-->

సివిల్స్ మెయిన్.. మెరిసేదెలా | Civil Services Examinations | prudhviinfo

civil services


 సివిల్స్ మెయిన్.. మెరిసేదెలా!

మెయిన్ పరీక్ష ఇలా

సివిల్స్ మెయిన్ పరీక్షలు జనవరి 1వ తేదీ నుంచి అయిదు రోజులపాటు జరుగనున్నాయి. మెయిన్ పరీక్షలో ఏడు తప్పనిసరి పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 250 మార్కుల చొప్పున మొత్తం 1750 మార్కులకు మెయిన్ నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి అంతిమంగా 275 మార్కు లకు ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్) ఉంటుంది. మెయిలో ప్రతి పేపరకు పరీక్ష సమయం మూడు గంటలు. మెయిన్ పరీక్షలో ఏడు తప్పనిసరి పేపర్ల తోపాటు రెండు క్వాలిఫైయింగ్ సబ్జెక్టులు ఉంటాయి. అవి.. పేపర్-1, 300 మార్కులు ఏదైనా భారతీయ భాష. పేపర్-2, 300 మార్కులు-ఇంగ్లీష్, 1750 మార్కులకు జరిగే మెయిన్ పరీక్షలో వేయి మార్కులు సాధించేలా ప్రిపరేషన్ సాగిస్తే.. చివరి\ దశ పర్సనాలిటీ టెస్ట్ (పర్సనల్ ఇంటర్వ్యూ)కు ఎంపికయ్యే అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు. 

  పేపర్ 1 జనరల్ ఎస్సే 

 జనరల్ ఎస్సేకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఇందులో అడిగేందుకు అవకాశమున్న టాపిక్ను గుర్తించాలి. సమకాలీన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతర్జాతీయ పరిణామాలు, కరోనా ప్రభావాలు,వ్యాక్సినేషన్ విధానాలు, పర్యావరణ అంశాలు, జాతీయ స్థాయిలో ఇటీవల చర్చనీయాంశంగా మారిన వాటిని అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఆ తర్వాత విశ్లేషణాత్మకంగా రాయగలిగే నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. అందుకు రైటింగ్ ప్రాక్టీస్ ఎంతో దోహదపడుతుంది. 

    పేపర్-2 జనరల్ స్టడీస్-1

  •  ఈ పేపర్ సిలబస్లో ఇండియన్ హెరిటేజ్ అండ్క ల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్సొ సైటీ అంశాలు ఉన్నాయి. 
  •  ఇందులో హిస్టరీకి సంబంధించి సంగీతం, సాహిత్యం, నాట్యం, వాస్తు-శిల్పకళ, మత ఉద్య మాలు, తత్వాలు తదితర అంశాలపై క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఈ అంశాలను ప్రాచీన, మధ్య, ఆధునిక భారత దేశ చరిత్రలకు అనుసం ధానిస్తూ చదవాలి.
  •    18వ శతాబ్దం మధ్య కాలం నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న ప్రధాన సంఘటనల్ని పరిశీ లించాలి. స్వాతంత్ర్య ఉద్యమం గురించి ప్రత్యేకంగా చదవాలి. అదే విధంగా రాజ్యాంగం, పం చవర్ష ప్రణాళికలు, భూ సంస్కరణలు, నెహ్రూ విదేశాంగ విధానం, అలీనోద్యమం, హరిత విప్లవం తదితరాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి.
  •   ప్రపంచ చరిత్రకు సంబంధించి.. పారిశ్రామిక, విప్లవం, ప్రపంచ యుద్ధాలు, ఐరోపాలో నూతన రాజ్యాల ఆవిర్భావం, ఆసియా, ఆఫ్రికా, లాటిన్అమెరికాల్లో వలసవాదం, స్వాతంత్ర్య ఉద్యమాల గురించి ప్రధానంగా చదవాలి. 
  •   భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు,  తుపానులు తదితరాల గురించి శాస్త్రీయ అవగా  హన పెంచుకోవాలి. ప్రాంతీయ అభివృద్ధికి  దోహదపడే సహజ వనరుల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.       

     పేపర్-3 జనరల్ స్టడీస్-2  

      ఈ పేపర్ సిలబస్.. ప్రజా పాలన, రాజ్యాంగం,  రాజకీయ వ్యవస్థ, సామాజిక న్యాయం, అంత  ర్జాతీయ సంబంధాల సమ్మేళనంగా ఉంది.  భారత రాజ్యాంగం గురించి చదివే క్రమంలో..  1858 భారత ప్రభుత్వ చట్టం నుంచి ప్రారం భించి 1947 భారత స్వాతంత్ర్య చట్టం వరకు అధ్యయనం చేయాలి. 1919, 1935 భారత  ప్రభుత్వ చట్టాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. 
  •   రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని అర్ధం చేసుకునేందుకు కేశవానంద భారతి, మినర్వా మిల్స్ కేసులను పరిశీలించాలి. కేంద్ర, రాష్ట్రాల మధ్యశాసన, కార్యనిర్వాహక, ఆర్థిక అధికారాల విభజన, భారత రాజకీయ వ్యవస్థలోని అర్ధసమాఖ్య స్వభావంపై దృష్టి పెట్టాలి. 73, 74  రాజ్యాంగ సవరణ చట్టాల ప్రభావాన్ని పరిశీలించాలి. ప్రభుత్వ పథకాల ఉద్దేశం, లక్ష్యం, ఫలితాలను అధ్యయనం చేయాలి. 

     పేపర్ 4 జనరల్ స్టడీస్-3 

      ఈ పేపర్ సిలబస్ లో టెక్నాలజీ, ఆర్ధికాభివృద్ధి, బయో డైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అంశాలున్నాయి. ప్రణాకా పెట్టుబడుల్లో భాగంగా ప్రభుత్వ రంగ వనరుల సమీకరణకు ఆధారాలు, వాటి ధోరణులు, వివిధ రంగాల మధ్య వసరుల పంపిణీ తదితర అంశాలను క్షణ్నంగా చదవాలి. భారత్ లో సమ్మిళిత వృద్ధి పాత్ర, ఆహార భద్రత, బడ్జెటింగ్ తీరుతెన్నులతోపాటు స్వాతంత్ర్యం తర్వాత వ్యవసాయ రంగం లో వచ్చిన మార్పులను అధ్యయనం చేయాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రగతి, దైనందిన జీవితంలోదాని అనువర్తనాలపై దృష్టిపెట్టాలి.

   పేపర్ 5 జనరల్ స్టడీస్-4

     ఈ పేపర్ సిలబస్ లో ఎథిక్స్. ఇంటిగ్రిటీ. అప్టిట్యూడ్ టాపిక్స్ఉన్నాయి. వీటిలో ఎక్కువ అంశాలు ప్రభుత్వ పాలన (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)కు సం  బంధించినవి కాగా మరికొన్ని ఫిలాసఫీ. సైకాలజీకి  చెందినవి. పరిపాలనలో నైతిక విలువల ఆవశ్యక  తకు సంబంధించిన అంశాలపై అభ్యర్థులు దృష్టిసా  రించాలి. వ్యక్తిగత, సామాజిక సంబంధాల్లో విలు  వలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో తెలుసుకోవాలి. నైతిక శాస్త్రంలో ప్రధానంగా అప్లయిడ్ ఎథిక్స్, (అనువర్తిత నైతిక శాస్త్రం) పై దృష్టిపెట్టాలి. ప్రధానంగా ' పబ్లిక్ సర్వీస్ లో ఎథిక్స్'కు సంబంధించిన అంశాలను బాగా చదవాలి. ప్రభుత్వ విధానాల అమలు, నిధుల ఖర్చు, విధుల నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకత, నైతికత ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలి. మతం-నైతికత, వర్ణ వ్యవస్థనైతికత, కుటుంబం-నైతికత.. ఇలా వివిధ సామా జిక అంశాలను, సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ చదవాలి. నైతిక విలువలు పెంపొందించడంలో కుటుంబం, సమాజం, విద్యాసంస్థల పాత్ర గురించి తెలుసుకోవాలి. దాంతోపాటు లక్ష్య సాధ నలో, విధి నిర్వహణలో ఎంతో కీలకంగా నిలిచే వైఖరి( అటిట్యూడ్) అంశాన్ని ప్రత్యేక శ్రద్ధతో అధ్యయనం చేయడం లాభిస్తుంది. 

   ఆప్షనల్.. రెండు పేపర్లు ఇలా

 ఆప్షనల్ సబ్జెక్ట్ కు సంబంధించి రెండు పేపర్లు(పేపర్ 6, పేపర్ 7) రాయాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటే.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఫిలాసఫీ, సైకాలజీ తదితర ఆప్షనల్స్.. జనరల్ స్టడీస్ కు కలిసొచ్చే విధంగా ఉన్నాయి. ఆప్షనల్ ఏదైనా సరే వాటిని ఆమూలాగ్రం అధ్యయనం చేయాలి. ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న అంశాలను గుర్తించి.. వాటిపై మరింత ఫోకస్ పెట్టాలి. గత కొన్నేళ్ల ప్రశ్న పత్రా లను పరిశీలించి.. రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ఆయా ప్రశ్నలకు లభించే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి.


🔥మెటీరియల్స్ కోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి🔥

https://chat.whatsapp.com/HbOTynErWqp33kKXpyljep


జాబ్ నోటిఫికేషన్ల కోసం ఫేస్ బుక్ లో జాయిన్ అవ్వండి. దేశంలో విడుదలవుతున్న ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఈ గ్రూపులో వస్తుంది👇

https://www.facebook.com/groups/287841976124793/?ref=share

PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT