-->

నువ్వులు | Sesame seed | prudhviinfo

Sesame seed


నువ్వులు (Sesame seed) 

  నువ్వులు వేడిచేస్తాయి. వాతం, చర్శలను దేహపుష్టి కలిగించే మంచి బలమయిన ఆహారం, రక్తవృత్తి వి మూలవ్యాధి వున్నవారికి మేలుచేస్తుంది. కఫం, పైత్యాలను పెంచుకుంది. అసలు జీర్ణమవుతుంది. పెరుగు, ఉప్పు, తేనె, వేయించడం దీనికి విరుగు

 👉నువ్వుపప్పు రుచిగా వుండి బలమిస్తుంది. బెల్లం కలిపి నూరిన బలమిచ్చే రుచికరమయిన చిరుతిండి. అయితే అతిగా తింటే గుండె, ఊపిరితిత్తులకు నీరు చేరుస్తుంది. వేయించిన పప్పుని తీసుకుంటే ఈ దోషం పోతుంది. 

👉 బెల్లం పాకం పట్టిన నువ్వుల వుండలు వాతం, నేత్రరోగాలను నివారిస్తాయి. క్యాల్షియం పెరుగుతుంది జుట్టు రాలడం ఆగిపోతుంది వీర్యవృద్ధి చేసి, పుంస్త్వమును పెంచుతాయి. 

👉నువ్వులలో కొంచెం జీలకర్ర, చింతపండు, మిరపకాయలు వేసి నూరిన పచ్చడిచాలా రుచిగా వుంటుంది. జఠరదీప్తినిచ్చి, వాతాన్ని పోగొట్టి బలాన్నిస్తుంది.

👉నువ్వులు వేయించి కొన్ని ఎండుమిరప, జీలకర్ర, ఉప్పు కలిపి దంచిన పాటు అన్నంలో కలుపుకుంటే రుచిగా బలమిస్తుంది.

👉నువ్వులతో చేసిన వడియాలు కూడా వాతాన్ని హరిస్తాయి. ఉష్ణాన్పిస్తాయి. ఇలం, జఠరదీప్తి కల్గిస్తాయి. అయితే కఫం పెంచుతాయి.

👉 నల్లనువ్వులలో ఔషధగుణాలున్నాయి. చర్మవ్యాధులకు నల్లనువ్వులు మంచినివారిణి.

  👉నల్ల నువ్వులు, వేపాకు సమానపాళ్ళలో తీసుకుని వేయించి అందులో కొబ్బరినూనె కలిపి నూరి ముద్దచేయండి. అందులో మెత్తని కర్పూరం, పసుపుపొడి కలపండి. దెబ్బలకు, పుండ్లకు ఇది చాలామంచి పైపూత మందు.

 👉 పెళ్ళికాని పిల్లలలకు ఋతుసమయంలో వచ్చే శూలలు (చురుకు మంటలు). వేయించిన నల్లనువ్వుల పొడి అర టీస్పూను వేడినీళ్ళతో రోజుకు రెండుమార్లు

తీసుకుంటే పోతాయి.

 👉రక్తస్రావమవుతున్న పైల్స్ వ్యాధికి, టేబుల్ స్పూను దోరగా వేయించిన నల్లనువ్వులు ఓ టేబుల్ స్పూన్ పటికబెల్లం కలిపి నమిలి, కప్పు మేకపాలు తాగితే రక్తస్రావం నిలిచిపోతుంది.

👉ఆ స్నానానికి ముందు నువ్వులనూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకుని స్నానం చేయడంవల్ల వేడి తొలగి శరీరం తేలికగా వుంటుంది.

  👉కాలిన గాయాలకు నువ్వులనూనె పూస్తే త్వరగా నయమవుతాయి.

👉 మూడు నెలల పిల్లల నుండి ఆరు సంవత్సరాల వరకు, చిన్న పిల్లలకు ప్రతిరోజూ నువ్వుల నూనె మర్దన చేసి స్నానం చేపిస్తే, ఎముకలు కండరాలు పటిష్టంగా బలంగా పెరుగుతాయి, శరీరం బాగా మెరుస్తుంది.... ఎలాంటి క్రీములు వాడనవసరం లేదు

👉 వంటనూనెగా నువ్వుల నూనె వాడటం వలన ఆరోగ్యంగా ఉండగలుగుతారు వాత నొప్పులు రావు...


PRUDHVIINFO

@PRUDHVIINFO

Prudhviinfo is one of the leading information website aimied at helping people understand and use knowledge in bette way

GET NOTIFIED OUR CONTENT