అదేపనిగా తింటే...
ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే ఈ మధ్య పిల్లలతో
పాటు పెద్దలు కూడా వీటినే ఎక్కువగా తింటున్నారు. తెలుగులో వీటిని
ఆలూ చిప్స్ అంటారు. ఇవి ఎంత రుచిగా ఉంటాయంటే... ఒకటి, రెండు
తిని ఆపలేం.. అయితే వీటిని అధికంగా తింటే ఆరోగ్యాన్ని
| వదిలేసుకోవాల్సిందే. మృత్యువు తరుముకుంటూ వస్తుందట. ది అమెరికన్
జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ఓ అధ్యయనం ఈ విషయాన్ని
దృవీకరించింది. 4,500 మందిపై ఆ అధ్యయనం చేశారు. వారానికి
రెండుసార్లు కంటే ఎక్కువ సార్లు ఈ చిప్స్, ఫ్రెంచి ఫైల వంటివి తినే వారిలో
చనిపోయే ప్రమాదం రెట్టింపు ఉంటోందని తేల్చారు. కారణమేంటంటే.... ఆ
దుంపలను వేసేందుకు వాడే నూనెల వల్లే ప్రాణాలకు ప్రమాదమని తేల్చారు.
కడుపులో నొప్పి: పిండి పదార్థాలు, ప్రోటీన్లలతో పోలిస్తే కొవ్వులు
శరీరంలో నెమ్మదిగా జీర్ణం అవుతాయి. కొవ్వుతో ఉండే ఆలూ చిప్స్ త్వరగా
జీర్ణం కావు. జర్నల్ ఆల్ట్రాసౌండ్ ఇంటర్నేషనల్ ఓపెన్ లో రాసిన ఓ
అధ్యయనం ప్రకారం వేయించిన ఆహారాన్ని తింటే కడుపు నొప్పి వస్తుందట.
గుండెకు ప్రమాదం: మన శరీరంలో చాలా ముఖ్యమైనది గుండె. ఈ
చిప్స్ లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ చెడు కొవ్వును పెంచుతుంది.
దానివల్ల గుండెకు
రక్త సరఫరా సరిగా సాగదు. ఏదో ఒక రోజు గుండె నొప్పి వచ్చేస్తుంది. మరో
అధ్యయనం ప్రకారం రక్తంలో ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ ఉన్నవారికి అల్జీమర్స్
లేదా మతిమరపు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం 75 శాతం ఎక్కువ అని
తేలింది.
రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి: కరోనా వచ్చాక మనమంతా కష్టపడి
ఇమ్యూనిటీని పెంచుకుంటున్నాం. అలాంటి మనం ఈ ఫైలు, చిప్సూ
వంటివి తరచూ తింటే... ఇలా పెరిగిన ఇమ్యూనిటీ, అలా పోతుంది. బాడీలో
కొవ్వు చెడు బ్యాక్టీరియాను పెంచుతుంది. అది మంచి బ్యాక్టీరియాని
చంపేస్తుంది. ఫలితంగా మనకు రకరకాల రోగాలు రావడం
మొదలవుతుంది.
హార్ట్ ఎటాక్ ప్రమాదం: వేయించిన ఆహారాన్ని వారానికి 3 సార్లు లేదా
అంతకంటే ఎక్కువ సార్లు తింటే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు 7 శాతం
పెరుగుతాయని ఓ అధ్యయనంలో తేలింది. రోజూ వేయించిన ఆహారాన్ని
తింటే.... హార్ట్ ఎటాక్ అవకాశాలు 15 శాతం పెరుగుతాయట.
అధిక బరువు సమస్య: కొవ్వు బాడీలో పేరుకుపోతే బరువు
పెరుగుతారు. ఓ స్థాయి దాటితే... ఏం చేసినా బరువు తగ్గడం
కష్టమవుతుంది. ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో రాసిన
అధ్యయనం ప్రకారం వేయించిన ఆహారా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంది.
కాబట్టి ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు గానీ... తరచూ వీటిని తింటే
ప్రమాదమే. దానికి తోడు ఇలాంటివాటికి షాపులు, సూపర్ మార్కెట్లలో
ఆఫర్లు ఎక్కువ ఉంటాయి. ఒకటికి ఒకటి ఫ్రీ అని ఇస్తుంటారు. అయినా సరే
మనం వల్లో పడకుండా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కంట్రోల్ చేసుకోవాలి
అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.