-->

సైబర్ సెక్యూరిటీ | Cyber Security | prudhviinfo

Cyber Security:-

 సైబర్ సెక్యూరిటీ రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాటు దాని దుష్ప్రభావాలు సైతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలపై వేధింపులు, సైబర్ నేరాలు పెరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్బ్యూ రో గణాంకాలు వెల్లడించాయి. కాబట్టి సైబర్ సెక్యూరిటీ పై యువతులు, మహిళలు అవగాహన పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు.

ఉచిత వైఫై

free wifi


ఇతర ఓపెన్ నెట్ వర్క్ ల ద్వారా ఇంటర్నెట్ఉ పయోగించి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలకు లాగ్ ఇన్ కావద్దు. వీటి ద్వారా నేరగాళ్లు వ్యక్తుల అకౌంట్, పాస్ వర్డ్స్ ను హ్యకింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎలాంటి అవసరాలకైనా సెక్యూరిటీ కోడ్, సేఫ్టీ ఎక్కువగా ఉండే వైఫై నెట్ వర్క్ లనే ఉపయోగించాలి. సైబర్ నేరస్తులు ఫొటోలను వివిధ రకాలుగా దుర్వినియోగం చేస్తున్నారు. వీటిని పోర్న్ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారు. వారికి తెలియకుండానే కొంతమంది ఈ ఫొటోలను కొన్ని డార్క్ వెబ్ సైట్లకు అమ్ముకుంటున్నారు. అందువల్ల సోషల్ నెట్వర్క్ సైట్లలో మహిళలు ప్రైవసీకి ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యక్తిగత ఫొటోలను ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచిది. కొంతమంది మొబైల్ ఫోన్లో తీసిన ఫొటోలను గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్ అకౌంట్లకు బ్యాకప్ చేసుకుంటారు. వీటికి బలమైన పాస్ వర్డ్ లను పెట్టుకోవడం ద్వారా హ్యాకింగ్ కు గురికాకుండా జాగ్రత్తపడవచ్చు. ప్రస్తుతం వాడుతున్న ఫోన్ను. ఇతర డివైజ్ లను ఇతరులకు అమ్మాలనుకున్నప్పుడు యాంటీ డేటా రికవరీ సొల్యూషన్‌ను ఉపయోగించాలి. దీనివల్ల డివైజ్ లలో ఇంతకు ముందు స్టోర్ చేసి డిలీట్చేసిన డేటాను రికవరీ చేయలేరు. కొన్ని రకాల సాఫ్ట్ వేర్లను ఉపయోగించి డేటా రీస్టోర్ చేసి, దాన్ని బ్లాక్ వెబ్ లో అమ్ముకుంటున్న కేసులు ఇంతకు ముందు వెలుగు చూశాయి. అందువల్ల డేటా దుర్వినియోగం కాకుండా యాంటీ డేటా రికవరీ సొల్యూషన్ ని ఉపయోగించాలి. వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు తెలుసుకోలేని విధంగా డివైజ్ లను ఎల్లప్పుడూ లాక్ చేసి ఉంచాలి. ఇప్పుడు తయారు చేస్తున్న స్మార్ట్ ఫోన్లలో ఇన్స్టిల్ట్ గానే సెక్యూరిటీ సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నారు. దీంతో పాటు ఆన్లైన్ లో డివైజ్ సెక్యూరిటీ కోసం ఎన్నో ఉచిత యాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని వాడుకోవాలి. యూజర్లు పాస్వర్డ్లను ఎప్పటికప్పుడూ మారుస్తూ ఉండాలి. దీనివల్ల ఇతరులు సులభంగా పాస్ వర్డ్స్ ను యాక్సెస్ చేయడం కష్టమవుతుంది. సోషల్ మీడియా సైట్లలో అయితే వాటి పాస్ వర్డ్ పాలసీకి అనుగుణంగా బలమైన పాస్వర్డ్లను ఉపయోగించాలి. వివిధ రకాల ఆన్లైన్ అకౌంట్ల కోసం విభిన్న పాస్వర్డ్స్ పెట్టుకోవాలి.

 అన్నింటికీ ఒకటే పాస్ వర్డ్ ను పెట్టకూడదు.

Do not put the same password on everything


- అమ్మాయిలు సోషల్ మీడియా అకౌంట్ సెట్టింగ్స్ ను పబ్లిక్ నుంచి ప్రైవేట్ కు మార్చుకోవాలి. ఆకౌంట్ సెక్యూరిటీ స్థాయులను ఎప్పటికప్పుడూ పరిశీలించుకోవాలి. యూజర్లు తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. సమాచారాన్ని పరిమితంగానే షేర్చేయాలి.

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT