ లెస్ట్రాల్‌ను అయిదు శాతం తగ్గిస్తాయట.

 మిరియాలు...

 వీటిలోని పెప రైన్ అనే పదార్ధం కొత్త కొవ్వు కణాలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్, పొట్టా రెండింటినీ తగ్గిస్తుంది.

బెల్ పెప్పర్...

విటమిన్‌ సి దండిగా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడంలో సాయపడి పిండి పదార్థాలను శక్తిగా మారుస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది.

 కొబ్బరి నూనె..

 దీనిలోని కొవ్వులు బరువును నియంత్రిస్తాయి. ఈ నూనెను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు. ఆరోగ్యమూ బాగుంటుంది. పాలకూర... ఐరన్ అధికంగా ఉండే ఈ ఆకుకూరను గుడ్డుతో కలిపి ఆమ్లెట్తీ సుకుని చూడండి పోషకాలు అందుతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. మరింకేం వీటిని ప్రయత్నించి చూడండి.

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT