-->

Subscribe to PRUDHVI INFO by Email

Enter your email address:

Delivered by FeedBurner

Subscribe to PRUDHVI INFO by Email

నీరసం తగ్గాలంటే! | Prudhviinfo



 నీరసం తగ్గాలంటే!

ఈ రోజుల్లో 70, 80 సం॥ల వయసులో ముసలివారికి ఉన్న ఓపిక 40, 50 సం||ల వయసులో ఉన్నవారికి లేదు. 40, 50 సం॥ల వారితో పోలిస్తే పెళ్ళీడుకు వచ్చిన పిల్లలకు లేదు. పెళ్ళీడు పిల్లలతో పోలిస్తే చిన్న వయసు పిల్లలు మరీ బలహీనంగా ఉంటున్నారు. ఇలా

చూస్తూ ఉంటే భవిష్యత్తులో తినే ఓపిక కూడా లేక తినిపెట్టు అనే రోజులు. రాబోతున్నాయి. దీనికి కారణం బలం లేని ఆహారం తినడం. రుచికి తింటున్నారే. గాని బలానికి, ఆరోగ్యానికి కాదు. రోజుకి 15, 18 గం||లు పనిచేసినా ఓపిక తగ్గకూడదంటే.

 👉చిట్కాలు:--

 1) అన్నింటికంటే ఎక్కువ బలమైన ఆహారం కొబ్బరి. రోజుకి ఒక పచ్చి కొబ్బరికాయను పూర్తిగా ఉదయం పూట టిఫిన్లాగా తింటే (మొలకెత్తినగింజలు వాటితో పాటు) మంచిది. 

2) ఖర్జూరం పండు చాలా ఎక్కువ శక్తిని తక్కువ టైములో అందించగలదు. రోజుకి 20 ఖర్జూరం పండ్లను ఉదయం కొబ్బరితోగాని సాయంకాలం పండ్లతో గాని కలిపి తింటే లాభం చాలా త్వరగా వస్తుంది. 

3) ముడిబియ్యం అన్నం వండుకుని రెండు పూటలా తింటే 10, 15 రోజులలోనే ఓపిక పెరుగుతుంది. ఈ మూడు విషయాలు ఆచరిస్తే ఒక నెలలోనే పూర్తిగా ఓపికను, బలాన్ని సంపాదించుకోవచ్చు. 

4) ఎప్పుడన్నా ఉన్నట్లుండి నీరసం వచ్చి కళ్ళు తిరిగితే అలాంటప్పుడు వెంటనే శక్తి కొరకు తేనెను 3, 4 స్పూ తీసుకుని మెల్లమెల్లగా నాకుతుంటే, 5, 10 ని॥లోనే ఓపిక వచ్చేస్తుంది.

5) అశ్వగంధ చూర్ణం లేదా అశ్వగంధ లేహ్యం లేదా అశ్వగంధ టాబ్లెట్స్, రోజూ రెండు పూటలా వాడండి కనీసం నలభై రోజులు నీరసం తగ్గుతుంది.

6) శరీరంలో రక్తం తక్కువ ఉన్న నీరసం వస్తది రక్తం పెరగడానికి మంచి పండ్లు, క్యారెట్ బీట్రూట్ లాంటివి తినండి